For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: సిరి క్యారెక్టర్‌పై సన్నీ సంచలన వ్యాఖ్యలు.. పాపం శ్రీహాన్.. ఆ విషయం చెబితే గొడవలే అంటూ!

  |

  తెలుగు బుల్లితెరపై పెట్టుకున్న సరిహద్దులను చెరిపేస్తూ.. గతంలో ఎన్నడూ చూడని సరికొత్త కంటెంట్‌తో ప్రసారం అయిన రియాలిటీ షో బిగ్ బాస్. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. అదే సమయంలో ఐదు సీజన్లను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. గత ఆదివారమే ముగిసిన ఐదో సీజన్‌లో వీజే సన్నీ విజేతగా నిలిచాడు. దీంతో అతడు ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షోలో జరిగిన ఎన్నో విషయాలను ప్రస్తావిస్తూ బయట పెడుతున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా ఓ చానెల్‌లో చిట్ చాట్ చేసిన అతడు.. సిరి హన్మంత్ క్యారెక్టర్‌పై కామెంట్స్ చేశాడు. అంతేకాదు, ఆమె ప్రియుడి పేరును కూడా ప్రస్తావించాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  ఐదో సీజన్‌ విజేతగా నిలిచిన సన్నీ

  ఐదో సీజన్‌ విజేతగా నిలిచిన సన్నీ

  మొదటి నాలుగు సీజన్లు సూపర్ డూపర్ హిట్ అవడంతో ఐదో దానిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీని భారీ బజ్‌తో మూడు నెలల క్రితమే ప్రారంభం అయింది. ఈ సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. వీరిలో వారానికి ఒకరు చొప్పున ఇప్పటి వరకూ 14 వారాలకు 14 మంది ఎలిమినేట్ అయిపోయారు. దీంతో మిగిలిన ఐదుగురు మాత్రమే ఫినాలేకు చేరుకున్నారు. అందులో శ్రీరామ చంద్ర, వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, మానస్, సిరి హన్మంత్‌లు పోటీ పడ్డారు. వీరిలో వీజే సన్నీ ఆదివారం జరిగిన ఫినాలేలో విన్నర్‌గా నిలిచాడు.

  Bigg Boss: శ్రీరామ చంద్ర పరిస్థితి దారుణం.. షాకింగ్ న్యూస్ చెప్పిన డాక్టర్లు.. అలా చేస్తే ప్రమాదమే

  అలా ఎంటరై.. ఇలా గెలిచిన సన్నీ

  అలా ఎంటరై.. ఇలా గెలిచిన సన్నీ

  ఇటీవలే ముగిసిన ఐదో సీజన్‌లోకి 19 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఎక్కువ మంది పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. తమ తమ విభాగాల్లో పలువురు మంచి గుర్తింపును దక్కించుకున్న వాళ్లు వచ్చారు. వారిలో కొందరు మాత్రమే స్పెషల్ అట్రాక్షన్‌ అయ్యారు. అందులో వీజే సన్నీ ఒకడు. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన అతడు.. అద్భుతమైన ఆటతో సత్తా చాటాడు. కోపంతో పలుమార్లు గొడవలు పడినప్పటికీ.. ఆ తర్వాత తన ప్రేమను చూపించి కంటెస్టెంట్లతో పాటు ఆడియెన్స్ మనసులు కూడా గెలుచుకుని సీజన్ విజేత అయిపోయాడు.

  బయటకు వచ్చిన తర్వాత బిజీగా

  బయటకు వచ్చిన తర్వాత బిజీగా


  బిగ్ బాస్ షోలోకి కంటెస్టెంట్లుగా వచ్చిన వాళ్లకు ఎలాంటి ఆదరణ దక్కుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం వాళ్లు అటు బుల్లతెరపై.. ఇటు వెండితెరపై సత్తా చాటుతున్నారు. అలాంటి ఈ షోలో విజేతగా నిలిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే, ఇప్పుడు ఐదో సీజన్‌లో విజేతగా నిలిచిన వీజే సన్నీ ఫుల్ ఫేమస్ అయిపోయాడు. అదే సమయంలో వరుసగా ఇంటర్వ్యూలు, ఫ్యాన్స్ మీటింగులు, సోషల్ మీడియా లైవ్‌లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. దీంతో అతడి పేరు కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోన్న విషయం తెలిసిందే.

  Bigg Boss Winner: సన్నీ గెలుపుపై సరయు సంచలన పోస్ట్.. ఆ కంటెస్టెంట్‌కు అన్యాయం చేశారంటూ!

  అన్ని విషయాలు చెబుతున్నాడు

  అన్ని విషయాలు చెబుతున్నాడు

  బిగ్ బాస్ హౌస్‌ నుంచి విజేతగా తిరిగి వచ్చిన వీజే సన్నీ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాడు. అందుకే అతడిని యూట్యూబ్ ఛానెళ్లు, టీవీ ఛానెళ్లు అస్సలు వదలడం లేదు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షోకు సంబంధించిన రహస్యాలను తెలుసుకోవడంతో పాటు సన్నీ పర్సనల్ విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నాలు జరుపుతున్నారు. అందుకు అనుగుణంగానే అతడు కూడా హౌస్‌లో జరిగిన విషయాలను మీడియా ముందు ఉంచుతున్నాడు. ఇందులో ప్రేక్షకులకు చూపించినవే కాకుండా.. చూపించని అంశాలు కూడా ఉండడంతో ఇంటర్వ్యూలు వైరల్ అయ్యాయి.

  సిరి, షణ్ముఖ్ గురించి అలా చెప్తూ

  సిరి, షణ్ముఖ్ గురించి అలా చెప్తూ


  బిగ్ బాస్ ఐదో సీజన్ మొత్తంలో హైలైట్ అయిన వారిలో షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ ఉన్నారు. వీళ్లిద్దరూ బయట స్నేహితులు కావడంతో లోపలకు వెళ్లిన తర్వాత మరింత క్లోజ్ అయ్యారు. ఈ క్రమంలోనే తరచూ ముద్దులు పెట్టుకోవడం.. హగ్గులు ఇచ్చుకోవడం.. ప్రపోజ్‌లు చేసుకోవడం.. ఒకే బెడ్‌పై పడుకోవడం వంటివి చేశారు. దీంతో వీళ్లపై ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి. దీంతో బిగ్ బాస్ విన్నర్ సన్నీ ఎక్కడ ఇంటర్వ్యూకు వెళ్లినా వీళ్లిద్దరి రిలేషన్ గురించి అడుగుతున్నారు. దీంతో వాళ్లిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే అని సమాధానాలు చెబుతున్నాడతను.

  Bigg Boss: షణ్ముఖ్‌కు దీప్తి బ్రేకప్.. కలకలం రేపుతోన్న ఇన్‌స్టా స్టోరీలు.. ఇద్దరి మధ్య ఏం జరిగింది?

  సిరిపై సన్నీ సంచలన వ్యాఖ్యలు

  సిరిపై సన్నీ సంచలన వ్యాఖ్యలు

  తాజాగా వీజే సన్నీ ఓ న్యూస్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో 'కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన తర్వాత నీ మీద అందరి ఒపీనియన్ మారిందని అనిపించిందా' అన్న ప్రశ్న అతడికి ఎదురైంది. దీనికి సన్నీ 'అందరూ నన్నే టాప్‌లో పెట్టారు. ముఖ్యంగా సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్ కూడా నన్నే టాప్‌లో పెట్టాడు. దీంతో హౌస్‌లో సిరితో షణ్ముఖ్ గొడవ పెట్టుకున్నాడు. ఆ పంచాయతీ చాలా రోజులు నడిచింది. సిరితో ఎన్నిసార్లు కలుద్దామని ట్రై చేసినా.. నాకు స్పేస్ కావాలని అనేది. కానీ, ఆ స్పేస్‌లో మరొకరితో కలిసి ఉండేది' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

  పాపం శ్రీహాన్ అనిపించింది అంటూ

  పాపం శ్రీహాన్ అనిపించింది అంటూ

  ఇదే ఇంటర్వ్యూలో సిరి, షణ్ముఖ్ రిలేషన్ గురించి కూడా వీజే సన్నీ ఊహించని కామెంట్స్ చేశాడు. 'సిరి, షణ్ముఖ్ అంత క్లోజ్‌గా ఉండడం వాళ్ల ఇష్టం. నేను వాళ్ల అమ్మకు కూడా వాళ్లిద్దరూ ఫ్రెండ్సే అని చెప్పాను. అయినా సిరి మాత్రం నాపై ఎప్పుడూ పాజిటివ్‌గా లేదు. చాలా సార్లు ఆమెతో నీ కోసం బయట ఒకడున్నాడు.. ఇలా చేయకు అని చెప్పాలి అనిపించింది. కానీ, ఆమెతో అలా చెబితే తీసుకోదు. పైగా నాతోనే గొడవకు దిగుతుంది. దీంతో నేనెప్పుడూ అలాంటి సాహసం చేయలేదు. అందుకే చాలా సార్లు పాపం శ్రీహాన్ అనిపించింది' అని చెప్పుకొచ్చాడు సన్నీ.

  English summary
  Bigg Boss 5th Season Completed Successfully. VJ Sunny Won The Title in This Season. He Did Comments on Siri Character in Latest Interview.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X