Don't Miss!
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- News
50 మంది ప్రయాణికులు వదిలేసి వెళ్లిన విమానం: ‘గో ఫస్ట్’కు రూ. 10 లక్షలు జరిమానా
- Sports
అందుకే పృథ్వీ షా, చాహల్‌ను జట్టులోకి తీసుకోలేదు: హార్దిక్ పాండ్యా
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Lifestyle
ఎదుటివారి సంతోషం కోసం మిమ్మల్ని మీరు కోల్పోవద్దు.. ఈ చిట్కాలు మీకోసమే
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
వీడియో బయటపెట్టి మరీ పరువుదీశాడు.. తలలు పట్టుకున్న సోహెల్-అఖిల్
బిగ్ బాస్ షోలో ఫండే అంటే సండే అని తెలిసిందే కదా. నిన్నటి శనివారం నాటి ఎపిసోడ్‌లో అభిజిత్, హారికలకు గట్టి కోటింగ్ ఇచ్చిన నాగార్జున నేటి ఎపిసోడ్‌లో అందర్నీ ఓ ఆట ఆడించినరట్టు కనిపిస్తోంది. పన్నెండో వారంలో దెయ్యం పేరు చెప్పి ఇంటి సభ్యులను బాగానే భయపెట్టాడు. జలజ దెయ్యంతో బిగ్ బాస్ తన కంటెస్టెంట్లను ఓ ఆట ఆడిపించాడు. వింత టాస్కులు ఇస్తూ వారితో మూడు చెరువుల నీళ్లు తాగించాడు.

దెయ్యం సినిమాతో..
బిగ్ బాస్ ఇంట్లో మొదటిసారిగా ఓ సినిమాను ప్లే చేసి చూపించాడు. అది కూడా ఆర్జీవీ పన్నెండో అంతస్థు అనే హారర్ మూవీని ప్లే చేశాడు. ఆ మూవీని ఆపిన ప్రతీసారి ఇంటి సభ్యులు కన్ఫెషన్ రూంలోకి వెళ్లి అక్కడున్న స్ఫూన్స్‌ను తీసుకు రావాలని తెలిపాడు. అలా అరియానా అవినాష్‌లు కలిసి వెళ్లారు. మోనాల్ ఒంటరిగా వెళ్లింది. చివరకు సోహెల్ అఖిల్ కలిసి వెళ్లారు.

అందరూ భయపడ్డారు..
అయితే చీకటిగా ఉన్న కన్ఫెషన్ రూంలోకి వెళ్లడానికి అందరూ భయపడ్డారు. అరియానా అయితే డోర్ వద్ద ఉండి విపరీతంగా అరవడం మొదలు పెట్టింది. సోహెల్ బయట ఉన్నంత సేపు భయపడను అంటూ గొప్పలు చెప్పుకున్నాడు. లోపలకు వెళ్లాక ఓ రేంజ్‌లో ఉలిక్కి పడ్డాడు. జలజ చేసే సౌండ్స్, చీకటిని చూసి సోహెల్ అఖిల్ బాగానే భయపడ్డారు.

బయట బిల్డప్..
కన్ఫెషన్ రూంలో అంత భయపడ్డ సోహెల్ అఖిల్ బయటకు వచ్చాక మాత్రం బిల్డప్ ఇచ్చారు. తామేమీ భయపడలేదని కలరింగ్ ఇచ్చారు. స్ఫూన్స్ వెతకడానికి పడ్డ నానా తంటాలను కవర్ చేసేందుకు మోనాల్‌కు కట్టు కథలు అల్లారు. తామెంతో ధైర్య వంతులమని చెప్పుకొని తిరిగారు.
Recommended Video
|
వీడియోలు బయటపెట్టాడు..
ఆ రోజు అలా ధైర్య వంతులమని బిల్డప్ ఇచ్చిన సోహెల్ అఖిల్ పరువును నాగార్జున తీసేశాడు. కన్ఫెషన్ రూంలో భయపడ్డ వీడియోలన బయటపెట్టి.. వారి పరువును తీసేశాడు. అలా వారు భయపడుతూ అరుస్తున్న వీడియోలను చూసి వారు తలలు పట్టుకున్నారు. ఇక నేటి ఎపిసోడ్‌లో నాగార్జున వారందరినీ మళ్లీ చీకటి గదిలోకి పంపించి భయపెట్టనున్నాడు.