Bigg Boss 9 Telugu 3rd Week Nominations: బిగ్‌బాస్ 3వ వారం నామినేషన్‌లో 6 కంటెస్టెంట్లు.. డేంజర్ జోన్‌లో ఎవరు
బిగ్‌బాస్ తెలుగు 9 రియాలిటీ షో రెండో వారం ముగించుకొని మూడో వారంలోకి ప్రవేశించింది. గత రెండు వారాల్లో కంటెస్టెంట్లు తమ ఉనికి చాటుకోవడానికి రకరకాల ప్రయత్నాలు, టాస్క్‌లు పూర్తి చేశారు. పలు రకాల వివాదాలు, ఇంటి సభ్యుల మధ్య విభేదాలు కనిపించాయి. రకరకాల భావోద్వేగాలత ఈ సీజన్ ముందుకు కొనసాగుతున్నది. అయితే రెండో వారం ఎలిమినేషన్ పూర్తయిన తర్వాత మూడో వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు. అయితే ఈ ప్రక్రియలో ఎవరు నామినేట్ అయ్యారు. నామినేషన్ ప్రక్రియలో ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌లో గత రెండు వారాల్లో రెండు ఎలిమినేషన్లు జరిగిపోయాయి. తొలి వారం ఇంటి నుంచి సెలబ్రిటీ క్యాటగిరి నుంచి పుష్ప 2 కొరియోగ్రాఫర్ శ్రష్టివర్మ బయటకు వెళ్లడం తెలిసిందే. ఇక రెండో వారం ఇంటి నుంచి కామన్ మ్యాన్ గ్రూప్ నుంచి మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యారు. అయితే సోషల్ మీడియాలో బలంగా లేని కారణంగా ఈ ఇద్దరు బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఓటింగ్ తక్కువగా నమోదు కావడం వీరి ఎలిమినేషన్‌కు ప్రధాన కారణమని తెలిపారు.

ఇక మూడో వారంలో ఇంటిలో ఉండటానికి అర్హత లేని వారిని నామినేట్ చేయమని కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చారు. ఈ నామినేషన్ ప్రక్రియను ఆసక్తికరంగా ప్రారంభించి.. ఒకరిపై మరోకరు ఘాటుగా విమర్శలు చేసుకొన్నారు. ఈ సందర్భంగా శ్రీజ, హరిత హరీష్, ప్రియాశెట్టి, సంజన, ఫ్లోరా సైనీ, ఇమ్మాన్యుయేల్, భరణికి మధ్య భారీగా వాగ్వాదం జరిగిందనే విషయం తెలిసింది.
మూడో వారం నామినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ సూపర్ పవర్ ఇచ్చారు. ఇంటిలో ఉండటానికి అర్హత లేని సభ్యుడిని నేరుగా నామినేట్ చేయవచ్చని సూచించడంతో కంటెస్టెంట్లు చెలరేగిపోయారు. బిగ్‌బాస్ చెప్పిన ప్రకారం.. టెనెంట్స్ అందరూ కలిసి ఓనర్స్‌లో నలుగురిని నామినేట్ చేసుకోవాలి. అలాగే ఓనర్లలో ఒకరిని ఓనర్లు నామినేట్ చేసుకోవాలని సూచించారు. దాంతో ఊహించిన విధంగా మిత్రులుగా ఉన్న వారు శత్రువులుగా మారి నామినేషన్ ప్రక్రియలో తడాఖా చూపించారు.
ఇక ఓనర్లకు బిగ్‌బాస్ ఓ వెసులుబాటును ఇచ్చారు. నామినేషన్‌లో ఉన్న ఇద్దరిని మరో ఓనర్‌తో స్వాప్ చేసుకోవచ్చిన సూచించారు. దాంతో సంజన, సుమన్ శెట్టిని రాము రాథోడ్‌తో స్వాప్ చేసినట్టు సమాచారం. దాంతో ఊహించని కంటెస్టెంట్లు నామినేషన్‌లోకి వచ్చారు. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో ఓనర్లకు, టెనెంట్స్ మధ్య భారీగానే గొడవలు చోటుచేసుకొన్నాయి.
బిగ్‌బాస్ ఇంటి నుంచి 3వ వారంలో బయటకు వెళ్లడానికి అర్హత ఉన్నట్టు కంటెస్టెంట్లు భావించిన వారిలో రాము రాథోడ్, రీతూ చౌదరీ, ప్రియా శెట్టి, హరిత హరీష్, కల్యాణ్, ఫ్లోరా షైనీ ఉన్నట్టు తెలిసింది. మొత్తం ఈ వారం 6 గురు నామినేట్ అయ్యారు. ముగ్గురు సెలబ్రిటీలు, ముగ్గురు కామన్ మ్యాన్స్ నామినేషన్‌లో ఉన్నట్టు సమాచారం. బిగ్‌బాస్ తెలుగు షో గురించిన మరిన్నీ అప్ డేట్స్ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











