Don't Miss!
- News
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..!!
- Finance
Telangana Budget: కీలక రంగాలకు కేటాయింపులు ఇలా.. జర్నలిస్టుల సంక్షేమానికి కూడా..
- Sports
INDvsAUS : స్పిన్ పిచ్‌లతో భారత్‌కూ సమస్యే?.. రికార్డులు చూస్తే తెలిసిపోతోంది!
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
బిగ్ బాస్ షో హవా.. దొంగ ఓట్లు వేస్తున్నారంటా.. అసలు గుట్టు విప్పిన తనీష్ వీడియో
బిగ్ బాస్ షో క్రేజ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ వీక్షకులు, షో అభిమానులు తమ ఫేవరెట్ కంటెస్టెంట్లకు ఓట్లు వేసేందుకు నానా తంటాలు పడుతుంటారు. ఫోన్స్, ఎక్స్ ట్రా సిమ్‌లు, ఇతరుల ఫోన్‌లు తీసుకుని ఓట్లు వేయడం వంటివి చేస్తుంటారు. వారం వారం జరిగే ఓటింగ్‌లోనే ఇలా ఉంటే ఫినాల ఎపిసోడ్‌కు ఇంకెంత రచ్చ చేస్తారో ఊహించుకోవచ్చు. వీలైనన్ని ఓట్లు తమ అభిమాన కంటెస్టెంట్‌కు పడాలని పడరాని పాట్లు పడుతుంటారు.

ఫినాలె వీక్..
బిగ్ బాస్ నాల్గో సీజన్ ముగిసేందుకు వచ్చింది. టాప్ 5లో ఉన్న అభిజిత్ అరియానా సోహెల్ అఖిల్ హారికల కోసం వారం మొత్తం అభిమానులు ఓట్లు వేస్తూనే వచ్చారు. నిన్నటితో ఓటింగ్ ప్రక్రియకు పుల్ స్టాప్ పడింది. ఓటింగ్ లైన్లు నిన్నటి అర్దరాత్రి వరకు క్లోజ్ అయ్యాయి.

భారీ ఓట్లు..
నాల్గో సీజన్‌కు దాదాపు 20కోట్లకు పైగా ఓట్లు పోలైనట్టు తెలుస్తోంది. ఇద కచ్చితంగా గత సీజన్ల ఓట్ల రికార్డులను బద్దలు కొట్టేలా కనిపిస్తోంది. అయితే ఈ సారి కూడా ఏకపక్షంగానే ఓట్లు పోలైనట్టు తెలుస్తోంది. బయటకు వస్తున్న సమాచారం మేరకు 60 శాతం ఓట్లు అభిజిత్‌కే పోల్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఇవన్నీ కూడా అనధికారిక లెక్కలే.

ఓట్ల కోసం అలా..
అయితే తమ అభిమాన కంటెస్టెంట్లకు ఓట్లు వేయడానికి సమయం దగ్గర పడుతుండటంతో అందరూ ఫోన్లతోనే బిజీగా గడిపారు. అలా తనీష్ వాళ్ల మదర్ కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్ల కోసం ఓట్లు వేస్తోందట. కానీ తన ఓట్లను దొంగిలించారని చెప్పుకొచ్చింది. ఈ మేరక తనీష్ షేర్ చేసిన వీడియో ఫుల్ వైరల్ అవుతోంది.

ఫన్నీ వీడియో..
తనీష్ తమ్ముడు తన అమ్మ ఫోన్‌ను తీసుకుని ఓట్లువేశాడంట. ఇదే విషయాన్ని తనీష్ తల్లి చెబుతూ.. దొంగ ఓట్లు వేశాడు.. నేను నాకు నచ్చిన కంటెస్టెంట్లకు ఓట్లు వేస్తాను.. కానీ వాడు వచ్చి వేస్తే అవి దొంగ ఓట్లే కదా అంటూ వాపోయింది. ఆ విషయాన్ని తనీష్ వీడియో తీస్తూ.. బిగ్ బాస్ హవా ఇలా ఉంది మరి.. దొంగ ఓట్లు వేస్తున్నాడ అంటూ తమ్ముడి గుట్టు బయటపెట్టేశాడు. కానీ ఆ ఇద్దరు ఎవరికీ ఓట్లు వేశారన్నది మాత్రం తనీష్ బయటపెట్టలేదు.