For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Revanth: ఆ కంటెస్టెంట్‌ ‘కట్టప్ప’ అంటూ రేవంత్ షాకింగ్ పోస్ట్.. పక్కనే ఉంటూ అలా చేశాడంటూ!

  |

  తెలుగు బుల్లితెర చరిత్రలోనే మరే దానికీ రానంత రేటింగ్‌ను రాబడుతూ దేశంలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. బిగ్గెస్ట్ రియాలిటీ షోగా ఇక్కడి ప్రేక్షకులకు పరిచయమైన ఇది వరుసగా సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తోంది. ఇలా ఎన్నో రికార్డులను కూడా క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఆరో సీజన్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇందులో విజేతగా నిలిచిన రేవంత్ తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్టు హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం పూర్తిగా చదవండి మరి!

  టాప్ 5లో మిగిలింది వాళ్లే

  టాప్ 5లో మిగిలింది వాళ్లే

  బిగ్ బాస్ ఆరో సీజన్‌కు సంబంధించిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ గతంలో మాదిరిగా కాకుండా మరింత ఉత్కంఠతో సాగింది. ముందుగా రోహిత్ ఎలిమినేట్ అయి ఐదో స్థానంతో ప్రయాణాన్ని ముగించాడు. అతడి తర్వాత ఆది రెడ్డి ఎలిమినేటై నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తర్వాత కీర్తి భట్‌ కూడా ఎలిమినేట్ అయిపోయింది. దీంతో రేవంత్, శ్రీహాన్ టాప్ 2గా నిలిచారు.

  స్పోర్ట్స్ బ్రాతో అనుష్క ఓవర్ డోస్ షో: షార్ట్‌ కూడా పైకి లేపేసి మరీ!

  ట్విస్టుతో గెలిచిన రేవంత్

  ట్విస్టుతో గెలిచిన రేవంత్

  ఫినాలే స్టేజ్‌కు రేవంత్, శ్రీహాన్‌లకు హోస్ట్ అక్కినేని నాగార్జున బిగ్ బాస్ హౌస్‌లోకి గోల్డెన్ సూట్‌కేసుతో వెళ్లి ఆఫర్ ఇచ్చాడు. మొదట అమౌంట్‌కు వద్దన్నా రూ. 40 లక్షలకు శ్రీహాన్ ఓకే అనేశాడు. ఫలితంగా అతడు రన్నరప్‌తో సరిపెట్టుకోగా.. రేవంత్ ఈ సీజన్‌లో విజేతగా నిలిచాడు. ఓట్లలో మాత్రం శ్రీహాన్‌ టాప్‌లో నిలిచినట్లు చెప్పి నాగార్జున అందరికీ కోలుకోలేని షాక్‌నే ఇచ్చేశాడు.

  ఫ్యాన్స్ వార్.. వాళ్లు అలా

  ఫ్యాన్స్ వార్.. వాళ్లు అలా

  ఆరో సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో అనూహ్య పరిణామాల నడుమ బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారి ఊహించని ఫలితంగా వచ్చింది. ఇందులో శ్రీహాన్‌కు ఎక్కువ ఓట్లు వచ్చినా.. అతడు డబ్బు తీసుకోవడంతో రేవంత్ విజేతగా నిలిచాడు. ఈ పరిణామం తర్వాత వీళ్లిద్దరి అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ జరుగుతోంది. ఇందులో మా వాడే బెస్ట్ అని చెప్పుకుంటున్నారు.

  బీచ్‌లో యాంకర్ హరితేజ హాట్ షో: అలాంటి డ్రెస్‌లో తొలిసారి అరాచకంగా!

  రేవంత్‌కు శుభాకాంక్షలు

  రేవంత్‌కు శుభాకాంక్షలు

  ఓటింగ్ ఎలా ఉన్నా.. ఎన్ని ట్విస్టులు కనిపించినా.. బిగ్ బాస్ ఆరో సీజన్‌లో రేవంత్ విజేతగా నిలిచాడు. దీంతో అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతోన్నాయి. ఎంతో మంది అభిమానులు, ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా రేవంత్‌ను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. అలాగే, శ్రీహాన్‌కు కూడా పలువురు శుభాకాంక్షలు తెలుపుతోన్నారు. దీంతో వీళ్లిద్దరూ ట్రెండ్ అవుతోన్నారు.

   రేవంత్‌పై ఆది రెడ్డి పోస్ట్

  రేవంత్‌పై ఆది రెడ్డి పోస్ట్

  బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఎన్నో మలుపులతో కూడిన ఫినాలే తర్వాత రేవంత్ విజేతగా నిలిచాడు. దీంతో అతడికి ఈ సీజన్ కంటెస్టెంట్లు మద్దతుగా పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అతడి తోటి కంటెస్టెంట్ అయిన మరో ఫైనలిస్టు ఆది రెడ్డి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 'బిగ్ బాస్ ఆరో సీజన్‌లో విజేతగా నిలిచినందుకు కంగ్రాట్స్ రేవంత్ మామా' అని పోస్ట్ చేశాడు.

  సారా అలీ ఖాన్ హాట్ వీడియో వైరల్: రెడ్ బికినీలో ఎద అందాల ప్రదర్శన

  కట్టప్ప అంటూ రేవంత్

  కట్టప్ప అంటూ రేవంత్

  తనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆది రెడ్డి చేసిన పోస్టును రేవంత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. అంతేకాదు, 'మామా.. నువ్వు నా పక్కన ఉండి నాకు ఎంతో ధైర్యం ఇచ్చావు. ఇంకేం కావాలి ఆది మామా.. నువ్వు నా కట్టప్పవి. అంటే ప్రేమపూరితంగానే' అంటూ చెప్పుకొచ్చాడు. తద్వారా బిగ్ బాస్ షో ద్వారా ఆది రెడ్డితో అనుబంధం ఏర్పడిందని ఇలా వివరించాడు.

  ఫ్యామిలీతోనే ఉన్నాడు

  ఫ్యామిలీతోనే ఉన్నాడు

  బిగ్ బాస్ ఆరో సీజన్ తర్వాత ఫైనల్‌కు చేరిన కంటెస్టెంట్లు అందరూ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. కానీ, ఆరో సీజన్ విన్నర్ రేవంత్ మాత్రం తన చిన్నారి కూతురు, ఫ్యామిలీతోనే ఎక్కువగా సమయం గడుపుతున్నాడు. అందుకే ఎక్కువ భాగం ఇంట్లోనే గడుపుతున్నాడు. దీంతో రేవంత్‌ను లైవ్‌లోకి రావాలని ఫ్యాన్స్ రిక్వెస్టులు చేస్తున్నారు.

  English summary
  Bigg Boss 6th Season Completed Successfully. LV Revanth Won This Season. Now He Did Shocking Reply to Adi Reddy.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X