Just In
Don't Miss!
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అభిజిత్ పై ఫోకస్ పెట్టిన సోహెల్.. అతనికి విజేతగా నిలిచే అర్హత లేదు అంటూ..
బిగ్ బాస్ సీజన్ 4లో చాలా రోజుల తరువాత ఒక కొత్త తరహా సన్నివేశాలు దర్శనమిస్తున్నాయి. తుది పోరుకు దగ్గరైన కంటెస్టెంట్స్ లలో అసలు రంగులు చాలా ఈజీగా బయటపడుతున్నాయి. ఇక మొన్నటివరకు మంచి మిత్రులుగా ఉన్న వారు కూడా ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా అడుగులు వేస్తున్నారు. టాస్క్ ల విషయంలో మరోలా ఉండే సోహెల్ ఈ మధ్య ఊహించని విధంగా యూ టర్న్ తీసుకుంటున్నాడు. అభిజిత్ తో ఫైనల్స్ లో పోటీ తప్పదని అనుకున్నాడో ఏమో గాని అతనిపై గట్టిగానే ఫోకస్ పెట్టినట్లు అర్ధమయ్యింది.

అఖిల్ తో కూడా గొడవలు
బిగ్ బాస్ హౌజ్ లో ఎక్కువగా కోపం ఉన్న కంటెస్టెంట్ ఎవరంటే.. సోహెల్ అని అని అందరికి తెలిసిన విషయమే. అఖిల్ పైన కూడా తరచుగా తనలోని కోపాన్ని బయటపెడుతున్నాడు. అయితే ఇద్దరి మధ్య అనుకోకుండా గొడవలు జరుగుతున్నాయి. సాధారణంగా ఎవరికైనా సరే ఎలిమినేషన్స్ నుంచి గొడవలు పెరుగుతుంటాయి. కానీ వీరిద్దరికి మాత్రం వేరే విషయాల్లో విబేధాలు ఎక్కువవుతున్నాయి. అంటే సోహెల్ మైండ్ గేమ్ అడుతున్నాడా అనే భావన కలుగుతోంది.

ఆ విషయం చాలా ఈజీగా అర్ధమయ్యింది..
ఉదయం హ్యాపీగా మాట్లాడుకునే కంటెస్టెంట్స్ రాత్రి బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లకు ఒక్కసారిగా యు టర్న్ తీసుకుంటూ ఉంటారు. ఇక సోమవారం కూడా అదే జరిగింది. బిగ్ బాస్ ఇచ్చిన ఒక మైండ్ గేమ్ తో కొందరి మధ్య ఉన్న అసలు బేధాలు బయటపడ్డాయి. ముఖ్యంగా సోహెల్, అబిజిత్ పై ఫోకస్ పెట్టినట్లు చాలా ఈజీగా అర్ధమయ్యింది.

డైరెక్ట్ గా అతనితో పెద్దగా గొడవ పడలేదు కానీ..
ఫైనల్స్ కు వెళ్లే వారిలో అర్హత లేని కంటెస్టెంట్ గురించి వివరణ ఇవ్వాలని బిగ్ బాస్ కోరడంతో సోహెల్ అరియానా పేరు చెప్పినప్పటికీ అభి పైనే ఫోకస్ పెట్టినట్లు అనిపించింది. అరియానాతో అంటే ఈ మధ్య గొడవలు చాలానే అయ్యాయి. కానీ అభిజిత్ తీరుపై గతంలో చాలా సార్లు సోహెల్ అసహనం వ్యక్తం చేశాడు. డైరెక్ట్ గా అతనితో పెద్దగా గొడవ పడలేదు కానీ సీక్రెట్ గా అఖిల్ తో మాట్లాడేటప్పుడు నిందలు కూడా మోపాడు.

అరియానా లిమిట్స్ దాటి ప్రవర్తించింది
అభిజిత్ తప్పితే హారిక, సోహెల్, అఖిల్ ముగ్గురు కూడా అరియానాను టార్గెట్ చేసి మరీ ఆమె కోపాన్ని ఎత్తి చూపినట్లు అర్ధమయ్యింది. ముఖ్యంగా సోహెల్ అయితే ఆమెతో కోపాన్ని గుర్తు చేస్తూ ఆమెకు బిగ్ బాస్ విన్నర్ అయ్యే అర్హత లేదని కౌంటర్ గట్టిగానే ఇచ్చాడు. అరియానా లిమిట్స్ దాటి ప్రవర్తించిందని చిన్న విషయానికి అంతగా ప్రవర్తించాల్సిన అవసరం లేదని కూడా అన్నాడు.

సోహెల్ స్వీట్ కౌంటర్
ఇక సోమవారం అయితే ఏకంగా అతనికి బిగ్ బాస్ ఫైనల్ కు చేరే అర్హత లేదని అరియానా లిమిట్స్ దాటి ప్రవర్తిస్తే అభి మాత్రం కొన్ని విషయాల్లో ఇంకాస్త ఎఫర్ట్ పెడితే బాగుండేదని స్వీట్ కౌంటర్ అయితే ఇచ్చాడు అఖిల్. దీంతో బిగ్ బాస్ లో వారిద్దరి మధ్య పోటీ తీవ్రత రానున్న రోజుల్లో మరింత ఎక్కువ కానున్నట్లు అర్ధమవుతోంది. సోహెల్ అరియానాపై చూపించిన కోపాన్ని అభిపై కూడా చూపిస్తాడో లేదో చూడాలి మరి.