Don't Miss!
- Finance
Telangana Budget: తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీష్ రావు.. సంక్షేమంలో ముందుకే..
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- News
అమరావతి కేసు విచారణ-సుప్రీం నిర్ణయంపై ఉత్కంఠ ? ఫాస్ట్ ట్రాక్ విజ్ఞప్తి, ఫిర్యాదుల నేపథ్యం !
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Sports
SA20 : దంచికొట్టిన సన్‌రైజర్స్ బ్యాటర్.. చిత్తుగా ఓడిన క్యాపిటల్స్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఆ ముగ్గురికి కోలుకోలేని షాక్.. టికెట్ టు ఫినాలే రేసు నుంచి అవుట్
బిగ్ బాస్ షోలో ఈ పదమూడో వారం టికెట్ టు ఫినాలే టాస్క్ జరగబోతోందన్న సంగతి తెలిసిందే. ఈపాటికే ప్రోమోలతో హైప్ పెంచే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా అందరి చేత అదిరిపోయే టాస్క్ ఆడించనున్నాడు. అయితే లీకుల ద్వారా బయటకు వచ్చిన సమాచారం మేరకు.. మొదటి లెవెల్‌లో నలుగురు కంటెస్టెంట్లు మాత్రం సక్సెస్ అయ్యారని తెలుస్తోంది. మిగతా ముగ్గురు ఫినాలే టికెట్‌పై ఆశలు వదులుకున్నట్టు సమాచారం.

ఫినాలే టిక్కెట్..
బిగ్ బాస్ షోలో ఫినాలే టిక్కెట్ గెలుచుకోవడమన్నది ఎంత ముఖ్యమైందో అందరికీ తెలిసిందే. ఒక్కసారి ఆ టిక్కెట్ చేతిలో పడిందంటే... ఇక టాప్ 5లో చోటు దక్కించుకున్నట్టే. అందుకే దాని కోసం కంటెస్టెంట్లందరూ పోటీ పడుతుంటారు. టికెట్ సాధించేందుకు ట్రై చేస్తుంటారు.

గార్డెన్ ఏరియాలో పోరాటం..
ఇక ఈ నాల్గో సీజన్‌లో ఫినాలె టిక్కెట్టును పొందేందుకు ఓ టాస్క్ పెట్టాడు. గార్డెన్ ఏరియాలో బర్రె బొమ్మను పెట్టాడు. అది అంబా అని అరిచిన ప్రతీసారి కంటెస్టెంట్లందరూ పాలను పట్టుకోవాలని.. సీసాల్లో నింపుకుని భద్రపరుచుకోవాలని చెప్పాడు. దీంతో కంటెస్టెంట్లు బాగానే పోటీ పడ్డారు.

ఆ నలుగురు..
అయితే ఈ పాలు నింపే టాస్క్‌లో నలుగురు పాస్ అయినట్టు తెలుస్తోంది. ఫినాలే టిక్కెట్ టాస్క్ మొదటి లెవెల్‌లో అఖిల్ అభిజిత్ హారిక సోహెల్ విజేతలుగా నిలిచినట్టు లీకులు బయటకు వచ్చాయి. దీంతో ఈ నలుగురిలోనే ఎవరికో ఒకరికి టిక్కెట్ లభించేలా కనిపిస్తోంది.

ఆ ముగ్గురికి షాక్..
అయితే
మోనాల్,
అరియానా,
అవినాష్‌లకు
మాత్రం
గట్టిగా
దెబ్బ
తగిలినట్టు
కనిపిస్తోంది.
ఎంత
కష్టపడినా
కూడా
ఫస్ట్
లెవెల్‌ను
దాటలేకపోయారని
తెలుస్తోంది.
అసలే
మోనాల్
ఈ
మధ్య
కాస్త
యాక్టివ్‌గా
టాస్కుల్లో
పార్టిసిపేట్
చేస్తోంది.
కానీ
ఫినాలే
టికెట్
రేసులో
వెనుకబడిందని
టాక్.
Recommended Video

ఆవేశమంతా తుస్సుమందా?
ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమోలో అవినాష్ అందరి మీద బాగానే సీరియస్ అయ్యాడు. అందరూ కలిసి ఆడుతున్నారు.. లిటరల్‌గా ఒక్కటయ్యారు.. మీరే ఆడుకోండి.. నన్ను ఎలిమినేట్ చేసి పారదొబ్బండి అంటూ సోహెల్, అఖిల్ మీద అవినాష్ ఫైర్ అయ్యాడు. అయితే ఇంత ఆవేశ పడినా అవినాష్ మాత్రం మొదటి లెవెల్‌ను పూర్తి చేయలేకపోయాడని తెలుస్తోంది.