Just In
Don't Miss!
- Sports
గబ్బా టెస్ట్ విజయం అత్యంత సంతోషాన్నిచ్చింది: మోడీ
- News
జగన్ రెడ్డి క్రూరత్వం.. దేవినేని ఉమా అరెస్ట్ అక్రమం ; కొడాలి నానిపై కేసు పెట్టాలని చంద్రబాబు ఆక్రోశం
- Finance
9 శాతం వడ్డీకే క్రెడిట్ కార్డు క్యాష్: కస్టమర్లకు తక్కువ, వారికి మాత్రం ఎక్కువ వడ్డీ
- Automobiles
ముఖేష్ అంబానీ సెక్యూరిటీలో చేరిన 4 కొత్త కార్లు.. ఒక్కక్కటి 2 కోట్లకు పైమాటే
- Lifestyle
ఈ హార్మోన్ల సమస్య ఉన్న మహిళలు బరువు తగ్గడం చాలా కష్టం...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కెప్టెన్‌ని చేసినందుకు వెన్నుపోటు పొడిచిన హారిక.. కుమిలి కుమిలి ఏడ్చిన మోనాల్
బిగ్ బాస్ షో నాలుగవ సీజన్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. వీకెండ్స్ లో ఫన్ తో పాటు ఎలిమినేషన్స్ ట్విస్టులు ఎన్ని ఉన్నప్పటికీ సోమవారం మాత్రం షోకు భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఎలిమినేషన్ ప్రక్రియలో మలుపు తిరిగేది సోమవారమే కాబట్టి మొదటి నుంచి రేటింగ్స్ గట్టిగానే ఉన్నాయి. ఇక ఈ సోమవారం జరిగిన ఎపిసోడ్స్ లో బిగ్ బాస్ లో నెవర్ బిఫోర్ ట్విస్టులు చాలా చోటు చేసుకున్నాయి. ఇక ఫైనల్ గా మోనాల్ కు వెన్నుపోటు పొడిచింది హారిక..

సేవ్ అయినప్పటికీ ఇరకాటంలో పడేసిన బిగ్ బాస్
హౌజ్ లో బజార్ మొగగానే కంటెస్టెంట్స్ గార్డెన్ లో ఉన్న టోపీలను ధరించాలి. హారిక తప్పితే డేంజర్ జోన్ లో ఉన్న అందరూ ఒక్కసారిగా బయటకు పరిగెత్తి టోపీలను పెట్టుకున్నారు. అప్పుడే బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇక రెడ్ కలర్ టోపీలను ధరించిన అవినాష్, అభిజిత్, అఖిల్ , అరియానా నామినేట్ అయినట్లు చెప్పారు బిగ్ బాస్. వాళ్ళు శవపేటికలోకి వెళ్లాల్సి వచ్చింది. ఇక అదృష్టవశాత్తూ గ్రీన్ కలర్ టోపీలను ధరించారు మోనాల్, సోహైల్. సేవ్ అయినప్పటికీ ఇరకాటంలో పడేశాడు బిగ్ బాస్.

స్వాప్ చేసుకోవచ్చని చెప్పడంతో
దీంతో మొదట అవినాష్ షాక్ అయ్యాడు. గేమ్ సరిగ్గా అడలేమన్నట్లుగా ఇంటికి వెళ్లిపోవాలా అని నామినేషన్ ప్రక్రియను తప్పుపట్టాడు అవినాష్. దీంతో అభిజిత్ కూడా ఇది మన తలరాత బ్రదర్ అంటూ కౌంటర్ ఇచ్చాడు. అయితే నామినేషన్ ప్రక్రియ ఇంకా పూర్తవ్వలేదన్న బిగ్ బాస్ బయట ఉన్నవారిని స్వాప్ చేసుకోవచ్చని షాక్ ఇచ్చాడు. అయితే మొదట అందరిమధ్య వాదనలు గట్టిగానే కొనసాగాయి.

వెన్నుపోటు పొడిచిన హారిక
నేను వెళ్లనంటే వెళ్ళాను అంటూ అఖిల్, అవినాష్, అరియానాలను కడిగి పారేసింది మోనాల్. అయితే అభిజిత్ మాత్రం ఎవరిని అడగలేదు. ఇక ఎటు తేలకపోవడంతో కెప్టెన్ హారికకు పవర్స్ ఇచ్చిన బిగ్ బాస్ ఆమెకు తుది నిర్ణయం ఇవ్వగా ఊహించినట్టుగానే మోనాల్ స్వాప్ అవ్వాలని అభిజిత్ ను సేవ్ చేసింది. ఒక విధంగా వెన్నుపోటు పొడిచేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఇంటి కెప్టెన్ అవ్వడానికి మోనాల్ హరికను భుజాలపై మోసిన విషయం తెలిసిందే.

కుమిలి కుమిలి ఏడ్చిన మోనాల్
హారిక కెప్టెన్ అవ్వడానికి మోనాల్ ఎంత కష్టపడిన కానీ.. హారిక సోహైల్ ని కాకుండా మోనాల్ ని డేంజర్ జోన్ లోకి పంపేసింది. ఇక చివరకు స్వాప్ విషయంలో కుమిలి కుమిలి ఏడ్చిన మోనాల్ సరైన వ్యక్తితో చేయమని కోరింది. ఇక అభిజిత్ కోసం వెళ్లక తప్పలేదు. అభిజిత్ ఎవరు సపోర్ట్ లేకుండా అడుతున్నాడు అతనికంటే బెస్ట్ ఆప్షన్ మరొకటి లేదని చెప్పిన రీజన్ కాస్త సిల్లిగానే ఉన్నట్లు అర్ధమయ్యింది. ఎందుకంటే హారిక, అభికి చాలక్ క్లోజ్ అని అందరికి తెలిసిన విషయమే.