Just In
- 9 min ago
RED box office: 4వ రోజు కూడా కొనసాగిన రామ్ హవా.. ఇప్పటివరకు వచ్చిన లాభం ఎంతంటే..
- 28 min ago
బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో: ఆ రికార్డులపై కన్నేసిన నటసింహం.. భారీ ప్లానే వేశాడుగా!
- 1 hr ago
అదిరింది షో గుట్టురట్టు చేసిన యాంకర్: అందుకే ఆపేశారంటూ అసలు విషయం లీక్ చేసింది
- 3 hrs ago
విజయ్ దేవరకొండ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్: అందరూ అనుకున్న టైటిల్నే ఫిక్స్ చేశారు
Don't Miss!
- News
కాస్మిక్ గర్ల్: పీఎస్ఎల్వీలు కాదు.. విమానం ద్వారా ఉపగ్రహాల ప్రయోగం: ఒకేసారి తొమ్మిది
- Automobiles
ఈ ఏడాది భారత్లో లాంచ్ కానున్న టాప్ 5 కార్లు : వివరాలు
- Lifestyle
ఆరోగ్య సమస్యలకు మన పూర్వీకులు ఉపయోగించే కొన్ని విచిత్రమైన నివారణలు!
- Finance
పెట్రోల్, డీజిల్ ధరలు జంప్: హైదరాబాద్లో ఎంత ఉందంటే
- Sports
Brisbane Test: తొలిసారి ఐదేసిన సిరాజ్.. ఆసీస్ ఆలౌట్! టీమిండియా టార్గెట్ 328!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిగ్‌బాస్‌లో ఆఖరి నామినేషన్స్.. అరియానకు చుక్కలు చూపిస్తున్న కింగ్ సోహెల్.. రిటర్న్ గిఫ్ట్ పక్కా
బిగ్ బాస్ ఆల్ మోస్ట్ తుది దశకు చేరుకుంది. ఆదివారం నాగార్జున ఇచ్చిన ట్విస్టుతో అవినాష్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. డేంజర్ జోన్ లో ఉన్న ప్రతిసారి గుండెలు బాదుకునే అవినాష్ ఈ సారి మాత్రం గుండెను రాయి చేసుకున్నాడు. నవ్వుతూనే హౌజ్ లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఇక సోమవారం నుంచి హౌజ్ లో అసలైన నామినేషన్ ప్రక్రియల మొదలుకానుంది. అందుకు సంబంధించిన ప్రొమోని కూడా విడుదల చేశారు.

ప్రతి ఒక్కరి టార్గెట్.. సెట్టయ్యింది
నిన్నటివరకు సూపర్ సెవెన్ కంటెస్టెంట్స్ కాస్త ఇప్పుడు సూపర్ సిక్స్ లోకి వచ్చేశారు. అరియానా, మోనాల్, అభిజిత్, అఖిల్, హారిక, సోహెల్.. అందరూ చాలా బలంగా గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చూపు ఫైనల్స్ లోకి వెళ్లి టైటిల్ గెలవాలని ఆశపడుతున్నారు. ఇక ఈ వారాం ఆఖరి నామినేషన్ తప్పికచుకుంటే చాలు. కంటెస్టెంట్స్ కు ఒక పట్టు దొరికినట్లే.

హౌజ్ లో ఆఖరి నామినేషన్స్
ఇక రీసెంట్ గా విడుదల చేసిన ప్రోమో విషయానికి వస్తే.. హౌజ్ లో ఆఖరి నామినేషన్ అంటూ బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చేశాడు. ఇక ఫిజికల్ టాస్క్ లో భాగంగా ఒక గేమ్ సెట్ చేసినట్లు తెలుస్తోంది. ఫాస్ట్ గా వెళ్లి కిరీటాన్ని అందుకున్న సోహెల్ రాజుగా కొత్త అవతారం ఎత్తాడు. హౌజ్ లో ఇక అతను ఇష్టం ఉన్నట్లు పరిపాలించవచ్చని ఆదేశాలు రావడంతో సోహెల్ సంతోషంగా నవ్వేశాడు.

సోహెల్ vs అరియానా
ఇక అతని మొదటి టార్గెట్ ఎవరో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అరియానా గిన్నెలు మొత్తం తోమాలి అంటూ ఆజ్ఞాపించగా ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న అవకాశం ఇప్పుడు దొరికింది కదా అంటూ పక్క నుంచి అబిజిత్ పంచ్ కూడా వేశాడు. ఇక నాకు కిరీటం దొరక్కపోదా అంటూ అరియానా కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. నెక్స్ట్ నీకు టైల్స్ కూడా ఇస్తాను తోమాడానికి అంటూ పంచ్ వేయడంతో అందరూ నవ్వేశారు.

చెలరేగిన అరియానా
ఇక రాక్షసుడు టాస్క్ ను గుర్తు చేసుకున్న సోహెల్ అప్పుడు ఎలా ప్రవర్తించింది అంటూ చుక్కలు చూపించాడు సోహెల్. ఇక రాజుగారికి హారిక తినిపిస్తూ సేవలు చేసింది. ఇక అరియానాను పాటలు పాడి డ్యాన్స్ చేయమన్నారో ఏమో గాని చీపిరిని గిటార్ లాగా వాయిస్తూ నా లాగే నేనుంటాను.. అంటూ సిద్దార్థ్ సాంగ్ తో చెలరేగిపోయింది.

నరకం చూపించిన సోహెల్
ఇక రాజు ఏమైనా చేయవచ్చు కదా అంటూ నిద్రకుడా పోవడానికి సిద్ధమయ్యాడు బిగ్ బాస్. ఇక అరియానాపై గుడ్డు కూడా కొట్టించి నరకం చూపించాడు. చివరలో నాకు ఫ్యూచర్ కనిపిస్తోంది అంటూ కామెడీగా కౌంటర్ కూడా వేశాడు. బహుశా ఈ మహారాజా టాస్క్ లో ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చేలా ఉంది. ఇక దాని నుంచి బిగ్ బాస్ ఆఖరి నామినేషన్స్ ప్రక్రియను కొనసాగించవచ్చనే డౌట్ వస్తోంది. చూడాలి మరి ఏమవుతుందో..