For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్ బాస్4 సీక్రెట్ స్క్రిప్ట్: ఫైనల్‌కు వెళ్లబోయే వారిలో ఆ ఇద్దరు..ఈసారైనా అమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వరా

  |

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 మొదలై నెల రోజులు దాటింది. ఇంకా మరో రెండు నెలల వరకు షోను ఇదే ఫ్లోలో కొనసాగించాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా టాస్క్ లతో మంచి హైప్ క్రియేట్ చేయాలని నిర్వాహకులు వేస్తున్న ప్లాన్స్ మామూలుగా లేవు. మొన్న హోటల్ టాస్క్ జనాలకు బాగానే కనెక్ట్ అయ్యింది. కేవలం ఎలిమినేషన్ తోనే కాకుండా షోలో కంటెస్టెంట్స్ మధ్య ఊహించని ట్విస్ట్ లను క్రియేట్ చేయాలని చూస్తున్నారు.

  స్టార్ మా నుంచే లీకులు..

  స్టార్ మా నుంచే లీకులు..

  ఇక ఎప్పటిలానే బిగ్ బాస్ షోకి సంబంధించిన లీక్స్ బాగానే వైరల్ అవుతున్నాయి. అసలు ఎలిమినేషన్ ప్రక్రియ మొదట్లోనే హౌజ్ నుంచి ఎవరు బయటకు వస్తారు అనే ట్విస్ట్ ని ఆడియెన్స్ ముందుగానే ఊహిస్తున్నారు. దానితో పాటు స్టార్ మా నుంచే లీకులు బయటకు వస్తున్నాయి. ఇటీవల షోకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. ఫైనల్స్ కి చేరుకునే సరికి టాప్ 5లో ఆ ఇద్దరు పక్కా హౌజ్ లో ఉంటారని తెలుస్తోంది.

  అభిజిత్ అందరికంటే ఎక్కువగా

  అభిజిత్ అందరికంటే ఎక్కువగా

  రీసెంట్ గా బిగ్ బాస్ హౌజ్ లో ఎలిమినేషన్స్ లో 9 మందిలో ఇద్దరు బయటకు వెళ్లే అవకాశం ఉన్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అభిజిత్ 30శాతం ఓట్లతో అందరికంటే ఎక్కువగా ఆడియెన్స్ మనసును గెలుచుకుంటు వస్తున్నాడు. అఖిల్ కూడా దాదాపు అతనితో పోటీ పడే ప్రయత్నం చేస్తున్నాడు.

  ఎలిమినేషన్ లో ఊహించని మార్పులు

  ఎలిమినేషన్ లో ఊహించని మార్పులు


  రీసెంట్ గా అభిజిత్ తో పాటు అఖిల్, యాంకర్ లాస్య, సోహైల్, మోనాల్ గజ్జర్, హారిక, అరియానా, అమ్మా రాజశేఖర్, జోర్దార్ సుజాత వంటి వారు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. కానీ అందులో నుంచి ఊహించని విధంగా గంగవ్వ తన సొంత నిర్ణయంతో హౌజ్ నుంచి బయటకు వచ్చేసింది. దీంతో ఎలిమినేషన్ లో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

  ఫైనల్ లో అభిజిత్, సోహెల్

  ఫైనల్ లో అభిజిత్, సోహెల్

  అసలు మ్యాటర్ లోకి వస్తే బిగ్ బాస్ ఫైనల్ వరకు స్క్రిప్ట్ రెడీ అయినట్లు మరో టాక్ వస్తోంది. అందులో ఎవరు ఉన్నా లేకపోయినా కూడా టాప్ 5 కంటెస్టెంట్స్ లలో ఇద్దరు మాత్రం తప్పకుండా ఉంటారట. అందులో సోహెల్, అభిజిత్ ఉంటారని టాక్ వస్తోంది. అభిజిత్ ఇప్పటికే ఆడియెన్స్ సపోర్ట్ తో చాలా బలంగా ఉన్నాడు. అతని గేమ్ పై ఎక్కువగా ఎట్రాక్ట్ అవుతున్నారని ఈజీగా అర్ధమవుతోంది.

  ఎవరెన్ని ట్రిక్కులు ప్లే చేసినా..

  ఎవరెన్ని ట్రిక్కులు ప్లే చేసినా..

  మరోవైపు నోయేల్ కూడా జనాల సపోర్ట్ అందుకుంటున్నాడు గాని అన్ని విషయాల్లో డేరింగ్ స్టెప్ తీసుకోవడం లేదు. ఇక అమ్మా రాజశేఖర్ ద్వారా మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుందనే వారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఎవరెన్ని ట్రిక్కులు ప్లే చేసినా కూడా ఫైనల్ గా అభిజిత్ పోటీ చివరి వరకు ఉంటాడని మరో టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది.

  Bigg Boss Telugu 4 : బిగ్‌బాస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన గంగవ్వ, ఇల్లు కట్టిస్తానన్ననాగార్జున..!!
  ఈ సారైనా అమ్మాయిలకు ఛాన్స్ ఇస్తారా..?

  ఈ సారైనా అమ్మాయిలకు ఛాన్స్ ఇస్తారా..?

  మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ సారైనా అమ్మాయిలకు టైటిల్ విన్నర్ గా నిలుస్తారా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. పోటీలో లాస్య, హారిక, మోనాల్, అరియానా గట్టిగానే పోరాడుతున్నారు. అయితే గత మూడు సీజన్స్ లలో శివ బాలాజీ, కౌశల్ మండా, రాహుల్ సిప్లిగంజ్ టైటిల్స్ విన్నర్ గా నిలవడంతో విమర్శలు భారీగానే వచ్చాయి. ఇక్కడ కూడా ఆడవాళ్లకు అన్యాయం జరుగుతోందని కామెంట్స్ చేశారు. మరి ఈ సారి ఫైనల్స్ ఎలా జరుగుతాయో చూడాలి.

  English summary
  It is a known fact that the Indian Biggest reality show Bigg Boss 4 started as a grand on Sunday. Even for the first two days, the original colors of the contestants are slowly coming out with the small tasks given by Bigg Boss. The contestants are not torn between some emotional moments in the first week of starting. Gangava also shows his shades and occasionally shocks with punchy dialogues.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X