For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్‌బాస్ తెలుగు 4లో 9వారం ఎలిమినేట్ అయ్యేదెవరు? టాప్ 5లో ఉండేదెవరు?

  |

  బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ విషయంలో ఆడియెన్స్ మెల్లగా కనెక్ట్ అవుతున్నారని అర్ధమవుతోంది. అలాగే అప్పుడప్పుడు చిరాకు వస్తోందిని ఎక్కడో తేడా కొడుతోందనే అనుమానం కూడా ఎక్కువవుతోంది. చాలా కాలంగా షోకి సంబంధించిన టాస్క్ లు బాగానే వైరల్ అవుతున్నాయి. అన్ని వర్గాలను ఆకట్టుకున్నాయా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక ఫిల్మీ బీట్ నిర్వహించిన సర్వేలో ఆడియెన్స్ ఏమనుకుంటున్నారు అనే విషయంలో ఒక క్లారిటీ అయితే వచ్చినట్లు అనిపిస్తోంది. ఆ సందేహాలపై ఒక లుక్కేస్తే..

  ఫిల్మీ బీట్ సర్వే..

  ఫిల్మీ బీట్ సర్వే..

  ఫిల్మీ బీట్ ఆడియెన్స్ ఆలోచనలకు తగ్గట్లుగా క్రియేట్ చేసిన సందేహాలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. లక్షలాది మంది బిగ్ బాస్ పై వేసిన ప్రశ్నలకు వారి ఓట్లతో అసలు సమాధానం ఇచ్చారు. దీంతో ఒక విధంగా ప్రజల నిర్ణయాలాతో అసలు బిగ్ బాస్ అనుమానాలకు తావివ్వకుండా నడుస్తోందా లేదా అనే విషయంలో కూడా క్లారిటీ వస్తోంది.

  ఈ వారం ఎలిమినేట్ కాబోయేది ఎవరంటే..

  ఈ వారం ఎలిమినేట్ కాబోయేది ఎవరంటే..

  బిగ్ బాస్ ఎలిమినేషన్స్ పై ఒక లుక్కేస్తే ఈ సారి పెద్దగా కన్ఫ్యూజన్ లేకుండా ఆడియెన్స్ అమ్మా రాజశేఖర్, హారిక అని భావిస్తున్నారు. వారి ఇద్దరికి కలిపి అత్యధికంగా 31% ఓట్లు వచ్చాయి. మొదట మోనాల్ వెళ్లిపోతే షోలో సరసాలు తగ్గుతాయని అనుకుంటున్నారని అర్ధమయ్యింది. కానీ ఇప్పుడు ఆమెను కేవలం 18% జనాలు మాత్రమే వెళ్లిపోవాలని అనుకుంటున్నారు. అభిజిత్ వెళ్లిపోవాలని 5% మంది మాత్రమే భావిస్తున్నారు.

   కాలునొప్పి డ్రామాలు.. సమర్థిస్తారా?

  కాలునొప్పి డ్రామాలు.. సమర్థిస్తారా?

  కాలు నొప్పితో డ్రామాలు అంటూ నోయల్ సీన్ పై అవినాష్ వ్యాఖ్యలు సమర్థిస్తారా అనే ప్రశ్నపై కూడా తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. కాదు అని 59% పైగా జనాలు వారి భావనను తెలియజేశారు. అవును అని కేవలం 39% మంది మాత్రమే సమర్దించారు. చెప్పలేము అని 4% జనాలు వివరణ ఇచ్చారు.

  బిగ్ బాస్ లో కన్నింగ్ గేమ్?

  బిగ్ బాస్ లో కన్నింగ్ గేమ్?

  ఇక ఎలిమినేషన్స్ పోటీ తీవ్రత ఎక్కువైన సనయంలో కన్నింగ్ గేమ్ ఆడుతున్నదేవరు అనే విషయంలో అమ్మా రాజశేఖర్ మొదటి వ్యక్తి అంటూ 31% జనాలు భావిస్తున్నారు. గతంలో మాస్టర్ ని జనాలు బాగానే లైక్ చేశారు గాని ఈ వారం అతను అబిజిత్ గొడవతో కాస్త బ్యాడ్ అయ్యాడు. గత రెండు వారాల్లో అతని తీరుపై ఆడియెన్స్ చాలా అసంతృప్తిగా ఉన్నట్లు సోషల్ మీడియాలో వస్తోన్న కామెంట్స్ చూస్తుంటేనే అర్ధమవుతోంది. ఇక ఆ తరువాత కన్నింగ్ ప్లేయర్ స్థానంలో అవినాష్ ఉండడం విశేషం. ఈ ఇద్దరిపై అభిజిత్ ఎఫెక్ట్ గట్టిగానే పడింది.

  టాప్ 5లో ఉండేదెవరు

  టాప్ 5లో ఉండేదెవరు


  ఇక టాప్ 5లో ఉండేదెవరు అనే విషయానికివస్తే 30% జనాలు అభిజిత్ ఉంటారని చెబుతున్నారు. కొంతవరకు ఇదే విషయం చాలా రోజులుగా జనాలను చాలా కన్ఫ్యూజన్ కి గురి చేస్తోంది. షోలో అతన్ని ఒక్కడినే హైలెట్ చేస్తున్నారు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. అతనికి పోటీగా 26% జనాల సపోర్ట్ తో అవినాష్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. టాప్ 5లో లాస్య ఉండడం కష్టమే అనిపిస్తోంది. హారిక, అమ్మా, సోహైల్, అఖిల్ లు కూడా చాలా తక్కువ సపోర్ట్ తో ఉన్నారనిపిస్తోంది.

  బిగ్ బాస్ 4 టాస్కులు ఎలా ఉన్నాయి

  బిగ్ బాస్ 4 టాస్కులు ఎలా ఉన్నాయి

  ఫైనల్ గా బిగ్ బాస్ 4 టాస్కులు ఎలా ఉన్నాయనే విషయంలో కూడా ఆడియెన్స్ ఊహించని విధంగా స్పందిస్తున్నారు. స్టార్ మా మాత్రం షోకి అద్భుతమైన క్రేజ్ అందుతున్నట్లు తీరిక లేకుండా ప్రమోషన్స్ డోస్ పెంచుతోంది. ఇక సర్వేలో 73% శాతంకి పైగా జనాలు టాస్కులు ఏ మాత్రం ఆసక్తికరంగా కొనసాగడం లేదని అంటున్నారు. కెవలన్ 20% మాత్రమే ఆసక్తికరంగా ఉందని అంటున్నారు. ఇక మిగతా 7శాతం ఎటు కాకుండా చెప్పలేము అన్నారు.

  English summary
  It is understood that audiences are slowly connecting in the case of Bigg Boss Season 4 contestants. There is also a growing suspicion that the occasional annoyance is making a difference somewhere. Shoki-related tasks have been going viral for a long time. Whether or not all categories are impressed has become a hot topic. A survey by Filmy Beat seems to have shed some light on what the audience thinks. If you take a look at those doubts .
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X