Just In
Don't Miss!
- News
ద్వివేది, శంకర్‌పై బదిలీ వేటు.. 90 శాతం సర్పంచ్ సీట్లు గెలుస్తాం: పెద్ది రెడ్డి ధీమా
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఒక్క మాటతో అభికి నవ్వుతూనే షాక్ ఇచ్చిన మోనాల్.. అఖిల్ జాగ్రత్త అంటూ..
మొత్తానికి బిగ్ బాస్ హౌజ్ నుంచి మోనాల్ గజ్జర్ ఎలిమినేట్ అయ్యింది. షో మొదలైనప్పటి నుంచి కూడా ఎలిమినేషన్ లో ఉంటున్న మోనాల్ చాలా వరకు అదృష్టవశాత్తు సేవ్ అవుతూ వచ్చింది. అసలు ఆమె సేవ్ అవ్వడం ఏమిటని చాలా రకాల ట్రోలింగ్స్ వచ్చాయి. బిగ్ బాస్ కావాలనే ఆమెను సేవ్ చేస్తున్నట్లు కామెంట్స్ కూడా ఎక్కువగా వచ్చాయి. అయితే ఫైనల్ గా 14వ వారం మాత్రం అందరు ఉహించినట్లుగానే మోనాల్ కథ ముగిసింది. ఇక వెళ్ళేటప్పుడు ఆమె అభిజిత్ కు నవ్వుతూనే ఒక షాక్ ఇచ్చింది.

అభిజిత్ దూరం పెట్టడంతో..
మోనాల్ గజ్జర్ ఎంట్రీ ఇచ్చినప్పుడు అసలు ఈమె ఎక్కువ రోజులు ఉండదని సోషల్ మీడియాలో కామెంట్స్ చాలానే వచ్చాయి. ముఖ్యంగా అభిజిత్ ఫ్యాన్స్ అయితే అమ్మడిని ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు. మోనాల్ ఎక్కువగా ట్రయాంగిల్ లవ్ స్టోరీతోనే తన క్రేజ్ ను పెంచుకుంటూ వచ్చింది. ఇక అభి ఆమెను దూరం పెట్టడంతో మొత్తానికి అప్పటి నుంచి అఖిల్ తో క్లోజ్ గా ఉంటూ వస్తోంది.

ప్రైజ్ మనీ గెలిస్టే రియాక్షన్ ఎలా ఉంటుంది..
ఇక ఆదివారం నాగార్జున మొదట తనదైన శైలిలో ఫన్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా బిగ్ బాస్ ప్రైజ్ మనీ 50లక్షల గురించి చెబుతూ అంత డబ్బు వస్తే ఏం చేస్తారని అడుగగా ఒకొక్కరు ఒక్కో విదంగా ఆన్సర్ ఇచ్చారు. ఇక బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే ఎవరెవరు ఎలా రియక్ అవుతారో చేసి చూపించాలని కంటెస్టెంట్స్ ను కోరారు నాగార్జున. ఇక ఎలిమినేషన్ టాపిక్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు సీరియస్ మోడ్ లోకి వచ్చేశారు.

ఎలిమినేషన్ లో టెన్షన్ పెట్టిన నాగార్జున
నాగార్జున ప్రింటింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగించారు. మోనాల్, అరియానాను నిలబెట్టి.. ఫైనలిస్ట్ కు సంబంధించిన ఫొటో అందులో వస్తుందని రానివారు ఎలిమినేట్ అవుతారని నాగార్జున ఉత్కంఠను రేపుతూ చెమటలు పట్టించారు. ఇక ఫొటో అరియానాదేనని చాలా ఈజీగా ముందే అర్ధమయ్యింది. ఇక మోనాల్ ఎలిమినేట్ అవ్వడంతో ఒక్కసారిగా డౌన్ అయ్యింది. అంతా షాక్ అయ్యారు. నోట మాట రాలేదు.

ఇప్పుడు ఆ ఛాన్స్ మీకు వచ్చింది
ఇక వెళ్లేముందు కంటెస్టెంట్స్ గురించి మాట్లాడిన మోనాల్ మొదటి అభిజిత్ పై తన భావాన్ని తెలిపింది. నేను లేకపోతే అభిజిత్ మంచి ఫ్రెండ్ అవుతాడని చెప్పావు కదా.. ఇప్పుడు ఆ ఛాన్స్ మీకు వచ్చింది. బాగా వాడుకోండి అంటూ మోనాల్ చెప్పింది. ఇక అభిజిత్.. నేను అలా అనలేదు తల్లి అంటూ నువ్వు ఇక్కడే ఉండాలని కోరుకున్నాను అంటూ మరో వివరణ ఇచ్చాడు. ఇక బయటకు వెళ్లిన తరువాత కలుద్దాం అంటూ క్లారిటీ ఇవ్వగా నాగార్జున గట్టిగా నవ్వేశారు. అందరితో సరదాగా మాట్లాడిన మోనాల్ మళ్ళీ కలుద్దాం అంటూ గుడ్ బై చెప్పేసింది.