»   » మరీ ఇంత దారుణమా? అనుకులోపే సర్ ప్రైజ్ చేసిన బిగ్‌బాస్... ఆదర్శ్ హ్యాపీ!

మరీ ఇంత దారుణమా? అనుకులోపే సర్ ప్రైజ్ చేసిన బిగ్‌బాస్... ఆదర్శ్ హ్యాపీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Bigg Boss Telugu : Unexpected Situations In Bigg Boss

'బిగ్ బాస్' ఇంట్లో మంగళవారం ఎపిసోడ్‌లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఇంటి సభ్యులైన శివ బాలాజీ, ఆదర్శ్‌లకు బిగ్ బాస్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. శివ బాలాజీ భార్య స్వప్న మాధురి, ఆదర్శ్ వైఫ్ గుల్‌నార్‌ ఒకరి తర్వాత ఒకరు బిగ్‌బాస్ ఇంట్లోకి అడుగు పెట్టారు.

దాదాపు రెండు నెలల తర్వాత తమ జీవిత భాగస్వాములను చూడటంతో అటు శివ బాలాజీ, ఇటు ఆదర్శ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సీన్ చూసి ఇంటి సభ్యులు కూడా ఎమోషనల్ అయ్యారు. తెలుగు బిగ్‌బాస్ మొత్తంలో ఇది ది బెస్ట్ మూమెంట్స్‌గా ప్రేక్షకుల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఫన్నీ గేమ్స్.... ఆపై వైఫ్ ఎంట్రీ

ఫన్నీ గేమ్స్.... ఆపై వైఫ్ ఎంట్రీ

శివ బాలాజీ వైఫ్, ఆదర్శ్ వైఫ్ ఇంట్లోకి వచ్చే ముందు ఇంటి సభ్యులతో బిగ్ బాస్ వింత గేమ్ ఆడించారు. వారు గేమ్ ఆడుతుండగానే స్వప్న మాధురి, గుల్‌నార్ ఇంట్లోకి ఎంటరయ్యారు. వారు ఇంట్లోకి ఎంటరయ్యే ముందు అందరూ బిగ్ బాస్ ఆదేశాల మేరకు ఫ్రీజ్ అయిపోయి ఉన్నారు.

తొలుత స్వప్న మాధురి

తొలుత స్వప్న మాధురి

తొలుత శివ బాలాజీ వైఫ్ స్వప్న మాధురి బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టారు. ఆమె వచ్చిన సమయంలో శివ బాలాజీ ఫ్రీజ్ అయిపోయి ఉన్నారు. దాదాపు రెండు నెలల తర్వాత కలుసుకోవడంతో శివ బాలాజీ-మధు కాస్త ఎమోషనల్ అయ్యారు.

ఇంటి సభ్యులు కూడా

ఇంటి సభ్యులు కూడా

స్వప్న మాధురి ఇంట్లోకి ఎంటరై తన భర్తను కలిసిన తర్వాత వారి మధ్య క్రియేట్ అయిన ఎమోషన్ చూసి.... ఇతర ఇంటి సభ్యులైన అర్చన, హరితేజ, దీక్షా సేథ్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. కొంతసేపు బిగ్ బాస్ ఇంట్లో గడిపిన తర్వాత ఆమె బాస్ ఆదేశాల మేరకు ఇంటి నుండి బయటకు వెళ్లారు.

ఆదర్శ్ భార్య గుల్‌నార్ ఎంట్రీ

ఆదర్శ్ భార్య గుల్‌నార్ ఎంట్రీ

తర్వాత కొంత సేపటికి ఆదర్శ్ భార్య గుల్‌నార్ బిగ్ బాస్ ఇంట్లోకి ఎంటరయ్యారు. ఆ సమయంలో ఆదర్శ్ ఫ్రీజ్ అయి ఉన్నారు. ఇంటి సభ్యుల కోసం గుల్ నార్ పంజాబీ మిఠాయి తీసుకొచ్చింది.

ప్రేక్షకుల్లోనూ కట్టలుతెంచుకున్న భావోద్వేగం

ప్రేక్షకుల్లోనూ కట్టలుతెంచుకున్న భావోద్వేగం

అయితే భార్యతో కనీసం ఐదు నిమిషాలు కూడా గడిపే అవకాశం లేకుండానే ఆమెను బిగ్ బాస్ బయటకు పంపడంతో ఆదర్శ్ తో పాటు ఇంటి సభ్యుల్లో భావోద్వేగం కట్టలు తెచ్చుకుంది. షో చూస్తున్న ప్రేక్షకుల్లోనూ కొంత బాధ కనిపించింది.

సర్ ప్రైజ్ చేసిన బిగ్ బాస్

సర్ ప్రైజ్ చేసిన బిగ్ బాస్

తర్వాత ఆదర్శ్‌ను కన్‌ఫెషన్ రూమ్‌ కు పిలిచి.... తన భార్య, కుమారుడిని కలిసే అవకాశం కల్పించి సర్ ప్రైజ్ చేశారు బిగ్ బాస్. తర్వాత ముగ్గురూ కలిసి బిగ్ బాస్ ఇంట్లో గడిపారు. తన కొడుకుతో ఆడుకుంటూ ఆదర్శ్ మురిసిపోయాడు.

అర్చన ఎమోషనల్

అర్చన ఎమోషనల్

అటు స్వప్న మాధురి వచ్చిన సమయంలోనూ, ఇటు గుల్ నార్ వచ్చిన సమయంలోనూ..... అర్చన బాగా ఎమోషనల్ అయ్యారు. బహుషా ఆమెకు కూడా తన కుటుంబం గుర్తొచ్చి ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

బెస్ట్ మూమెంట్స్

బెస్ట్ మూమెంట్స్

బిగ్ బాస్ షో ప్రారంభం అయినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని ఎపిసోడ్లలో ఇదే ది బెస్ట్ ఎపిసోడ్ అని.... ఈ షోలో ది బెస్ట్ మూమెంట్స్ చూశామని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. ఇంటి సభ్యులకు కూడా ఇది మరిచిపోలేని ఎపిసోడ్.

English summary
Bigg Boss plays the freeze and unfreeze game with the contestants. Shiva gets emotional as his wife visits him. Later, a big surprise awaits Adarsh in the confession room. Adarsh gets emotional as his wife and son.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu