Bigg Boss 9 Telugu 4th Week Nominations: బిగ్‌బాస్ 9 తెలుగు 4 వారం నామినేషన్లు.. ఎవరెవరు డేంజర్ జోన్‌లో అంటే?

బిగ్‌బాస్ తెలుగు 9 రియాలిటీ షోలో మూడో వారం విజయం వంతంగా ముగించుకొని నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే ఊహించిన దానికంటే ఎక్కువ డ్రామాను నడిపించి ఇంటి నుంచి ముగ్గురిని ఎలిమినేట్ చేశారు. అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ నుంచి సంజన గల్రానీ అనూహ్యంగా తప్పించుకొన్నది. అయితే మూడో వారం ఎలిమినేషన్ తర్వాత నాలుగో వారం నామినేషన్స్ రంజుగా మొదలైనట్టు సమాచారం. అయితే ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఎలా ఉంది? ఎవరు నామినేట్ అయ్యారు? అనే వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగు ఇంటిలో మూడో వారంలో నామినేషన్, ఓటింగ్‌కు సంబంధం లేకుండా సంజనా గల్రానీకి మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరుతో ఎలిమినేట్ చేశారు. మెయిన్ గేట్ ద్వారా ఇంటి నుంచి బయటకు పంపి.. సీక్రెట్ రూమ్‌లో ఉంచారు. వీకెండ్ ఎపిసోడ్‌లో వేదిక మీదకు తీసుకొచ్చి డ్రామా నడిపించారు. ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించే క్రమంలో సభ్యుల త్యాగాల పేరుతో ఆమెను ఇంటిలోకి తీసుకొచ్చారు.

Bigg Boss 9 Telugu 4th Week Nomination

ఇక గతవారం నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్లలో ప్రియాశెట్టి ఎలిమినేట్ అయ్యారు. తన ఆట తీరును, ఓటింగ్‌ను మెరుగుపరుచుకోలేకపోయవడంతో ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించేశారు. దాంతో మూడో వారం ఎలిమినేషన్ కూడా జరిగిపోయింది. దాంతో తొలివారం శ్రష్టి వర్మ, మనీష్ మర్యాద, ప్రియా శెట్టి ఎలిమినేషన్ అయ్యారు. ఇందులో ఇద్దరు కామన్ మ్యాన్స్, ఒకరు సెలబ్రిటీ కేటగిరి నుంచి బయటకు వెళ్లిపోయారు.

ఇక నాలుగో వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియను బిగ్‌బాస్ తెరపైకి తెచ్చాడు. ఈ వారం నామినేషన్ ప్రక్రియను ఆసక్తికరంగా మార్చారనే విషయం బయటకు వచ్చింది. ప్రతీ కంటెస్టెంట్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి.. ఇంటిలో ఉండటానికి ఎవరికి అర్హత లేదో వారి పేర్లు చిట్టిని ఓటుగా మార్చి బాక్స్‌లో వేయాలని సూచించాడు. దాంతో గుట్టు చప్పుడు కాకుండా కంటెస్టెంట్లు కొందరు ఇంటి సభ్యులను నామినేట్ చేసి డేంజర్ జోన్‌లోకి నెట్టారు.

బిగ్‌బాస్‌లో 4వ వారం ప్రక్రియ ఎమోషనల్‌గా సాగింది. చాలా మంది తమతో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని భావోద్వేగాలకు గురయ్యారు. కొందరిపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తూ ఇంటి సభ్యులను నామినేట్ చేయడం కనిపించింది అనే విషయం సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. అయితే ఈ నామినేషన్ ప్రక్రియ సోమవారం మధ్యాహ్నం తర్వాత లైవ్ స్ట్రిమింగ్‌లో చూడటానికి అవకాశం ఉంది.

అయితే తాజా సమాచారం ప్రకారం.. 4వ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన వారిలో హరిత హరీష్, రీతూ చౌదరీ, దివ్య నిఖిత, శ్రీజ కామన్ మ్యాన్ కేటగిరిలో.. సంజన గల్రానీ, ఫ్లోరా షైనీ సెలబ్రిటీ క్యాటగిరిలో నామినేట్ అయ్యారు. ఈ నామినేట్ అయిన వారి పేర్లు త్వరలోనే అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ వారం నామినేషన్‌లోకి ఎవరు వచ్చారు? ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం గురించి ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X