మోనాల్‌పై పడి కొరికేసిన కంటెస్టెంట్.. వెళ్లేలోపు చేయాల్సింది చేసేస్తా

బిగ్ బాస్ షో ఫైనల్స్ కు చేరువవుతున్న కొద్దీ ఎంతో ఆసక్తికరంగా మారుతోంది. హౌజ్ లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్స్ లలో ఈ వారం వెళ్లిపోయేది ఎవరనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఎక్కువగా సోహెల్, అరియానా ఈ వారంలో ఫోకస్ అయ్యారు. గోడవలతో నానా బీభత్సం చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఏడ్చేశారు కూడా. ఇక గురువారం ఎపిసోడ్ లో మాత్రం కంటెస్టెంట్స్ కాస్త సరదాగా గడిపారు. కొన్ని అలకలు అలాగే కామెడీ పంచ్ లతో కంటెస్టెంట్స్ కొత్త వాతావరణాన్ని క్రియేట్ చేశారు.

పిల్లలు ఎలా పుడతారు మోనాల్

పిల్లలు ఎలా పుడతారు మోనాల్

గురువారం 96వ ఎపిసోడ్ లో అభిజిత్ ఎక్కువగా తన మాటలతో మరోసారి ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేశాడు. చాలా రోజుల తరువాత మోనాల్ తో కూడా అతను నవ్వుతూ మాట్లాడాడు. మొదట్లో ఉన్న అభికి ఇప్పుడున్న అభికి ఏ మాత్రం మార్పు లేదు అన్నంతగా పాజిటివ్ కామెంట్స్ అయితే గట్టిగానే అందుకుంటున్నాడు. ఏకాగ్రత టాస్క్ లో మోనాల్ ను పిల్లలు ఎలా పుడతారు అంటూ చిలిపి ప్రశ్నలు వేస్తూ అందరిని నవ్వించాడు.

తప్పులను ఎత్తి చూపుతూ

తప్పులను ఎత్తి చూపుతూ

ఇక షో స్టార్ట్ అవ్వగానే సోహెల్ చేసిన తప్పులను ఎత్తి చూపుతూ హారిక, అభిలకు వివరించింది అరియానా. అతను టాస్క్ ను టాస్క్ లా ఆడకుండా మ్యాటర్ ను ఎక్కడికో తీసుకెళ్లాడు. పర్సనల్ విషయాలను ఎత్తి చూపడం ఎంతవరకు కరెక్ట్ అంటూ అరియానా వివరణ ఇచ్చింది. ఇక సోహెల్ కూడా అరియానా చేసిన తప్పుల గురించి మోనాల్, అఖిల్ ల ముందు బయటపెట్టాడు.

 నాకు జీతం కావాలి

నాకు జీతం కావాలి

గురువారం ఎపిసోడ్ లో మిగతా విషయాలను పక్కనపెడితే ఉదయమే ఒక సరదా సన్నివేశం చోటుచేసుకుంది. మోనాల్, సోహెల్ ఎంత క్లోజ్ గా ఉంటారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బ్రదర్, సిస్టర్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ కొన్నిసార్లు ఎమోషన్స్ తో గోరింటాకు సినిమాను తలపిస్తున్నారు. ఇక కిచెన్ లో పని చేసి సహాయ పడినందుకు నాకు జీతం ఇవ్వాలని సోహెల్ సరదాగా గొడవ పెట్టుకున్నాడు. అలాగే కోటర్ తెచ్చుకొని తాగుతాను అంటూ మోనాల్ ను ఎడిపించే ప్రయత్నం చేశాడు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Rahul Sipligunj Slams Trollers
మీద పడి కొరికేసిన సోహెల్

మీద పడి కొరికేసిన సోహెల్

ఇక మోనాల్ కూడా తనదైన శైలిలో సోహెల్ కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇప్పుడు డబ్బులు ఇవ్వడం కుదరదని మరో రెండు వారాలు ఆగాల్సిందేనని మోనాల్ చెప్పడంతో సోహెల్ ఆమె మీద పడి చేతిని కొరికే ప్రయత్నం చేశాడు. అనంతరం చపాతీ చేసే వేడి వేడి పాన్ తోనే అడ్డుకునే ప్రయత్నం చేసింది మోనాల్. అయితే వెళ్లేలోపు తప్పకుండా ఒక మచ్చ పెట్టేస్తా అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు సోహెల్. ఈ సీన్ మొత్తం చాలా సరదాగా కొనసాగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X