Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
పులిహోర రాజా, మిస్టర్ ఫర్ఫెక్ట్ కాదు.. నీకు అంత సినిమా లేదు.. అఖిల్ ఇజ్జత్ తీసిన మోనాల్
బిగ్ బాస్ షోలో మోనాల్ అఖిల్ ఎంత క్లోజ్‌గా ఉన్నారో బయటకు వచ్చాక కూడా అంతే క్లోజ్‌గా ఉన్నారు. మోనాల్ ముందుగా ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది. అలా బయటకు వచ్చిన మోనాల్.. అఖిల్, సోహెల్‌కు సపోర్ట్ చేయడం ప్రారంభించింది. మొత్తానికి సోహెల్ డబ్బులు తీసుకుని ఆటను మలుపు తిప్పేశాడు. అభిజిత్ విన్నర్‌గా నిలిచాడు. అఖిల్ రన్నర్‌గా ఇంటికి వెళ్లిపోయాడు. ఇదంతా అందరికీ తెలిసిందే. అయితే బిగ్ బాస్ షో అయిపోయింది.. ఫ్యాన్ వార్స్ మాత్రం ఇంకా ముగియలేదు. దాంతో పాటు కంటెస్టెంట్ల మధ్య దూరాలు, ప్రేమలు కూడా ఏమీ మారలేదు.
శరణ్య రవిచంద్రన్ హాట్ ఫోటో గ్యాలరీ..

మోనాల్ అఖిల్ అలా..
బయటకు వచ్చాక కూడా మోనాల్ అఖిల్ మధ్య మంచి బాండింగ్ ఏర్పడినట్టుంది. నిన్న రాత్రే ఫోన్‌లో బాగానే ముచ్చట్లు పెట్టుకున్నారట. కానీ మళ్లీ లైవ్‌లోకి వచ్చేసరికి కొత్తగా మాట్లాడుకున్నట్టు కలరింగ్ ఇచ్చారు. తాజాగా అఖిల్ ఓ మీడియా చానెల్‌తో ఇంటర్వ్యూలో ఉండగా.. సడెన్‌గా మోనాల్ కూడా ఫోన్ ఇన్‌లో వచ్చేసింది.

పాగల్ అంటూ..
మెనాల్ ఫోన్‌లో మాట్లాడుతూ ఉండగానే పాగల్ అంటూ అఖిల్ రొమాంటిక్ టచ్ ఇచ్చాడు. అఖిలే నెంబర్ వన్ అంటూ మోనాల్ కాంప్లిమెంట్ ఇచ్చింది. నెంబర్ వన్ అంటే ఎందులో అని సదరు యాంకర్ ప్రశ్నించింది. ఎందులో అంటే అన్నింట్లో నెంబర్ వన్ అంటూ మోనాల్ మరోసారి అఖిల్‌ను ఆకాశానికెత్తేసింది.

మిస్టర్ పర్ఫెక్ట్ కాదు..
నెంబర్ వన్ అంటూ మిస్టర్ పర్ఫెక్టా? అని యాంకర్ ప్రశ్నిస్తే.. మిస్టర్ పర్ఫెక్ట్ అయితే కాదు అంటూ అఖిల్‌కు మోనాల్ ఝలక్ ఇచ్చింది. అవునా ఎందుకు కాదు అంటూ యాంకర్ తిరిగి ప్రశ్నించగా.. కొంచెం పులిహోర రాజా కదా అంటూ కౌంటర్ వేసింది. దీంతో అఖిల్ లైవ్‌లోనే తలపట్టేసుకుని.. ఇజ్జత్ తీయకంటూ వేడుకున్నాడు.

మాట్లాడటమే లేదు...
బయటకు వచ్చాక మమ్మల్ని పట్టించుకోవడమే లేదు.. ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేయడం లేదంటూ మోనాల్ కౌంటర్ వేసింది. నువ్వే బిజీగా ఉన్నావ్.. నువ్వే మాట్లాడటం లేదంటూ ఇద్దరూ ముచ్చట్లు పెట్టుకున్నారు. బయట అఖిల్‌కు లేడీ ఫాలోయింగ్ బాగా పెరిగిందంటూ యాంకర్ మధ్యలోకి దూరింది.

అంత సీన్ లేదు..
లేడీ ఫాలోయింగ్ పెరిగింది.. మాతో మాట్లాడటమే లేదంటూ మోనాల్ చెప్పుకొచ్చింది. జెలస్ ఫీలవుతున్నావా? అని సదరు యాంకర్, అఖిల్ ఇద్దరూ అడిగారు. అంత లేదు.. అంత సినిమా లేదంటూ లైవ్‌లోనే అఖిల్ ఇజ్జత్ తీసేసింది. మొత్తానికి అఖిల్ మోనాల్ ముచ్చట్లు మాత్రం వైరల్ అవుతున్నాయి.
అందాలతో ఆకట్టుకొంటున్న దివ్య దురైసామి.. ఒంపు సొంపులతో..