Bigg Boss 9 Telugu 5th Week Nominations: 5వ వారం నామినేషన్‌లో సంజన, రీతూ చౌదరీ, తనూజ గౌడ.. ఇంకా ఎవరెవరంటే?

బిగ్‌బాస్ తెలుగు 9 రియాలిటీ షోలో భారీ ట్విస్ట్ కనిపించింది. 5వ వారం నామినేషన్ ప్రక్రియలో ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ ఊహించని షాక్ ఇచ్చాడు. రెగ్యులర్ పద్దతిలో కాకుండా నామినేషన్ ప్రక్రియను మార్చేసి అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేశారు. బిగ్‌బాస్ చేసిన గిమ్మిక్కు మాత్రం అందర్నీ హడల్ ఎత్తించడమే కాకుండా ఇంటిని రణరంగంగా మార్చింది. 5వ వారం నామినేషన్ ప్రక్రియలో బిగ్‌బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏమిటి? ఎవరెవరు నామినేట్ అయ్యారు అనే వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్‌లో ప్రతీ వారం నామినేషన్ ప్రక్రియలో ఆటగాళ్ల నిజస్వరూపాలు బయటపడుతుంటాయి. వారం రోజుల్లో జరిగిన విషయాలను మనసులో పెట్టుకొని తమ ప్రత్యర్థి కంటెస్టెంట్లను ఇతర ఇంటి సభ్యులు నామినేట్ చేస్తుంటారు. అయితే 5వ వారంలో కూడా అదే ఊపుతో అందరూ వచ్చి నామినేషన్ ప్రక్రియలో నిలుచున్నారు. కానీ బిగ్‌బాస్ మాత్రం ఇంటి సభ్యులు మధ్య మరో విధంగా రణరంగం సృష్టించేందుకు ప్లాన్ చేయడం కనిపించింది.

Bigg Boss 9 Telugu 5th Week Nominations

నామినేషన్ ప్రక్రియ కోసం ఇంటి సభ్యులు భరణి, సుమన్ శెట్టి, ఆశా సైనీ, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీ, శ్రీజ దమ్ము, కల్యాణ్, డీమాన్ పవన్, తనూజ గౌడ, రీతూ చౌదరీ, దివ్య నిఖిత అందరూ వరుసగా లైన్‌లో నిలుచున్నారు. బిగ్‌బాస్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ తెలుగు 9 షోలో 5వ వారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయినసభ్యులు అంటూ అందరి పేర్లు చదివాడు. ఆ తర్వాత ఇంతటితో నామినేషన్ ప్రక్రియ ముగిసింది అంటూ తన స్పీచ్‌ను ముగించాడు. దాంతో అందరి ముఖాల్లో షాక్ కనిపించింది. ఈ క్రమంలో మీ పేరు కూడా చెప్పాడా? అంటూ ఒకరికొకరు తమ అడిగి కన్ఫార్మ్ చేసుకోవడం కనిపించింది.

బిగ్‌బాస్‌లో 5వ వారం నామినేషన్‌లో కెప్టెన్ రాము యాదవ్ తప్పా అందరూ నామినేట్ అయ్యారు. కెప్టెన్ కారణంగా ఎలిమినేషన్ ముప్పు నుంచి ఫ్రీ అయ్యాడు. ఇక నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత బిగ్‌బాస్ ఇచ్చిన ట్విస్టుపై అందరూ మాట్లాడుకోవడం కనిపించింది. ఇది చదరంగం కాదు.. రణరంగం అంటూ కామెంట్ చేశారు. అలా ఇంటి సభ్యులందరూ నామినేట్ కావడంతో ఇళ్లంతా రణరంగంగా మారింది.

అయితే నామినేషన్ నుంచి బయట పడటానికి ఇంటి సభ్యులకు ఓ టాస్క్ ఇచ్చాడు. ఓ బెడ్ వేసి.. అందులో ఎక్కువ సేపు ఎవరు కూర్చొంటారో వారు నామినేషన్ నుంచి బయటపడే అవకాశం ఉంటుందని చెప్పాడు. దాంతో బెడ్ మీద నుంచి వారిని లాగేసేందుకు ఇంటి సభ్యుల్లో కొందరు ఒకరికొకరు బల ప్రదర్శన చేశారు. దాంతో ఇంటిలో సభ్యుల మధ్య గందరగోళం నెలకొన్నది. అయితే చివరకు ఈ నామినేషన్స్‌లో ఎవరు ఉంటారు అనే విషయంపై త్వరలో క్లారిటీ వస్తుంది.

ప్రస్తుతానికి 5వ వారం నామినేషన్‌లో ఉన్న వారిలో భరణి, సుమన్ శెట్టి, ఆశా సైనీ, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీ, శ్రీజ దమ్ము, కల్యాణ్, డీమాన్ పవన్, తనూజ గౌడ, రీతూ చౌదరీ, దివ్య నిఖిత ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న టాస్క్ ప్రకారం.. ఎవరు నామినేషన్ నుంచి బయటపడుతారో వేచి చూడాల్సిందే. ఈ వారం ఆటను మరింత రసవత్తరంగా బిగ్ బాస్ మార్చేశాడనే విషయం గేమ్‌లో ఆసక్తిని రేపుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X