Bigg Boss Elimination..మోనాల్ కోసం అవినాష్‌ బలి.. తెర వెనుక జరిగిన అసలు కథ ఇదే!

బిగ్ బాస్ షోలో ఎలిమినేషన్ విషయంలో ఎప్పుడూ గందరగోళం జరుగుతూనే వస్తోంది. జనాల అభిప్రాయం మేరకు కాకుండా బిగ్ బాస్ టీం తమకు నచ్చిన వ్యక్తిని సేవ్ చేస్తూ పక్షపాత ధోరణి వ్యవహరిస్తున్నాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవీ నాగవల్లి, దివి, కుమార్ సాయి ఎలిమినేషన్లు జరిగిన సమయంలో బిగ్ బాస్ టీం మీద నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ముగ్గురి ఎలిమినేషన్లను ప్రజలు నిర్ణయించలేదని.. బిగ్ బాస్ నిర్ణయించాడని టాక్ బయటకు వచ్చింది.

Recommended Video

Tollywood Stars At A MB Cinemas | Filmibeat Telugu
లీకులే ప్రధానంగా..

లీకులే ప్రధానంగా..

బిగ్ బాస్ నాల్గో సీజన్‌ను లీకులు ఎంతగా దెబ్బకొడుతున్నాయో అందరికీ తెలిసిందే. కంటెస్టెంట్ల ఎంపిక నుంచి ప్రతీ ఒక్క విషయం లీకవుతూనే వచ్చింది. చివరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా లీకయ్యాయి. ఈ సీజన్‌లో మరీ దారుణంగా.. రేపటి ఎపిసోడ్‌లో ఏం జరుగనుంది.. నామినేషన్ లిస్ట్, పెట్టబోయే టాస్కులు కూడా బయటకు వచ్చేస్తున్నాయి.

ఎలిమినేషన్లపై లీకుల ప్రభావం..

ఎలిమినేషన్లపై లీకుల ప్రభావం..

బిగ్ బాస్ లాంటి రియాల్టీ షోలో ఎలిమినేషన్ అంటే ఎంత సస్పెన్స్ ఉండాలి. ఈ లీకుల వల్ల అలాంటిదేమీ ఉండటం లేదు. శనివారం సాయంత్రాని కల్లా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ పేరు బయటకు వచ్చేస్తోంది. అలాగే మూడో వారంలో మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడని మొదటగా లీకులు వచ్చాయి. కానీ మళ్లీ అనూహ్యంగా తెరపైకి దేవీ నాగవల్లి ఎలిమినేట్ అయిపోయిందని ప్రచారంలోకి వచ్చింది.

అచ్చం అలాగే..

అచ్చం అలాగే..

బిగ్ బాస్ షోలో పదమూడో వారంలో అభిజిత్ అఖిల్ హారిక అవినాస్ మోనాల్ నామినేషన్లోకి వచ్చారు. అభిజిత్ అఖిల్ ఎలాగూ సేవ్ అవుతారని అందరికీ తెలిసిందే. అవినాష్ మోనాల్‌లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని మొదటి నుంచి అనుకున్నారు. అంచనాలకు తగ్గట్టే మోనాల్ ఎలిమినేట్ అయిపోయిందని లీకులు వచ్చాయి.

సోదరి హేమాలి కూడా..

సోదరి హేమాలి కూడా..

మోనాల్ ఎలిమినేట్ అయిందని, తనను తీసుకెళ్లేందుకు ఆమె సోదరి హేమాలి కూడా వచ్చిందని వార్తలు బయటకు వచ్చాయి. మోనాల్ ఫ్యాన్ పేజీలు కూడా మాయమయ్యాయి. ఇలా మోనాల్ ఎలిమినేట్ అయిందని ఊపందుకున్న సమయంలో మరో షాకింగ్ లీక్ బయటకు వచ్చింది.

తెరమీదకు అవినాష్..

తెరమీదకు అవినాష్..

మోనాల్ ఎలిమినేట్ అయిందని ప్రచారంలోకి వచ్చిన రెండు గంటల తరువాత అవినాష్ పేరు తెరమీదకు వచ్చింది. అయితే ఓటింగ్ ఆర్డర్‌లో మోనాల్ చివరి స్థానంలో ఉన్నా కూడా ఎప్పటిలానే ఆమెను కాపాడేందుకు బిగ్ బాస్ టీం అవినాష్‌ను నిండా ముంచారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇలా మోనాల్‌ను ఎందుకు సేవ్ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

అసలు కథ ఇదేనట..

అసలు కథ ఇదేనట..

అయితే మోనాల్ ఎలిమినేట్ అయిందని బయటకు లీకులు వెళ్లాలని, ఆ లీకులు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి.. ఎవరు లీక్ చేస్తున్నారనే విషయాలను పసిగట్టేందుకు అలా ట్రయల్ వేశారట. అందుకే అలా లోపల లోపలే ఇలా స్కెచ్ వేశారట. కానీ అసలు ఎలిమినేషన్‌లో ట్విస్ట్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. కానీ జనాలు మాత్రం మోనాల్ వెళ్లాల్సింది.. అవినాష్‌ను ఎలా పంపుతున్నారని ఇంకా ప్రశ్నిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X