»   » నడి రోడ్డుపై... టీవీ నటిని వేధించి ప్రియుడు!

నడి రోడ్డుపై... టీవీ నటిని వేధించి ప్రియుడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బిగ్ బాస్ 8 రియాల్టీ షోలో కంటెస్ట్ చేస్తున్న నటి సోనీ సింగ్..... తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కారణంగా ముంబైలో నడి రోడ్డుపై వేధింపులకు గురైంది. ముంబైలోని వెర్సోవా ప్రాంతంలో జులై 6న ఈ సంఘటన చోటు చేసుకుంది. విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం రోడ్డుపై ఉన్న సోనీ సింగ్‌ను ఆమె ప్రియుడు బలవంతంగా కారులోకి లాగాడని, లోపల ఇద్దరూ కొట్టుకున్న శబ్దాలు వినిపించినట్లు తెలుస్తోంది. ఈ గొడవను ఆమె స్నేహితులు ఆపడానికి ప్రయత్నించగా తమ పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని ఆమె వారిని వారించినట్లు తెలుస్తోంది. గొడవ జరుగుతుండటంతో ఓ వ్యక్తి పోలీసులకు కాల్ చేసాడు. వారు వచ్చి ఆమెను, ఆమె ప్రయుడిని, స్నేహితులను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు.

Bigg Boss 8's Soni Singh Assaulted By Ex-Boyfriend On Mumbai Streets!

అయితే ఈ సంఘటనపై మీడియా వారు ఆమెను కాంటాక్టు చేయగా ఈ అంశంపై మాట్లాడేందుకు నిరాకరించారు. ఇది నా వ్యక్తిగత విషయం...దీని గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదని వెల్లడించినట్లు తెలుస్తోంది. సోనీ సింగ్ పలు హిందీ సీరియల్స్ లో నెగెటివ్ రోల్స్ చేస్తూ పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ 8 షోలో పాల్గొనడంతో ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఆమె ప్రియుడితో గొడవ హాట్ టాపిక్ అయింది.

Read more about: tv, soni singh, bigg boss 8, upen patel
English summary
Bigg Boss 8 contestant, Soni Singh, is reportedly assaulted by her ex-boyfriend who caught her unaware on the streets of Verosa, Mumbai, on Monday (6 July). The actress, the boyfriend and their friends were taken to the police station soon after.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu