Just In
- 6 hrs ago
స్వర్గమంటూ ఉంటే అదే ఇది.. మాల్దీవుల్లో యశ్ రచ్చ.. అందుకే వెళ్లాడా?
- 7 hrs ago
త్రివిక్రమ్-రామ్ సినిమా.. అది అతడినే అడగాలి.. స్రవంతి రవికిశోర్ కామెంట్స్ వైరల్
- 8 hrs ago
‘భూమి’పై కాజల్ వీడియో.. జయం రవి కోసం స్పెషల్ పోస్ట్
- 8 hrs ago
దానికి సరైన సమయమిదే అంటోన్న సునీత.. పెళ్లయ్యాక పూర్తిగా మారినట్టుందే!!
Don't Miss!
- News
జో బైడెన్ రాకముందే డొనాల్ ట్రంప్ జంప్: కరోనా, నిరుద్యోగితలే అధ్యక్ష భవనానికి దూరం నెట్టాయి
- Finance
Gold prices today : బంగారం ధరల్ని అక్కడే నిలిపిన వ్యాక్సీన్!
- Sports
భారత్ పోరాటం ముందు నిలవలేకపోయాం: ఆసీస్ కెప్టెన్
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Lifestyle
ఆర్థిక, రాహు-కేతు సమస్యలా? కర్పూరంలో లవంగాలు వేసి కాల్చండి .. అప్పుడు జరిగే అద్భుతాలను చూడండి .. ఆశ్చర్యపోతారు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిగ్‌బాస్ ప్రైజ్ మనీపై క్లారిటీ ఇచ్చిన నాగ్.. ఆ డబ్బు గెలుచుకుంటే.. సోహెల్ ఎమోషనల్
బిగ్ బాస్ సీజన్ 4 మొత్తానికి తుది దశకు చేరుకుంటోంది. ఎన్నో ఎమోషన్స్ ను దాటుకుంటూ వచ్చిన కంటెస్టెంట్స్ తుది పోరుకు సిద్ధం కావాల్సిన సమయం వచ్చింది. షో మొదలైనప్పుడు అసలు వీరు తుది వరకు ఉంటారా అని అనుకున్న కంటెస్టెంట్స్ కూడా టైటిల్ అందుకోవడానికి రెండు అడుగుల దూరంలోనే ఉన్నారు. అయితే నేడు ప్రసారం కాబోయే కీలకమైన ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది స్టార్ మా. అందులో నాగార్జున ప్రైజ్ మనీ పై క్లారిటీ ఇచ్చారు.

సండే ఫన్ తో పాటు.. బిగ్ షాక్
బిగ్ బాస్ షో మొదలైనప్పుడు కంటెస్టెంట్స్ విషయంలో అంచనాలను అందుకోలేకపోయిందనే కామెంట్స్ చాలానే వచ్చాయి. కానీ మధ్య మధ్యలో బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులతో పాటు నామినేషన్స్ సమయంలో జరిగిన గొడవలు షోకు మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఆదివారం నాగార్జున ఫన్ తో పాటు షాక్ కూడా ఇవ్వబోతున్నారు. ఎవరో ఒకరు ఈ రోజు హౌజ్ నుంచి ఎలిమినేట్ కావాల్సిందే.

ప్రైజ్ మనీ ఎంతంటే..
ఇక రీసెంట్ గా విడుదల చేసిన ప్రోమోలో కంటెస్టెంట్స్ ఈ రోజు బిగ్ బాస్ టైటిల్ గెలుచుకుంటే వారి ఫీలింగ్ ఎలా ఉంటుంది అని టాస్క్ ఇవ్వబోతున్నట్లు అర్ధమయ్యింది. ఇక బిగ్ బాస్ విన్నర్ 50లక్షల రూపాయల ప్రైజ్ మనీని అందుకుంటారు. ఈ భారీ జాక్ పాట్ ను ఎవరు అందుకుంటారు అనేది సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది. ఎందుకంటే ప్రతి కంటెస్టెంట్స్ ఎవరికి వారు బలంగా దూసుకుపోతున్నారు.

సోహెల్ ఎమోషనల్ కామెంట్
ఇక 50లక్షల ప్రైజ్ మనీ అనగానే కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు ఒక్కో విదంగా స్పందించారు. ముఖ్యంగా సోహెల్ ఒక్క డైలాగ్ తోనే ఎమోషనల్ గా టచ్ చేసినట్లు అర్ధమయ్యింది. ఇప్పటివరకు నా అకౌంట్ లో లక్ష దాటి లేదు అని వివరణ ఇచ్చాడు. సోహెల్ మొత్తానికి ఫైనల్ కు అయితే చేరుకున్నాడు. ఇటీవల అరియానాతో జరిగిన గొడవ అతని స్థాయిని ఇంకాస్త పెంచి ఫైనల్ వరకు చేర్చింది.

హారిక ఏమందంటే..
ఇక దేత్తడి హారిక మాత్రం ఆ డబ్బును గెలుచుకుంటే పూర్తిగా తన తల్లికే ఇస్తానని చెప్పింది. ఆడియెన్స్ నుంచి అత్యధిక సపోర్ట్ అందుకుంటున్న వారిలో అభిజిత్ తరువాత మిగతా వారికి హారిక గట్టి పోటీని ఇస్తోంది. చూస్తుంటే ఆమె ఫైనల్ రేస్ లో కూడా స్ట్రాంగ్ ఫైట్ ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఫైనల్స్ వరకు వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు టాక్ అయితే వస్తోంది.

ఏం చేసుకుంటారో మీ ఇష్టం: అభిజిత్
ఇక అభిజిత్ వంతు రావడంతో ఆ ప్రైజ్ మనీ మొత్తం ఇంట్లో వాళ్ళకే అంటూ ఏం చేసుకుంటారో మీ ఇష్టం అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. అయితే నాగార్జున అప్పుడు పంచ్ వేశాడు. లాస్ వేగస్ లో గే బార్ విషయాన్ని గుర్తు చేస్తూ అక్కడికి వెళ్ళడానికి ఏమి ట్రై చేయడం లేదా అని అనడంతో అందరూ నవ్వేశారు. ఇక అఖిల్ మంచి కేఫె ఓపెన్ చేస్తానని చెప్పడంతో.. ఏం పేరు పెట్టాలని అనుకుంటున్నవ్ అని నాగ్ పంచ్ వేశారు.

ఒకరినొకరు ఇమిటేట్ చేసుకున్న కంటెస్టెంట్స్
రాత్రి 9 తరువాత సోహెల్ తో సిట్టింగ్ వేయాలని ఉన్నట్లు కూడా నాగ్ తనలోని కోరికను బయటపెట్టారు. ఇక బిగ్ బాస్ విన్నర్ ఎనౌన్స్మెంట్ ఇస్తే కంటెస్టెంట్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో వేరే కంటెస్టెంట్స్ చూపించాలని నాగ్ కోరడంతో హారిక, మోనాల్ ను ఇమిటేట్ చేసింది. ఇక అఖిల్ అరియానా ఫీలింగ్ ను తెలుపగా..అరియానా అభిని ఇమిటేట్ చేసింది. మోనాల్, సోహెల్ డ్యాన్స్ ను చూపించగా.. హారిక ముద్దులు ఎలా పెడుతుందో సోహెల్ చూపించాడు. మొత్తానికి ఈ రోజు నాగ్ ఫన్ డోస్ ను గట్టిగానే పెంచినట్లు తెలుస్తోంది.
|
ఈ వారం ఎలిమినెట్ అయ్యేది ఎవరంటే..
ఇక ఈ వారం ఎలిమినేషన్ లో మరోసారి మోనాల్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. చాలా వరకు ఎలిమినేషన్ లో డేంజర్ జోన్ కు వస్తున్న కంటెస్టెంట్స్ లలో మోనాల్ ఒకరు. గతంలో చాలాసార్లు ఆమె వెళ్లిపోవడం కాయమని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ హౌజ్ లో రొమాంటిక్ యాంగిల్ మిస్ అయితే రేటింగ్ కష్టమని అనుకున్న బిగ్ బాస్ ఆమెను సేవ్ చేస్తున్నట్లు రూమర్స్ కూడా వచ్చాయి. అయితే ఈ వారం మాత్రమే ఆమె ఎలిమినేట్ అయినట్లు సమాచారం. మరి ఈ టాక్ ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.