twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్‌ తెలుగు ఫైనల్స్ రేటింగ్స్: ఎన్టీఆర్, నాని రికార్డులను బ్లాస్ట్ చేసిన నాగ్.. ఖర్చు ఎంతయ్యిందంటే?

    |

    బిగ్ బాస్ సీజన్ 4 మొదలైనప్పుడు ఈ సారి అంతగా బజ్ క్రియేట్ చేయదేమో అనే అనుమానాలు చాలానే వచ్చాయి. ముఖ్యంగా కంటెస్టెంట్స్ విషయంలో బిగ్ బాస్ ఈ సారి అంచనాలను అందుకోలేదని రూమర్స్ కూడా చాలానే వచ్చాయి. కానీ రోజులు గడిచే కొద్దీ కంటెస్టెంట్స్ కు అభిమానులు పెరిగారు. ఆ తరువాత రేటింగ్స్ కూడా అదే పనిగా పెరుగుతూ వచ్చాయి. ఇక ఫైనల్స్ కు అయితే నెవర్ బిఫోర్ అనేలా రేటింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఒకసారి గత మూడు సీజన్స్ తో పాటు మొత్తం వచ్చిన రేటింగ్స్ పై ఒక లుక్కేస్తే..

    ఎన్టీఆర్ తెచ్చిన రేటింగ్ ఎంతంటే..

    ఎన్టీఆర్ తెచ్చిన రేటింగ్ ఎంతంటే..

    అన్ని సీజన్స్ ఫైనల్స్ రేటింగ్స్ పై ఒక లుక్కిస్తే.. మొదట జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఉన్న విషయం తెలిసిందే. అప్పుడు విన్నర్ విషయంలో కూడా సస్పెన్స్ బాగానే కొనసాగింది. శివబాలాజీ టైటిల్ విన్నర్ అవ్వగా ఆదర్శ్ బాలకృష్ణ రన్నరప్ గా నిలిచాడు. అప్పుడు రేటింగ్ 14.23 వచ్చింది. మొదటి ఎపిసోడ్ కు మాత్రం 16.8 టిఆర్పీ దక్కింది. అప్పుడైతే చీఫ్ గెస్ట్ ఎవరు రాలేదు.

    నాని ఎంత తెచ్చాడు..

    నాని ఎంత తెచ్చాడు..

    ఇక రెండవ సీజన్ కు నాని హోస్ట్ గా ఉండగా మొదటి రోజు 15.0 రేటింగ్ అందుకోగా ఫైనల్ కు 15.05 రేటింగ్ దక్కింది. అప్పుడు కౌషల్ మండా మంచి క్రేజ్ అందుకొని టైటిల్ విన్నర్ గా నిలిచాడు. ఇక సింగర్ గీతామాధురి రన్నరప్ గా నిలిచింది. ఫైనల్ గెస్ట్ గా విక్టరీ వెంకటేష్ వచ్చి టైటిల్ విన్నర్ కు బిగ్ బాస్ 2 ట్రోపిని అందించారు.

     3వ సీజన్.. నాగ్ ఎంట్రీతోనే న్యూ రికార్డ్

    3వ సీజన్.. నాగ్ ఎంట్రీతోనే న్యూ రికార్డ్

    ఇక మూడవ సీజన్ లో సరికొత్తగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున మొదటి రోజే అత్యధికంగా 17.92 రేటింగ్ తో రికార్డ్ క్రియేట్ చేశాడు. ఫైనల్ డేకు ఇంకాస్త ఎక్కువగా 18.29రేటింగ్ దక్కింది. అప్పుడు రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్ గా నిలిచి మెగాస్టార్ చేతుల మీదుగా ట్రోపిని అందుకున్న విషయం తెలిసిందే. ఇక అప్పుడు శ్రీ ముఖి రన్నరప్ గా నిలిచింది.

    గత రికార్డులు బ్లాస్ట్ అయ్యేలా..

    గత రికార్డులు బ్లాస్ట్ అయ్యేలా..

    ఇక ఈ సారి సీజన్ 4 ఫైనల్ రేటింగ్ ఎంత వచ్చింది అంటే.. గత రికార్డులను తిరగరాస్తూ 19.5రేటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. షో మొదలైన రోజు కూడా అత్యధికంగా 18.5రేటింగ్ రావడం గొప్ప విషయమనే చెప్పాలి. బిగ్ బాస్ కు తెలుగులో ఆదరణ తగ్గుతోందని వచ్చే కామెంట్స్ కూడా అబద్ధమే. ఇక రేటింగ్స్ హడావుడి చూస్తుంటే మరో సీజన్ ను వీలైనంత త్వరగా స్టార్ట్ చేసి మళ్ళీ నాగార్జుననే హోస్ట్ గా ఫిక్స్ చేసేలా ఉన్నారని అనిపిస్తోంది.

     బిగ్ బాస్ తెలుగు 4.. ఎంత ఖర్చయ్యిందంటే..

    బిగ్ బాస్ తెలుగు 4.. ఎంత ఖర్చయ్యిందంటే..

    బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విషయానికి వస్తే ఈ సారి ఖర్చు మామూలుగా పెట్టలేదు. హీరోయిన్స్ తో డ్యాన్సులు, థమన్ మ్యూజిక్ అంతే కాకుండా భారీ సెటప్.. హై టెక్నాలజీ సిస్టమ్.. ఇలా అన్ని రకాలుగా ముందే ప్లాన్ చేసుకున్న బిగ్ బాస్ టీమ్ ఒక రెండు కోట్లకు పైగానే ఖర్చు చేశారట.

    English summary
    When Bigg Boss Season 4 started, there was a lot of doubt as to whether it would create such a buzz this time around. There have also been a lot of rumors that Bigg Boss did not live up to expectations this time around, especially in terms of contestants. But as the days went by the fan base for the contestants increased. Since then the ratings have been rising as well. It seems that the finals have got ratings like Never Before. Once you take a look at the total ratings along with the last three seasons
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X