Bigg Boss 9 Telugu 2nd Week Voting: 2వ వారం నామినేషన్‌లో 8 మంది.. షాకింగ్‌గా ఓటింగ్.. డేంజర్ జోన్‌లో ఎవరంటే?

బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌లో రెండో వారం ఎలిమినేషన్‌కు రంగం సిద్దమైంది. రెండో వారంలో నామినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్లు మాటల యుద్ధంతో రక్తి కట్టించారు. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అర్హత ఉన్న సభ్యుల పేర్లు చెబుతూ.. వారి గుణగణాలను లెక్కించారు. ఓ దశలో కంటెస్టెంట్ల మధ్య హోరాహోరీగా వాగ్వాదం జరిగింది. దాదాపు రెండు రోజులపాటు జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఎవరు నామినేట్ అయ్యారు? ఎవరికి ఓటింగ్ ఎలా జరుగుతుంది అనే వివరాల్లోకి వెళితే..

తొలి వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఉత్కంఠగా సాగిన విషయం తెలిసిందే. ఇంట్లో తన ఉనికిని చాటుకోలేకపోయిన ప్రముఖ కోరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ సీజన్‌లో బలమైన కంటెస్టెంట్‌గా కనిపించినప్పటికీ.. తన ఆట తీరుతో ఆడియెన్స్‌ను మెప్పించలేకపోయింది. దాంతో తక్కువ ఓట్లు తెచ్చుకొన్న ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఎలిమినేషన్ ప్రక్రియ తర్వాత రెండో వారం నామినేషన్ ప్రక్రియను మొదలు పెట్టారు.

Bigg Boss 9 Telugu 2nd Week Voting

ఆదివారం రాత్రి మొదలైన రెండో వారం నామినేషన్ ప్రక్రియలో దాదాపు ఇంటి సభ్యులందరూ హరిత హరీష్‌ను టార్గెట్ చేశారు. ఇంటి సభ్యుల్లో చాలా మంది ఆయనను నామినేట్ చేశారు. ఈ సందర్భంగా హరీష్‌తో భారీగా వాగ్వాదం జరిగింది. రీతూ చౌదరీ, భరణి, సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్, ఇతర కంటెస్టెంట్లతో పెద్ద ఎత్తున గొడవ చోటు చేసుకొన్నది. దాదాపు 48 గంటలపాటు సాగిన ఈ ప్రక్రియ గందరగోళం మధ్య ముగిసింది.

ఇక రెండో వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి మొత్తం 8 మంది ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. నామినేషన్‌లో నిలిచిన వారిలో హరిత హరీష్, భరణి శంకర్, ఫ్లోరా సైనీ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, డీమాన్ పవన్, సంజన గల్రానీ నామినేట్ అయ్యారు. ఈ నామినేషన్ ప్రక్రియ సందర్భంగా కెప్టెన్ సంజనకు స్పెషల్ పవర్ ఇచ్చి ఒకరిని నామినేట్ చేయమని అడిగితే.. సుమన్ శెట్టిని డైరెక్టుగా నామినేట్ చేశారు.

అయితే రెండో వారం నామినేషన్ల ప్రక్రియ ముగియగానే.. ఓటింగ్ లైన్స్ ప్రారంభించారు. ఓటింగ్ లైన్స్ ప్రారంభమైన కొద్ది గంటలకే భారీగా ఓటింగ్ జరిగింది. తమ కంటెస్టెంట్లను ఎలిమినేషన్ నుంచి రక్షించుకొనేందుకు ఆడియెన్స్, వ్యూవర్స్, ఫ్యాన్స్ భారీగా ఓటింగ్ కొనసాగిస్తున్నారనే విషయం ఓటింగ్ శాతంతో స్పష్టమవుతున్నది. అయితే టాప్ సెలబ్రిటీలు నామినేషన్‌లో ఉండటంతో రానున్న రెండు రోజుల్లో భారీగా ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉంది.

రెండో వారం ఎలిమినేషన్ కోసం జరుగుతున్న ఓటింగ్‌లో తాజా సమాచారం అందే సరికి.. పోలైన ఓట్లలో భరణి శంకర్‌కు 45 శాతానికిపైగా ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత సుమన్ శెట్టికి 35 శాతం, సంజనాకు 20 శాతం, ఫ్లోరా సైనికి 15 శాతం ఓటింగ్, డీమాన్ పవన్‌కు 14 శాతం, ప్రియా శెట్టికి 9 శాతం, మనీష్ మర్యాదకు 8 శాతం ఓటింగ్ నమోదైంది అని తెలిసింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం మరింత ఆసక్తిగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X