twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫిజికల్ టాస్క్‌లో గంగవ్వ అదుర్స్.. తేలిపోయిన అభిజీత్‌.. ఆ కామెంట్లపై క్లారిటీ ఇచ్చిన టీం!!

    |

    బిగ్‌బాస్ షోలో అసలైన మజా వచ్చేసింది. మూడో వారం పదహారో రోజు బిగ్‌బాస్ ఇచ్చిన రోబోలు-మనుషుల టాస్క్ దుమ్ములేచిపోయింది. టాస్క్ సగం కూడా పూర్తి కాలేదు గానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఫుల్లుగా ఇచ్చేశారు. రోబోల టీం వారి వారి ప్రాణాలను కాపాడుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించారు. ఇక మనుషుల టీం మేట్స్ ఎలాగైనా సరే రోబోల ప్రాణాలను తీయాలని ప్రయత్నించారు. అందులో సఫలమయ్యారు. ఓ రోబోను చంపేశారు కూడా. అయితే ఈ టాస్క్ అంతట్లో అభిజీత్ మాత్రం అందర్నీ నిరాశపరిచాడు.

     అసలు టాస్క్ ఏంటంటే..

    అసలు టాస్క్ ఏంటంటే..

    ఉక్కు హృదయం అనే ఈ టాస్క్‌లో రోబోల టీంలో అభిజీత్, కుమార్ సాయి, ఆరియానా, హారిక, దేవీ నాగవల్లి, గంగవ్వ, అవినాష్‌లు ఉన్నారు. మిగతా వారంతా మనుషుల టీంలో ఉన్నారు. సిల్వర్ బంతిని పగలగొడితే ఒక రోబో చనిపోతుంది.. చివరి వరకు ఒక్క రోబో అయినా మిగిలినా మనుషుల టీం ఓడిపోతుంది. అయితే గెలిచిన టీం సభ్యులే కెప్టెన్సీకి అర్హులని మెలికపెట్టాడు.

     ముందు నుంచి వెనక్కి..

    ముందు నుంచి వెనక్కి..

    ఉక్కు హృదయం టాస్క్‌లో అభిజీత్ ముందు నుంచి వెనక్కే ఉంటూ వస్తున్నాడు. అటు సైడ్ అందరూ స్ట్రాంగ్ అని మనం వారిని ఆపలేం అంటూ నిరుత్సాహపరిచాడు. అలా అనకు కనీసం ప్రయత్నం చేయాలి కదా అని హారిక, దేవీ నాగవల్లి, లాస్య ఎంత చెప్పినా ముందుకు రాలేదు. మనుషుల టీం మీద పడుతున్నా సరే అభిజీత్ దూరంగా నిలబడి చోద్యం చూస్తున్నట్టు ఉండిపోయాడు.

    గంగవ్వ సైతం..

    గంగవ్వ సైతం..

    గంగవ్వ సైతం టాస్కులో అదరగొట్టేసింది. సిల్వర్ బాల్‌ను తన దగ్గరే పట్టుకుని కూర్చుంది. ఎంతమంది వచ్చినా పట్టు వీడలేదు. తనకు చేతనైనంతలో కాపాడే ప్రయత్నం చేసింది. అయితే అభి మాత్రం ఏ కొంచెం కూడా ఎఫర్ట్స్ పెట్టలేదు. అయితే ఇరు టీంల వద్దకు వెళ్లి శాంతి ప్రస్థావనలు మాట్లాడాడు. అవినాష్, కుమార్, తాను మాత్రమే ఉన్నాం మీ వైపే అందరూ ఉన్నారంటూ వారితో వాదించసాగాడు.

    ఆరియానా, కుమార్ సాయిలతో..

    ఆరియానా, కుమార్ సాయిలతో..

    ఇక కుమార్ సాయి చెప్పిన పాయింట్‌ను పట్టించుకోలేదు. మనకి కూడా చార్జింగ్ అవసరం.. మనకు అవసరం పడ్డప్పుడు వారు కూడా ఇలాగే బెట్టు చేస్తే ఎలాగా? అంటూ అంతగా పట్టించుకోలేదు. చివరకు అదే జరిగింది. రోబోలోకు చార్జింగ్ ఇచ్చేందుక ససేమిరా ఒప్పుకోలేదు. ఇక మనుషుల టీం సభ్యులు గార్డెన్ ఏరియాలోనే అన్ని పనులు కానిచ్చేస్తున్నారు. వాటిని అడ్డుకుందామని ఆరియానా చెప్పినా అభిజీత్ ఒప్పుకోలేదు.

    Recommended Video

    Bigg Boss Telugu 4 : Episode 16 Highlights,అరియానా Vs సోహైల్..కత్తులు దూసుకొన్న సెలబ్రిటీలు!
    క్లారిటీ ఇచ్చిన టీం..

    క్లారిటీ ఇచ్చిన టీం..

    ఇక ఈ మేరకు అభిజీత్‌పై నెగెటివ్ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు లేవనెత్తిన పాయింట్లకు అభిజీత్ టీం క్లారిటీ ఇచ్చింది. శక్తిని వృథా ఎందుకు చేసుకోవడం అని వాళ్లను ఎలాగూ ఆపలేమని అన్నాడు,, దుప్పట్లు లాగడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అందుకే ఆరియానాను వద్దని వారించాడంటూ చెప్పుకొచ్చారు.

    English summary
    Bigg Boss 4 Telugu Day 16 Abhijeet Not Involving Physical Task, Bigg Boss 4 Telugu Day 16 Bigg Voss Gave Human Vs Robot Task.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X