»   » తడఖా చూపిస్తున్న బిగ్‌బాస్ సెలబ్రిటీలు.. ఎన్టీఆర్‌ను మరిచిపోతున్నారట

తడఖా చూపిస్తున్న బిగ్‌బాస్ సెలబ్రిటీలు.. ఎన్టీఆర్‌ను మరిచిపోతున్నారట

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ రియాలిటీ షో రికార్డు రేటింగ్‌ను ఇచ్చింది. ఆ షోలో నటించిన ప్రతీ ఒక్కరికి మంచి పేరు తెచ్చిపెట్టింది. బిగ్‌బాస్ షోలో పాల్గొనడానికి ముందు సాదాసీదా నటులుగా పేరున్న వారికి సెలబ్రిటీ హోదా వచ్చింది. అయితే ప్రస్తుతం బిగ్‌బాస్ పార్టిసిపెంట్స్ అందరూ తమకు లభించిన క్రేజ్‌ను సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.

భారీగా డిమాండ్

భారీగా డిమాండ్

బిగ్‌బాస్ షో పూర్తయిన తర్వాత అందులో పాల్గొన్న సభ్యులకు మంచి డిమాండ్ ఏర్పడిందట. షాపుల ఓపెనింగ్, టీవీ షోలో ప్రత్యేక ఇంటర్వ్యూలకు సెలబ్రిటీలు భారీగా డిమాండ్ చేస్తున్నారట. వాళ్లు డిమాండ్ చేస్తున్న మొత్తం షాకిచ్చేలా ఉంది అనేది తాజా సమాచారం.

ఓ మోస్తారు నటీనటులే

ఓ మోస్తారు నటీనటులే

వాస్తవానికి బిగ్‌బాస్‌లో పాల్గొన్న వారిలో నవదీప్, శివబాలాజీ తప్ప మిగితా వారందరూ ఓ మార్కెట్లో డిమాండ్ లేనివారే. కానీ బిగ్‌బాస్ షో తర్వాత వారు ఇండస్ట్రీలో స్టార్లు అనే భ్రమలో బతుకుతున్నారు అన విమర్శ సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నది.

సినిమా ఆఫర్ల విషయంలోనూ అంతే

సినిమా ఆఫర్ల విషయంలోనూ అంతే

ఇక షాపుల ఓపెనింగ్ పక్కన పెడితే.. సినిమా ఆఫర్ల విషయంలోనూ వారి అదే విధంగా తడఖాగా చూపిస్తున్నారట. అయితే బిగ్‌బాస్ షో హిట్ వెనుక ప్రధాన కారణం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనే విషయాన్ని మర్చి పోతున్నారని సెలబ్రిటీలపై కొందరు గుర్రుగా ఉంటున్నారట. వారాంతంలో ఎన్టీఆర్ వచ్చి షోను ప్రజెంట్ చేసిన తీరే బిగ్‌బాస్‌ కార్యక్రమాన్ని ఎక్కడికో తీసుకెళ్లిందనే విషయాన్ని సదరు సెలబ్రిటీలు గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు.

బిగ్‌బాస్2కు మంచి క్రేజ్

బిగ్‌బాస్2కు మంచి క్రేజ్

సెలబ్రిటీలకు వస్తున్న ఆదరణ చూసి చాలా మంది బిగ్‌బాస్2 కార్యక్రమంపై భారీగా ఆశలు పెట్టుకొంటున్నట్టు సమాచారం. ఇప్పటికే పలువురిని బిగ్‌బాస్ నిర్వాహకులు సంప్రదించినట్టు వార్తలు వెలువడుతున్నాయి.

English summary
Report suggest that Bigg Boss contestant are demanding huge amount for shops opening. Some of them are asking big remunaration for movie offers too. In this occasion, These celebrities behaviour becomes talk of the industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu