Siri Hanmanth పెళ్లి కాకుండానే తల్లిగా సిరి హన్మంతు.. బిగ్‌బాస్ బ్యూటీ వ్యక్తిగత జీవితం గురించి మీకు తెలుసా?

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో అందం, అభినయం, టాలెంట్‌‌తో గేమ్ ఆడుతూ ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న కంటెస్టెంట్ సిరి హన్మంతు. షణ్ముఖ్‌ జస్వంత్‌తో కలిసి తనదైన స్ట్రాటజీతో రాణిస్తూ ఇంటిలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొన్నది. టాస్కులైనా, నామినేషన్ ప్రక్రియలోనైనా సిరి హన్మంతుది ప్రత్యేకమైన శైలి కనిపిస్తుంది. అయితే సిరి హన్మంతు బయటకు కనిపించేంత గడసరి కాదనేది ఆమె వ్యక్తిగత జీవితం చూస్తే అర్ధమవుతుంది. ఆమె తీసుకొన్న నిర్ణయాలు హృదయాన్ని కదిలిస్తాయి. సిరి హన్మంతు వ్యక్తిగత జీవితం గురించి మరిన్ని వివరాలు మీకోసం. ..

Recommended Video

Siri Hanmanth : ఆదర్శంగా నిలిచిన Bigg Boss బ్యూటీ.. పెళ్లి కాకుండానే తల్లిగా || Filmibeat Telugu
విశాఖపట్నంలో న్యూస్ రీడర్‌గా

విశాఖపట్నంలో న్యూస్ రీడర్‌గా

సిరి హన్మంతు స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం. వినోదపరిశ్రమలో రాణించాలనే లక్ష్యంతో విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. అనేక ఆటుపోట్లకు గురైన సిరి హన్మంతు మొదటగా విశాఖలో యూ న్యూస్ అనే స్థానిక లోకల్ ఛానెల్‌లో న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించింది. కొద్ది నెలలు అక్కడ పనిచేసిన తర్వాత వై టీవీలో చేరింది. అక్కడ కొన్ని నెలలు పనిచేసిన తర్వాత 99 టీవీలో న్యూస్ రీడర్‌గా చేరారు. ఆ తర్వాత 99 టీవీని వదిలేసి టీ న్యూస్‌లో రేండేళ్లపాటు పనిచేశారు.

ఉయ్యాల జంపాల సీరియల్ ద్వారా

ఉయ్యాల జంపాల సీరియల్ ద్వారా

టీ న్యూస్‌లో న్యూస్ రీడర్‌గా పనిచేస్తుండగానే టెలివిజన్ సీరియల్స్‌లో నటించాలనే నిర్ణయం ఆమె జాతకాన్ని మార్చేసింది. స్టార్ మాలో ప్రసారమైన ఉయ్యాల జంపాల సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఆ తర్వాత ఎవరు నువ్వు మోహని, అగ్ని సాక్షి, సావిత్రమ్మ గారి అబ్బాయి లాంటి సీరియల్స్‌లో నటించి తనకంటూ ప్రేక్షకుల్లో ఫాలోయింగ్‌ను సంపాదించుకొన్నారు.

రాజ్ తరుణ్‌ సినిమాతో సినీ పరిశ్రమలో

రాజ్ తరుణ్‌ సినిమాతో సినీ పరిశ్రమలో

ఇక టెలివిజన్ రంగంలో బ్రహ్మండంగా రాణిస్తునే సినీ పరిశ్రమపై దృష్టిపెట్టారు. ఇద్దరు లోకం ఒకటే, ఒరేయ్ బుజ్జిగా అనే చిత్రాల్లో నటించడం ద్వారా మరింత పాపులారిటిని సంపాదించుకొన్నారు. ఆ తర్వాత మరుపురాని ప్రేమకథ, దట్, 4 డేస్ విత్ శ్రీ, లవ్ అండ్ డౌట్ అనే షార్ట్ ఫిలింస్‌లో నటించారు. సినిమాలు, సీరియల్స్, షార్ట్ ఫిలింస్‌తో కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లారు.

సొంతంగా యూట్యూబ్ ఛానెల్

సొంతంగా యూట్యూబ్ ఛానెల్

పలు రంగాల్లో గుర్తింపు తెచ్చుకొనే క్రమంలో సిరి హన్మంతు తనకంటూ ఓ మీడియా ఛానెల్‌ను ప్రారంభించింది. హే సిరి అంటే యూట్యూబ్ ఛానెల్‌ ప్రారంభించింది. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా లాక్‌డౌన్ లవ్, మేడమ్ సర్, మేడమ్ అంతే, రామ్ లీలా లాంటి వెబ్ సిరీస్‌లను రిలీజ్ చేసింది. సిరి ప్రారంభించిన యూట్యూబ్ ఛానెల్‌ తక్కువ కాలంలోనే 500k సబ్ స్క్రైబర్లను సొంతం చేసుకోవడం విశేషం.

బిగ్‌బాస్ తెలుగు 5లో తనదైన శైలిలో

బిగ్‌బాస్ తెలుగు 5లో తనదైన శైలిలో

ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకొన్న సిరి హన్మంతు బిగ్‌బాస్ తెలుగు 5లో కీలక కంటెస్టెంట్‌గా మారారు. టాప్ 5 రేసులోకి వెళ్లేందుకు తనదైన శైలిలో కృషి చేస్తున్నారు. ఇంటి సభ్యులకు స్పూర్తిగా నిలుస్తూ గేమ్ ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. తాజాగా నామినేషన్ ప్రక్రియలో అనిమాస్టర్ చెప్పిన విషయాలు ఆసక్తికరంగా మారాయి. విశాఖపట్నం నుంచి ఒంటరిగా వచ్చి తనకంటూ గుర్తింపు తెచ్చుకొన్న సిరి అంటే ఇష్టం. ఆమెను నేను నామినేట్ చేయను అంటూ అనీ మాస్టర్ చెప్పారు.

 చిన్నారిని దత్తత తీసుకొని తల్లిగా

చిన్నారిని దత్తత తీసుకొని తల్లిగా

ఇక బిగ్‌బాస్‌ తెలుగు షో ఉండగానే చూపించిన వీడియో మరింత ఆసక్తిని రేపింది. మమ్మీ అంటూ ఓ చిన్నారి పలకరించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే వీడియోలో కనిపించింది స్వంత బిడ్డ కాదు అనేది గమనార్హం. ఓ చిన్నారిని దత్తత తీసుకొని పెళ్లికి ముందే తల్లిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నది. ఇలా సరి హన్మంతు అందరికి ఆదర్శంగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

నామినేషన్‌లో సిరి హన్మంతు.. ఓటు ఇలా వేయాలి...

నామినేషన్‌లో సిరి హన్మంతు.. ఓటు ఇలా వేయాలి...

ఇక ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు 5లో ఏడోవారం రంజుగా సాగుతున్నది. తాజాగా ముగిసిన నామినేషన్ల ప్రక్రియలో సిరి హన్మంతు నామినేట్ అయ్యారు. ఆమె ఆటతీరు మెచ్చి ఆమెను సేఫ్ చేయాలని అనుకొంటే.. డిస్నీ హాట్ స్టార్‌ యాప్‌ ద్వారా గానీ.. లేదా 8886658201 నంబర్‌కు మిస్ట్ కాల్ ఇచ్చి ఓటు వేయవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X