Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిగ్ బాస్ విన్నర్ విషయంలో ఇది మాత్రం నిజమయ్యేలా ఉంది.. మరో అన్యాయం
బిగ్ బాస్ సీజన్ 4 మొదట్లో చాలా కూల్ గా మొదలయ్యిందనే చెప్పాలి. కంటెస్టెంట్స్ కేవలం ఎమోషనల్ గానే ఆలోచిస్తూ వచ్చారు. ఇక టాస్కులతో పోటీ పడినకొద్ది ఎమోషన్స్ ని అవసరం మేరకు బయటకు తీస్తూ వచ్చారు. కొందరు రంగులు మార్చడంలో ఊసరవెల్లిని మైమరిపించారు. ఇక దాదాపు బిగ్ బాస్ ఫైనల్ స్టేజ్ లోకి వచ్చినట్లే అనిపిస్తోంది. టాప్ 5 కంటెస్టెంట్స్ పై అనేక రకాల స్టోరీలు వైరల్ అవుతున్నాయి. చూస్తుంటే ఈ సారి కూడా ఒక విషయంలో అన్యాయం జరిగేలా ఉందని అనిపిస్తోంది.

అప్పటి నుంచి ఎలిమినేషన్ పై అనుమానాలు
బిగ్ బాస్ ఎలిమినేషన్స్ లలో నిర్వాహకులు ఆలోచించి బయటకు పంపిస్తారా లేక ఆడియెన్స్ ఓటింగ్స్ బట్టి ఫాలో అవుతారా అనేది అప్పుడప్పుడు కొంత అనుమానం కలిగిస్తోంది. కుమార్ సాయి ఎలిమినేషన్ నుంచి చాలా అనుమానాలు వస్తున్నాయి. అయితే అత్యంత కీలకమైన బిగ్ బాస్ విన్నర్ విషయంలో తుది నిర్ణయం ఎవరనే దానిపై కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మొదటిసారి ఫైనల్స్ లో ఒక అమ్మాయి..
తెలుగులో మొదటి సీజన్ నుంచి చూసుకుంటే ఇప్పటివరకు ఫైనల్ విన్నర్స్ లలో ఆడవాళ్లు లేరు. మొదట జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా నిర్వహించగా అందులో విన్నర్ గా శివబాలాజీ ఉండగా.. ఆదర్శ్ బాలకృష్ణ రన్నరప్ గా నిలిచాడు. ఇక రెండవ సీజన్ కి నాని హోస్ట్ గా ఉండగా కౌషల్ మండా టైటిల్ విన్నర్ గా నిలిచాడు. అయితే మొదటిసారి ఒక అమ్మాయి గీత మాధురి ఫైనల్స్ లో గట్టి పోటీని ఇచ్చి రన్నరప్ గా నిలిచింది.

ఇప్పుడైనా అమ్మాయి గెలుస్తుందా?
ఇక మూడవ సీజన్ ని నాగార్జున చాలా పవర్ఫుల్ గా నడిపించారు. రాహుల్ సిప్లిగుంజ్ మొదటి నుంచి తన టాలెంట్ తో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసి టాప్ యాంకర్ శ్రీ ముఖికి గట్టి పోటీని ఇచ్చాడు. అతను గెలవగా శ్రీ ముఖి రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే నాలుగవ సీజన్ లో అయినా అమ్మాయిలు ఎవరైనా టైటిల్ గెలుచుకుంటారా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారనుంది.

లాస్యను పంపడానికి కారణం అదే
కంటెస్టెంట్స్ లలో బలమైన ప్రజాదరణ ఉన్న వారిలో అభిజిత్ మొదటి స్థానంలో ఉన్నాడు. లాస్య ఫైనల్స్ వరకు ఉండవచ్చని అంతా అనుకున్నారు. కానీ ఆమె హౌజ్ లో చాలా కూల్ గా ఉంటోంది. హౌజ్ మెంట్స్ కూడా లస్యను ఏ విషయంలో పెద్దగా ఇబ్బంది పెట్టింది లేదు. ఇక బిగ్ బాస్ లో గొడవలు లేకపోతే రేటింగ్ తేవడం చాలా కష్టమని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కారణం మరేదైనా కూడా లాస్యను అందుకే పంపించి ఉండవచ్చని టాక్ వస్తోంది.

విన్నర్ అతనే అంటున్నారు
ఇక అభిజిత్ బిగ్ బాస్ విన్నర్ అంటూ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ప్రచారాలు వైరల్ అవుతున్నాయి. లాస్య వెళ్లిపోవడంతో మిగిలిన ఇద్దరు అమ్మాయిలు హారిక, అరియానా టైటిల్ విన్నర్ లిస్ట్ లో ఉంటారా అనేది హాట్ టాపిక్ గా మారింది. అరియానా, అవినాష్ జోడి ఇప్పట్లో బయటకు వెళ్లిపోయే ఛాన్స్ లేదనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇక వచ్చే వారం ఎవరు వెళ్లిపోతారో తెలియాలి అంటే ఈ వారం టాస్క్ చాలా కీలకం కానుంది. చూడాలి మరి..ఈ సారైనా అమ్మాయిలు ఎవరైనా బిగ్ బాస్ విన్నర్ గా నిలుస్తారో లేదో..