Bigg Boss: వాళ్ల కోసం నన్ను బలి చేశారు.. బిగ్‌బాస్‌ సీక్రెట్స్ బయటపెట్టిన శ్రీజ

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu 9) రసవత్తరంగా సాగుతోంది. ప్రతివారం ఎలిమినేషన్‌ చుట్టూ జరుగుతున్న డ్రామా ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తోంది. అయితే ఈ సారి మాత్రం ప్రేక్షకుల్లో తీవ్ర ఆగ్రహం రేకెత్తించింది. కారణం దమ్ము శ్రీజ ఎలిమినేషన్. మొదటిసారి ఓటింగ్‌తో సంబంధం లేకుండా ఆమెను ఎలిమినేట్ చేయడం, తర్వాత రీఎంట్రీ ఇస్తున్నట్టుగా చూపించి మళ్లీ ఎలిమినేట్ చేయడం చర్చనీయంగా మారింది. పలు అనుమానాలు దారితీసింది. మరో మాటలో చెప్పాలంటే.. శ్రీజ అభిమానులను తీవ్రంగా ఆవేదనకు గురి చేసింది.ఈ అంశంపై తాజాగా శ్రీజ దమ్ము స్వయంగా స్పందించింది. బిగ్‌బాస్ టీమ్‌పై ఘాటుగా విమర్శలు గుప్పిస్తూ ఓ సంచలన వీడియో రిలీజ్ చేసింది. ఇంతకీ ఏమన్నారంటే ?

దమ్ము శ్రీజ తన వీడియోలో మాట్లాడుతూ.. "బిగ్‌బాస్ హౌస్‌లోకి రీఎంట్రీ అంటూ నన్ను పిలిచారు. కానీ నిజానికి అది మరో ఎలిమినేషన్ డ్రామా మాత్రమే. నేను హోటల్‌లో ఉండగా రీఎంట్రీ ఉంటుందని చెప్పారు. కానీ, స్టూడియోకి వెళ్ళిన తర్వాత అక్కడ భరణి గారు కూడా ఉన్నారు. అప్పుడే ఏదో ప్లాన్ జరుగుతోందని అర్థమైంది. ఎందుకంటే నన్ను మొదటిసారి ఎలిమినేట్ చేసినప్పుడు కూడా ఓటింగ్ ఫలితాలతో సంబంధం లేకుండా తొలగించారు. రెండోసారి కూడా అదే రిపీట్ చేశారు" అని ఆవేదన వ్యక్తం చేసింది.

Bigg Boss 9 Telugu Update Dammu Srija Questions Host Nagarjuna For Her Unfair Elimination

శ్రీజ ఇంకా మాట్లాడుతూ.. "స్టేజ్ మీదకు వెళ్లేవరకూ కూడా నాకు ఏం అర్థం కాలేదు. ఏదైనా సీక్రెట్ టాస్క్ ఇస్తున్నారేమో అనుకున్నా. కానీ వెంటనే 'బజ్ ఇంటర్వ్యూ' ఉంది అని చెప్పారు. అప్పుడు నాకు నిజం అర్థమైంది. ఆ తర్వాత చాలా బాధపడ్డాను. ఈ అనుభవం వల్ల నేను తర్వాత బిగ్‌బాస్ ఎపిసోడ్‌లు కూడా చూడలేదు" అని శ్రీజ చెప్పింది. భరణి రీఎంట్రీ కోసం నన్ను బలిపశువును చేశారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. శ్రీజ ప్రకారం.. రీఎంట్రీ మొత్తం ఒక 'సెట్ అప్'మాత్రమేననీ, తనని పిలవడం కూడా ఒక ప్రీ-ప్లాన్ అని ఆరోపించారు.

అదే సమయంలో శ్రీజ మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. "హౌస్ గేటు ఓపెన్ చేసినప్పుడు భరణి గారికి హింట్ ఇచ్చారు. ఈసారి గేమ్ బాగా ఆడండి, మీరు ఉంటారు' అని చెప్పారు. అంటే ముందే డిసైడ్ అయిపోయింది. ఆ సమయంలోనే నాకు తెలిసింది నా ఎలిమినేషన్ పక్కా అని. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు," అని శ్రీజ చెప్పింది. భరణి కోసం తనని బలి చేశారని బిగ్‌బాస్ టీమ్ తప్పిదమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

"నా ఎలిమినేషన్ వల్ల బిగ్‌బాస్‌పై వచ్చిన నెగటివ్ రియాక్షన్‌ను వదిలించుకోవడానికే నన్ను రీఎంట్రీకి పిలిచారు. కానీ చివరికి మళ్లీ అవమానపరిచారు. కనీసం రెండోసారి కూడా ఫేర్ ఎలిమినేషన్ జరగలేదు. ఇది న్యాయం కాదు. ప్రేక్షకులు ఇచ్చిన ఓట్లను గౌరవించడం అంటే ఇదేనా?" అని ప్రశ్నించింది. "నేను బిగ్‌బాస్‌లో నిజాయితీగా ఆడాను. కానీ నన్ను అవమానించేలా బయటకు పంపారు. కనీసం నాకు నా 'జర్నీ వీడియో' ఇవ్వండి చాలు. అదే నాకు గౌరవం. ఈ అన్యాయం పట్ల నేను మౌనం పాటించలేను. ప్రేక్షకుల మద్దతు నాకు ధైర్యం ఇస్తోంది " అంటూ శ్రీజ భావోద్వేగానికి లోనైంది.

శ్రీజ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు బిగ్‌బాస్ టీమ్‌ను టార్గెట్ చేస్తూ "ఇది పూర్తిగా ప్లాన్డ్ ప్రోగ్రామ్ ", "భరణి కోసం శ్రీజను బలిచేశారు", "ఫేక్ రీఎంట్రీ డ్రామా" అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు భరణి అభిమానులు మాత్రం "అతను నిజమైన డిజర్వింగ్ కాంటెస్టెంట్" అని చెబుతున్నారు. అయితే ఎక్కువమంది ఆడియన్స్ మాత్రం శ్రీజకు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి శ్రీజ ఎలిమినేషన్ డ్రామా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఫేర్ గేమ్ లేకుండా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడంపై ప్రేక్షకులు ప్రశ్నలు వేస్తున్నారు. అలాగే.. ఓటింగ్ సిస్టమ్ అర్థమేంటి? అనే చర్చ మొదలైంది.

More from Filmibeat

Read more about: Bigg Boss Telugu 9 bharani sreeja
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X