Bigg Boss 9 Agnipariksha: కంటెస్టెంట్స్‌పై శ్రీముఖి రంకెలు.. షాకిబ్‌‌‌ నోటి దూల, అభిజిత్ పనిష్మెంట్

బిగ్‌బాస్ తెలుగు 9 షో మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ అగ్నిపరీక్ష కార్యక్రమం ఉత్కంఠగా మారింది. బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టబోయే కామన్‌మెన్ ఎవరు? అనేది చర్చనీయాంశమైంది. కంటెస్టెంట్స్‌తో దురుసు ప్రవర్తనతో జడ్జిగా వ్యవహరిస్తోన్న నవదీప్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ రెండ్రోజులు నవదీప్ ఇష్యూ హాట్ హాట్‌గా సాగగా.. తాను కంటెస్టెంట్స్‌తో ఎందుకు అలా ఉండాల్సి వచ్చింది అనే దానిపై నవదీప్ వివరణ ఇచ్చాడు. తాజగా బిగ్‌బాస్ 12వ ఎపిసోడ్‌ హాట్ హాట్ ‌గా జరిగింది. ఈ వివరాలు చూస్తే..

3 రోజులే డెడ్‌‌లైన్
బిగ్‌బాస్ తెలుగు 9లోకి కామన్‌మెన్‌ను పంపడానికి ఉద్దేశించిన బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ముగియడానికి కేవలం 3 ఎపిసోడ్సే మిగిలి ఉన్నాయి. ఈ లోపే ఎవరు బిగ్‌బాస్‌లో అడుగుపెడతారో తేల్చాల్సి ఉంటుంది. మొత్తం 15 మంది కామనర్లను బిగ్‌బాస్ 15 కోసం ఎంపిక చేయగా.. వీరికి రకరకాల టాస్క్‌లు, కండీషన్స్, గేమ్స్ పెడుతూ పరీక్షిస్తున్నారు నిర్వాహకులు. బిగ్‌బాస్‌ 9లోకి అడుగుపెట్టే అవకాశాలు ఫలానా వారికి ఉన్నాయంటూ పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. దమ్ము శ్రీజ, అనూష, కల్కి తదితరులకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.

Bigg Boss 9 Agnipariksha Abijeet issued Yellow card punishment to shakib

ఎలిమినేషన్‌కు రెడీ
తాజా ఎపిసోడ్‌‌లో 15 మంది కంటెస్టెంట్స్‌‌ని పిలిచి ఎలిమినేషన్ ప్రాసెస్‌కి శ్రీకారం చుట్టారు న్యాయ నిర్ణేతలు. రెండు ఎల్లో కార్డ్‌లు వస్తే.. రెడ్ కార్డ్ వచ్చినట్లేనని చెప్పింది బిగ్‌బాస్. కొన్ని కార్డ్స్‌ని జడ్జిలు ఇస్తారని, మిగిలిన వాటిని హౌస్‌మెట్సే ఇస్తారని తెలిపింది. 15 మందిలో ఎవరిపై ఏ ఓపీనియన్ ఉందో చెప్పాలని శ్రీముఖి కాన్సెప్ట్ చెప్పింది. ఆ తర్వాత ఓపీనియన్ ఇచ్చిన కంటెస్టెంట్, ఓపీనియన్ తీసుకున్న కంటెస్టెంట్‌‌ని ఓ జంటగా చేసి మొత్తం ఏడు టీమ్‌లుగా ఓ గేమ్ పెట్టారు.

కళ్లకు గంతలతో టాస్క్
ఈ ఆటలో ఒకరు ఆడిస్తారు, ఇంకొకరు ఆడతారు అని శ్రీముఖి చెబుతుంది. నేను ఒక ఐటెం పేరు చెబుతానని, ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్‌తో తీసుకోవాలి.. దానిని రైట్ హ్యాండ్‌కి ట్రాన్స్‌‌ఫర్ చేసుకోవాలి. దానిని ఇంకో బౌల్‌లో వేయాలని చెబుతుంది శ్రీముఖి. ఎదాంతో కంటెస్టెంట్స్‌లో కొందరి కళ్లకి గంతలు కట్టి.. మరో కంటెస్టెంట్‌తో వారి చేతులను ఆడించేలా కర్రలు సెట్ చేశారు. ఆ తర్వాత ఎవరూ మాట్లాడొద్దని కార్డ్ తిప్పి జిలేబీ చూపిస్తుంది శ్రీముఖి. దాంతో అంతా టాస్క్ కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తారు. అయిపోయిందని చెబుతున్నా వినిపించుకోకుండా దాల్య.. విచ్ వన్ అని అడుగుతుంది.

అభిజిత్ ఆగ్రహం
ఆ మాటలతో కోప్పడ్డ శ్రీముఖి.. ఎందుకు అలా అడిగావ్ అని మండిపడింది. టాస్క్ ముగిసిన తర్వాత షాకిబ్ గేమ్ ఎలా ఆడాలో ప్రాక్టీస్ చేస్తుండటంతో ఫైర్ అయ్యింది. యూ డోంట్ అండర్‌స్టాండ్ ద రూల్స్ అంటూ భగ్గుముంది. మీరు బయటికి రండి అంటూ నవదీప్ వాళ్లని బయటికి తీసుకొస్తాడు. దాంట్లో కొన్ని రూల్స్ మాత్రమే ఉన్నాయని, అన్ని పర్టిక్యూలర్‌గా లేవని షాకీబ్ అనడంతో.. ఏ రూల్స్ సరిగా లేవని బిందు మాధవి ప్రశ్నించింది. అయితే వెళ్లి చేతులు పట్టి వేయించు అంటూ అభిజిత్ మండిపడటంతో స్టిక్కే పట్టుకోవాలిగా అంటూ సాకేత్ పంచ్ వేస్తాడు. దాంతో ఫైర్ అయిన అభిజిత్ ఏం చెబుతున్నావ్ నువ్వు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎల్లో కార్డ్ ఇచ్చాడు. మరి చివరి మూడు రోజుల్లో అగ్నిపరీక్షలో ఏం జరుగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X