Bigg Boss 9 Agnipariksha : అగ్ని పరీక్ష కాదు నరకమే.. బిగ్ బాస్ 9 ఎంపికలో కంటెస్టెంట్లకు చుక్కలు

తెలుగు రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ అగ్ని పరీక్ష ద్వారా కంటెస్టెంట్స్ ను ఎంపిక చేస్తున్నారు. ఈసారి బిగ్ బాస్ హౌజ్ లోకి ఇద్దరు కామన్ మెన్ కు ఎంట్రీ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బుల్లితెర వెండితెర నటీనటులు, సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్స్ ను బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ జాబితా అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ఇక ప్రస్తుతం కామన్ మెన్ ఎంట్రీలకు ఇద్దరిని ఎంపిక చేసే ప్రక్రియ ఆసక్తికరంగా కొనసాగుతోంది.

ప్రస్తుతం బిగ్ బాస్ అగ్ని పరీక్షకు సంబంధించిన ఎపిసోడ్స్ ఆసక్తికరంగా మారాయి. ఇందులో ఇప్పటికే తొలిదశ ఫిల్టర్ జరుగుతోంది. వందలకొద్ది వచ్చిన అప్లికేషన్స్ లో 21 మందిని ఎంపిక చేశారు. ఇందులో ఇప్పటికే నెక్ట్స్ టాస్క్ కు ఐదుగురు ఎంపికయ్యారు. మిగిలిన 16 మందిలో మరో 9 మందిని ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సందర్భంగా వారికి కఠినమైన పరీక్షలు నిర్వహిస్తున్నారు. Dare or Die టాస్క్ ద్వారా ఈ ఫిల్టర్ జరుగుతోంది. దీంతో కంటెస్టెంట్స్ కు జడ్జీలు చుక్కలు చూపిస్తున్నారు. చావు అంచుల వరకు వెళ్లే ప్రమాదకరమైన ఆటలను ఆడిస్తున్నారు.

Bigg Boss Agnipariksha EP4 - Promo 1

తాజాగా బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 4 మొదటి ప్రోమో ప్రకారం.. ప్రస్తుతం 9 ఖాళీ గోల్డెన్ చైర్స్ ఉన్నాయని చెప్పారు. 16 మంది మధ్య పోటీ ఉంటుందని చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ అగ్నిపరీక్షలో డేర్ or డైని ప్రారంభించడానికి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి గెస్ట్ గా హాజరయ్యారు. గేమ్ ను ప్రారంభించిన తర్వాత హీరో నవదీస్ కంటెస్టెంట్స్ కు గేమ్ గురించి వివరాలు చెబుతాడు. అంతకంటే ముందు కంటెస్టెంట్స్ కు పరీక్షలు నిర్వహిస్తారు. డేర్ ఎంచుకున్న వారికి ఒక రకమైన టాస్క్ లు, డై ఎంచుకున్న వారికి మరొకమైన టాస్క్ లు ఇచ్చారు.

ఈ సందర్బంగా ఇద్దరు మేల్ కంటెస్టెంట్స్ షర్ట్స్ విపేసి ఛాతిపై ఉన్న వెంట్రుకలను ప్లాస్టర్ అతికించి పీకేశారు, దాంతో నొప్పి తట్టుకోలేక వారు ఏడ్చేశారు. ఆ తర్వాత ఇద్దరు కంటెస్టెంట్స్ కు కరెంట్ షాక్ లు పెట్టారు. అలాగే మరో కంటెస్టెంట్ కు పచ్చబోటు వేసి టార్చర్ చేశారు. ఆ తర్వాత మరో 7 గురు కంటెస్టెంట్స్ కు సుత్తిలు ఇచ్చి తమ మొబైల్ ఫోన్స్ ను పగలగొట్టండి అని ఆదేశిస్తారు. ఇక వాళ్లు షాక్ అయిపోతారు. నవదీప్ మాట్లాడుతూ చేస్తానని దిగిన తర్వాత ఆ టాస్క్ చేయకుండా ఉంటే తిరిగి ఇంటికి పంపిచేస్తామని హెచ్చరించాడు.

దీంతో ఒక కంటెస్టెంట్ తన మొబైల్ ఫోన్ ను బద్దలు చేశాడు. ఆ తర్వాత మరో ఇద్దరు కంటెస్టెంట్స్ కు కొన్ని వస్తువులను ఇచ్చి దానితో తమ గడ్డాన్ని సగం షేవ్ చేసుకోవాలని టాస్క్ లో భాగంగా చెప్పారు. ఇక బిగ్ బాస్ హౌజ్ లో షో మొత్తం అలాగే ఉండాలని కూడా సూచించారు. ఇలా ఒక్కో కంటెస్టెంట్ కు డేర్ or డైలో ఇచ్చిన టాస్క్ లు షాకింగ్ గా ఉన్నాయి. ఈ ఫుల్ ఎపిసోడ్ జియో హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X