Don't Miss!
- News
చంద్రబాబునాయుడి ప్రాణ స్నేహితుడు మృతి
- Finance
Telangana Budget: తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీష్ రావు.. సంక్షేమంలో ముందుకే..
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Sports
SA20 : దంచికొట్టిన సన్‌రైజర్స్ బ్యాటర్.. చిత్తుగా ఓడిన క్యాపిటల్స్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
BB Telugu Grand Finale .. ఫినాలే స్టేజ్ మీద తమన్ ఇక దంచుడే
బిగ్ బాస్ షో కథ ముగిసేందుకు వచ్చింది. టాప్ 5లో ఉన్న అభిజిత్ అరియానా సోహెల్ అఖిల్ హారికల్లో ఎవరు విన్నర్, రన్నర్ అన్న సందేహాలేవీ పెట్టుకోవడం లేదు. విజేత విషయంలో అందరికీ మొదటి నుంచి ఓ క్లారిటీ ఉంది. ఇప్పుడు కూడా అదే పేరు వినిపిస్తోంది. కానీ అధికారికంగా ఎవరు విజేత అయ్యారన్నది ప్రకటించే వరకు నమ్మలేం. చివరి క్షణాల్లో ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. అలా ఇప్పుడు విన్నర్ రన్నర్ వంటి వాటిని పక్కన పెట్టేద్దాం.
ఫినాలె ఎపిసోడ్ కోసం సర్వ సిద్దమైంది. ఇప్పటికే సగం షూటింగ్‌ను పూర్తి చేశారట. ఆల్రెడీ హారిక ఎలిమినేట్ అయినట్టు లీకులు బయటకు వచ్చేశాయి. టాప్ 5లో ఉన్న హారిక చివరి స్థానంలో నిలబడి ట్రోఫీ కోసం పరిగెత్తే రేసులోంచి బయటకు వచ్చేసిందట. ఈ విషయాలన్నీ కాకుండా.. ఎపిసోడ్‌కు సంబంధించిన అప్డేట్లు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతోన్నాడని అందరికీ తెలిసిందే.

ఇక ఈ షోపై లవ్ స్టోరీ మూవీ ప్రమోషన్స్ కూడా ఉండబోతోన్నాయట. దీని కోసం శేఖర్ కమ్ముల, సాయి పల్లవి, నాగ చైతన్య రాబోతోన్నారట. వీరితో పాటు ఫినాలే స్టేజ్ మీద తమన్ లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వబోతోన్నాడట. దాదాపు 9 నెలల తరువాత మొదటిసారిగా మళ్లీ ఇలా పర్ఫామెన్స్ ఇస్తున్నందుకు హ్యాపీగా ఉంంటూ తమన్ ట్వీట్ చేశాడు. మొత్తానికి తమన్ తన డప్పులతో దుమ్ముదులిపేస్తాడేమో.