Just In
Don't Miss!
- News
నిమ్మగడ్డ సంచలనం: ఇద్దరు కలెక్టర్లు సహా 9మందిపై వేటుకు ఆదేశం -ఎన్నికలకు అడ్డొస్తే అంతే!
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Sports
ఆ రెండు జట్లు సంజూ శాంసన్ ఇవ్వమన్నాయి.. అందుకే రాజస్థాన్ అలా చేసింది!
- Finance
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి రూ.7 కోట్లు టోకరా వేసిన కేటుగాడిపై ఈడీ కేసు, ఆ సంస్థ ఆస్తులు అటా
- Lifestyle
ఈ రాశుల వారు జన్మలో మిమ్మల్ని క్షమించరు.. వారెవరో తెలుసా..?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అభిజిత్‌ను దెబ్బ కొట్టడానికి న్యూ ప్లాన్.. ఎంత రెచ్చిపోయినా ఓట్లు పడేది వాళ్ళకే..
బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్ ఎవరనే విషయంలో ఇప్పటికే చాలా మందికి ఒక క్లారిటీ వచ్చేసింది. కానీ వాతావరణం ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుందో అర్థం కావడం లేదు. కొంతమంది కంటెస్టెంట్స్ ఎప్పటికప్పుడు వారి గేమ్ ప్లాన్ ను చేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో ఆ ఎఫెక్ట్ అభిజిత్ పై పడేలా బిగ్ బాస్ వెనకాల ఎదో ప్లాన్ జరుగుతోందని ఒక రూమర్ అయితే వస్తోంది. ఒక విధంగా షోలో పరిణామాలను గమనిస్తే అది నిజమే అనిపిస్తోంది.

టాప్ 5లో రేటింగ్స్ రావడం లేదట
బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరనే విషయం పక్కన పెడితే స్టార్ మా ఎక్కువగా ఫోకస్ పెట్టింది మాత్రం డైలీ రేటింగ్స్ పైనే. షోను కోట్లమంది విక్షిస్తున్నారని ప్రచారాలు అయితే గట్టిగానే చేస్తున్నారు. అయితే నాగార్జున వచ్చిన శని ఆదివారాల్లో కూడా సరిగ్గా రేటింగ్స్ రావడం లేదనదే ఇన్ సైడ్ టాక్. టాప్ 5 రేటింగ్స్ అందుకున్న వాటిల్లో సీరియల్స్ కంటే తక్కువ స్థాయిలో బిగ్ బాస్ స్థానం సంపాదించుకుందని కూడా టాక్ వస్తోంది.

అభిజిత్ ను నమ్ముకుంటే లాభం లేదని..
అసలు విషయంలోకి వెళితే అభిజిత్ ను నమ్ముకుంటే రేటింగ్స్ అంతగా పెరిగే అవకాశం లేదని అనుకున్నారో ఏమో గాని బిగ్ బాస్ మాత్రం పదునైన ప్లాన్ వేశాడనిపిస్తోంది. సోహెల్, అరియానా గొడవలతోనే ఈ వారం భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. హద్దులు దాటినా కూడా బిగ్ బాస్ కనీసం వారిని ఆపడానికి కూడా ప్రయత్నం చేయలేదు.

అభి విషయంలో
సోహెల్, అరియానా నెవర్ బిఫోర్ అనేలా మాటలతో యుద్ధం చేయడం ఓ వర్గం ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసినప్పటికీ మరికొందరికి మాత్రం చిల్లర లొల్లి అనిపించినట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఇక వారి మీద ఫోకస్ పెంచిన బిగ్ బాస్ అభిజిత్ స్క్రీన్ టైమింగ్ ను చాలా వరకు తగ్గిస్తున్నారనే చెప్పాలి. హారికకు సంబంధించిన సీన్స్ ను కూడా ఎక్కువగా చూపించడం లేదు.

అభి విషయంలో పంతం నెగ్గించుకోవాలని..
అభిజిత్ టైటిల్ విన్నర్ అని దాదాపు 70% శాతం మంది ఆడియెన్స్ మద్దతు పలుకుతున్నారని సర్వేలు కూడా చెబుతున్నాయి. అయితే ఆ అంచనాలు నిజమైతే బిగ్ బాస్ ఒక విధంగా ఫెయిల్ అయినట్లే. అందుకే అభిని తప్పించి తన పంతం నెగ్గించుకోవలని ప్రయత్నం చేస్తున్నట్లు టాక్. అయితే ఇప్పట్లో అభి వెళ్లిపోతే మాత్రం షోపై ప్రభావం గట్టిగానే పడుతుంది.

గొడవలు ఎక్కువ కావాలని..
ఇక గొడవలు ఎక్కువ కావాలని బిగ్ బాస్ చాలా బలంగా కోరుకుంటున్నట్లు అర్థమయ్యింది. సోహెల్ బిగ్ బాస్ ముందు ఏడ్చినప్పుడు మీ ఆట మీరు ఆడండి అంటూ మరింత బూస్ట్ ఇచ్చాడు గాని కాస్త కంట్రోల్ లో ఉండు బాబు అని మాత్రం చెప్పలేదు. ఇక అభిజిత్ ఈ వారంలో ఎక్కువగా ఫోకస్ అవ్వలేడు. అప్పట్లో అఖిల్ తో మాత్రమే గొడవలు ఉండేవి. కానీ ఇపుడు అవి కూడా లేవు.

ఎంత రెచ్చిపోయినా ఓట్లు మాత్రం వారికే..
టాస్క్ లో భాగంగా హారిక కూడా అభిజిత్ మాదిరిగానే కూల్ గా వెళ్లాలని చూస్తోంది. ఏదేమైనా బిగ్బాస్ మొత్తం ఎపిసోడ్ లలో ఈ మధ్య హారిక అభి యొక్క రన్ టైమ్ చాలా వరకు లేపేస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇక ఈ రోజు కూడా మరో చిచ్చు పెట్టడానికి బిగ్ బాస్ కొత్త ప్లాన్ వేశాడు. అయితే ఎవరు ఎంత రెచ్చిపోయినా కూడా ఓట్లు మాత్రం అభిజిత్, హరికలకు పడుతున్నట్లు టాక్ వస్తోంది. మరి బిగ్ బాస్ ఈ విషయంలో ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో చూడాలి.