Bigg Boss Buzzz: సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న హరీష్.. పుంగి బజాయించినా శివాజీ

Bigg Boss Buzzz: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. ఎవరూ ఊహించిన ట్విస్టులు, టర్న్స్ తో దూసుకెళ్తుంది. ఇక నామినేషన్స్ , ఎలిమినేషన్స్ ప్రక్రియ అంటే.. మామూలుగా ఉండదు. భారీ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ షేక్ అయినట్లు.. హై క్యూరియసిటీతో హై టీఆర్పీ పక్కా.. ఇలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోన్న బిగ్ బాస్ షో నుంచి నాలుగో వారం ఎవరు ఊహించని విధంగా మాస్క్ మ్యాన్ హరీష్ ఎలిమినేట్ అయ్యారు. అనంతరం నటుడు శివాజీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ బజ్ షోలో పాల్గొన్నారు. బజ్ ఎపిసోడ్ మొదట్లో కాస్త ఫన్నీగా మొదలైన తర్వాత సీరియస్ గా మారింది. బజ్ ప్రోగామ్ ఇలా కూడా ఉంటుందా? అనేలా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

బిగ్ బాస్ బజ్ తాజా ఎపిసోడ్‌కి హోస్ట్‌గా నటుడు శివాజీ మళ్లీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. హౌస్‌లో చేసిన హంగామాలకీ, అవే మాటలకీ ఇప్పుడు బజ్‌లో బదులివ్వాల్సిందే అంటూ ఈ వారం ఎలిమినేట్ అయిన హరిత హరీష్‌‌ని స్టేజ్ మీద గట్టిగానే ప్రశ్నలు అడిగాడు. ప్రోమో మొదలులోనే మాస్క్‌ వేసుకుని హరీష్‌ని వెల్కమ్ చేసిన శివాజీ. 'నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు... కానీ మీ నోటి మాటలకే ఈ రెడ్ ఫ్లవర్స్" అంటూ కౌంటర్ వేస్తూ.. స్వాగతం పలికాడు శివాజీ. హరీష్ కూడా తగ్గేదేలే అన్నట్టుగా చేతిలో ఫ్లవర్స్ పట్టుకుని "మీరు రెడ్ ఫ్లవర్ అన్నారు కదా... కానీ రెడ్ అంటే నాకు వేరు పర్స్‌పెక్టివ్ ఉంటుంది" అని తనదైన రీతిలో రియాక్ట్ అయ్యాడు. దీంతో శివాజీ వెంటనే కౌంటర్‌గా "ఇదంతా డొల్లే అంటున్నారు ఆడియన్స్... అసలు ఇక్కడే మేటర్ ఏంటి?" అని నేరుగా ప్రశ్న విసిరాడు.

Bigg Boss Buzzz mask man Harish Faces Heated Questions from Host Shivaji After Elimination

రియల్ వర్సెస్ ఫేక్.. శివాజీ హీట్ పెంచిన డిబేట్
"నిజాయతీ మనిషి ఫేక్‌గా కాదు, ఫెయిర్‌గా ఉండాలి"అని శివాజీ ప్రశ్నించగా, "నేను నిజాయతీగా ఆడాను" అని హరీష్ మళ్లీ తన పాయింట్ రిపీట్ చేశాడు. దీంతో శివాజీ చిరాకు వ్యక్తం చేస్తూ, "ఎంతసేపు మీరు 'నేను, నేను' అంటారు సార్? బయట ప్రజలు ఈ డబ్బా ఏంటి అంటున్నారు!" అంటూ గట్టిగా వేసుకున్నారు. హరీష్‌ చమత్కారంగా "మన డబ్బా మనమే కొట్టుకోవాలి"అన్నాడు. దీంతో శివాజీ వెంటనే రియాక్ట్ అవుతూ.. "అది సినిమా డైలాగ్ సార్!" అంటూ పంచ్ వేసాడు. హరీష్ "అరచేతిలో నేను 6 అని రాస్తే, జనాలకు 9లానే కనిపిస్తుంది... కానీ నాకు అది 6 అని తెలుసు" అంటూ తన ఆలోచన చెప్పగా, శివాజీ "తెలుగు యువత మీకు బిరుదులు ఇచ్చారు సార్!" అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.

హరీష్ ఓవర్ కాన్ఫిడెన్స్?
ఇంతలో హరీష్ మళ్లీ తన మోడ్‌లోకి వెళ్ళి "భగత్ సింగ్ ఒక్కడే... సుభాష్ చంద్రబోస్ ఒక్కడే... నేనూ ఒక్కడినే!" అని చెప్పడంతో, శివాజీ ఆగిపోలేక "మీ కంపారిజన్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు సార్! హౌస్‌కి వెళ్లిన తర్వాత మీరు మంచి మనిషని అనుకున్నారు, కానీ, బయట పీకిపడేశారు!" అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు. దీనికి హరీష్ "మీరు నన్ను మాట్లాడనివ్వట్లేదు సార్!" అని మధ్యలోనే స్టాప్ అయ్యాడు. "తప్పుడు మనిషంటే ఎన్ని అర్థాలు తీసుకుంటారు?" అని శివాజీ ప్రశ్నించాడు. దీనికి హరీష్ "తప్పు చేసేవారిని తప్పుడు మనిషే అంటారు కదా సార్!" అని బదులిచ్చాడు. దానిపై శివాజీ "అతను అంటే తప్పేముంది?" అని కౌంటర్ వేసాడు. "నేను ఫేస్‌ టు ఫేస్ మాట్లాడతా... రైట్‌-రాంగ్ నాకు తెలుసు, రాంగ్ అయితే రియలైజ్ అవుతా!" అంటూ హరీష్ తన పాయింట్ క్లియర్ చేశాడు. ఈ సమయంలో హరీష్ కాస్త సీరియస్‌గా, శివాజీ మాత్రం సటైరిక్‌గా వ్యవహరించారు.

బిగ్‌బాస్ వొంగోబెట్టి పుంగి బజాయిస్తుందండి!
ప్రోమో చివర్లో మాత్రం శివాజీ తన స్టైల్లో "ఇప్పుడు అర్థమైందా మీకు... బిగ్‌బాస్ ఎంత తోపునైనా వొంగోబెట్టి పుంగి బజాయిస్తుందండి!" అంటూ దిమ్మతిరిగిపోయే డైలాగ్ వేశాడు. ఈ ఎపిసోడ్‌ ప్రోమో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై కామెంట్స్ వర్షం కురుస్తోంది. శివాజీ గట్టిగా అడిగాడు!, హరీష్ తాను మాట్లాడేటప్పుడు కూడా రియాక్షన్‌ చూస్తున్నాడు అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. "బిగ్‌బాస్ హౌస్‌లో ఫైర్... బజ్‌లో బ్లస్ట్!" అనేలా శివాజీ హోస్టింగ్ వేరే లెవెల్‌లో ఉంది.

More from Filmibeat

Read more about: bigg boss buzzz shivaji harish
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X