‘అతి’యానా ఇక మారదు.. బిగ్ బాస్ పెట్టిన పరీక్షలో అరియానా ఫెయిల్!!
బిగ్ బాస్ షోలో ప్రతీక్షణం, ప్రతీ నిర్ణయం, ప్రతీ మాట లెక్కలోకి వస్తుంది. అక్కడే కంటెస్టెంట్లను ప్రతీ క్షణం పరీక్షిస్తుంటాడు బిగ్ బాస్. ఏ కంటెస్టెంట్ ఎలాంటి వాడన్నది సమయానుగుణంగా బయటకు తీసుకువచ్చేలా చేస్తాడు. అసలు ఆటను మొదలు పెట్టిస్తాడు. అందుకోసమే కొన్ని స్పెషల్ అధికారాలను ఇచ్చినట్టే ఇచ్చి వారిలో నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందా లేదా అన్నది ప్రేక్షకులకు చూపిస్తాడు. అలా వారు తీసుకున్న నిర్ణయాలను కంటెస్టెంట్లలో, ప్రేక్షకుల్లో వారికంటూ ఓ ఇమేజ్ ఏర్పడుతుంది. అలా నిన్నటి ఎపిసోడ్‌లో అరియానా అతి బయట పడింది.

గతంలో అఖిల్..
గతంలో ఓ సారి అఖిల్‌ను కన్ఫెషన్ రూంకి పిలిపించిన బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఇంట్లో ఉన్న పదహారు మంది సభ్యులకు ఒక్కో ఐటెం సెలెక్ట్ చేసుకోవాలి.. ఎవరి కోసం సెలెక్ట్ చేసింది వారికే సొంతమని చెప్పాడు. అయినా కూడా అఖిల్ తన కాంపౌండ్‌లో ఉన్నవారు, నచ్చినవారికే ఐటెమ్స్ సెలెక్ట్ చేశాడు. దాంతో ఇంటా బయటకు అఖిల్‌కు నెగెటివిటీ పెరిగింది. ఆ తదుపరి వారంలో అందరూ ఇదే కారణంతో అఖిల్‌ను నామినేట్ చేసేశారు.

అవినాష్ నిర్ణయం..
ఏడో వారం కెప్టెన్సీ టాస్క్‌లో అవినాష్ అరియానా పోటీ పడ్డారు. ఇద్దరూ ఒకే స్థాయిలో పోటీ పడ్డారు. అందుకే కెప్టెన్‌గా ఎన్నికైన అవినాష్.. తనతో పాటు సమంగా ఆడి ఓడిన అరియానాను రేషన్ మేనేజర్‌గా ఎంచుకున్నాడు. అప్పుడు అవినాష్ నిర్ణయాన్ని అందరూ మెచ్చుకున్నారు. ఇక ఎనిమిదో వారం కెప్టెన్సీలో అరియానా గెలిచాక మోనాల్‌ను రేషన్ మేనేజర్ ఎందుకు తీసుకుందో చెప్పిన కారణం అందరికీ తెలిసిందే. అలా చిన్న చిన్న నిర్ణయాలే బయట నెగెటివిటీని క్రియేట్ చేస్తాయి.

పరీక్షించిన బిగ్ బాస్..
మామూలుగా బిగ్ బాస్ కెప్టెన్‌కు కొన్ని ఆఫర్స్ ఇస్తాడు. బెస్ట్ పర్ఫామెన్స్, వరెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన వారెవరో చెప్పమని అంటాడు. అయితే అందులో నీ పేరు కూడా చెప్పుకోవచ్చు అని అన్నాడంటే.. అది పరీక్ష కింద లెక్కే. మనది మనకు తెలుస్తుంద పని చేశామా? లేదా? అని.. అక్కడ ఉన్న కంటెస్టెంట్లకు తెలుస్తుంది? చూసే ప్రేక్షకులకు తెలుస్తుంది? ఎంత పని చేశారన్నది. నిన్నటి ఎపిసోడ్‌లో అలాగే అరియానాను బిగ్ బాస్ పరీక్షించాడు.

బెస్ట్ పర్ఫామెన్స్..
వారం మొత్తంలో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చింది ఎవరో చెప్పాల్సిందిగా అరియానాను బిగ్ బాస్ కోరాడు. అందులో మీ పేరు కూడా చెప్పుకోవచ్చు.. అని అరియానాకు ఆశ పుట్టించాడు. ఇక దాంతో ఎగ్జైట్ అయి దురాశ పుట్టి తన పేరే చెప్పేసుకుంది. ఏదో ఇంపాక్ట్ చేశానని తన పేరు చెప్పుకుంది. తనది తానే గొప్పలు చెప్పుకుంది. ఈ అతే అరియానాకు ప్రాణ సంకటంగా మారేట్టు కనిపిస్తోంది. మొత్తానికి తన పేరు తానే, తన గొప్పల తానే చెప్పుకోవడం ఇంటా బయట అరియానా ఇమేజ్ డ్యామేజ్ అయింది.


Click it and Unblock the Notifications











