»   » సూసైడ్ చేసుకోవాలకున్నా: బిగ్ బాస్ ఇంట్లో ఏడ్చేసిన సింగర్ మధుప్రియ!

సూసైడ్ చేసుకోవాలకున్నా: బిగ్ బాస్ ఇంట్లో ఏడ్చేసిన సింగర్ మధుప్రియ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగులో ప్రారంభం అయిన బిగ్గెస్ట్ రియాల్టీ షో 'బిగ్ బాస్' తొలిరోజు అంతా పరిచయ కార్యక్రమాలతోనే సాగిన సంగతి తెలిసిందే. రెండో రోజు నుండి బిగ్ బాస్ ఇంట్లో అసలైన గేమ్ మొదలైంది. బిగ్ బాస్ సూచనల మేరకు ఇంటి సభ్యులు నడుచుకోవడం ప్రారంభమైంది.

రెండో రోజు బిగ్ బాస్ ఇంటి సభ్యులకు 'మీ గురించి ఎవరూ ఎరుగనికథ' పేరుతో తొలి టాస్క్ ఇచ్చారు. ఇందులొ భాగంగా బిగ్ బాస్ ఇంట్లోని సభ్యులు తమ జీవితంలో పశ్చాత్తాప సందర్భాలు, మనల్ని మనం క్షమించుకోలేని సందర్భాల గురించి చెప్పాల్సి ఉంటుంది. సమీర్ నేతృత్వంలో ఈ టాస్క్ నిర్వహించారు.

ఆ బాధ ఇప్పటికీ ఉంది: సమీర్

ఆ బాధ ఇప్పటికీ ఉంది: సమీర్

నా సొంత ఊరు వైజాగ్, వైజాగ్ లో ఉన్నపుడు వెంకట్ అనే క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు. అతడు సముద్రంలో వెస్సెల్స్ లో పని చేసే వాడు. అనుకోకుండా పరదీప్ అనే ప్లేసులో జరిగిన యాక్సిడెంటులో తను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎంతగానో వెతికారు. బాడీ 4 రోజుల తర్వాత దొరికింది. నా స్నేహితుడి మరణం విని చాలా కృంగిపోయాను. అక్కడికి వెళ్లి మృతదేహాన్ని చూడలేదు. ఇప్పటికీ వాడు బ్రతికున్న ఫేసే నాకు గుర్తు. వెళ్లి చూడలేదనే బాధ ఇప్పటికీ ఉంది, అది నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అని సమీర్ తెలిపారు.

అపుడు నేను చాలా రాష్: ప్రిన్స్

అపుడు నేను చాలా రాష్: ప్రిన్స్

2011-2012 సమయంలో ఇండస్ట్రీకి వచ్చి ఒకటి రెండు సినిమాలు చేశాను. చాలా టైమ్ వేస్ట్ చేశాను. చాలా రెడిక్యులెస్ గా తిరిగాను. మాట్లాడటం కూడా సరిగా వచ్చేది కాదు. నా మాట తీరు చాలా డిఫరెంటుగా ఉండేది. నాలో ఒక రాష్ నెస్ ఉండేది. ఇపుడు మారాను. ఆ విషయంలో ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నాను. కానీ గడిచిన సమయం తిరిగిరాదు అనే బాధ ఉంది. ఆ టైమ్ ఎప్పుడు వస్తుందా? అని రోజూ పడుకునే ముందు ఆలోచిస్తుంటాను... ఈ విషయంలో నాకు ఇప్పటికీ బాధ ఉంది అని ప్రిన్స్ తెలిపారు.

Bigg Boss Telugu: NTR Warning To DhanRaj
ముమైత్ ఖాన్ మాట్లాడుతూ..

ముమైత్ ఖాన్ మాట్లాడుతూ..

చాలా చిన్న వయసులోనే పని చేయడం ప్రారంభించాను... అపుడు నాకు ఒకటే ఆలోచన ఉండేది, బాగా సంపాదించి అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలని మాత్రమే ఉండేది. ఈ క్రమంలో జీవితంలో చాలా కోల్పోయాను. ట్వంటీస్‌ను ఎంజాయ్ చేయలేక పోయాను. ముంబై వచ్చిన తర్వాత ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. తర్వాత ఇగో క్లాష్ వచ్చి విడిపోయాం. అయితే అతడితో కలిసున్న రెండున్నర సంవత్సరాల సమయంలో జరిగిన కొన్ని విషయాల్లో తర్వాత నేను రియలైజ్ అయ్యాను. ప్రతి ఒక్కరి జీవితంలో అలాంటివి ఉంటాయని ముమైత్ ఖాన్ తెలిపారు.

మధు ప్రియ మాట్లాడుతూ..

మధు ప్రియ మాట్లాడుతూ..

ఈ ప్రొఫెషన్ ఎందుకు ఎంచుకున్నాను, ఈ ప్రపంచం నన్ను ఎందుకు గుర్తు పట్టాలి, ఈ ప్రపంచం నన్ను అందరికంటే వేరుగా ఎందుకు చూడాలి అని అనుకుంటున్న విషయాలను ఒక్క మాటలో చెప్పింది మధు ప్రియ. మేము ముగ్గురం ఆడ పిల్లలం. ఆడ పిల్లలం అయినందుకు చాలా సమస్యలు ఫేస్ చేశాం. మా అమ్మ, నాన్న మా గురించి చాలా కష్టపడ్డారు. మధ్యలో కొన్ని సమస్యలు కూడా ఫేస్ చేశాను. ఆ విషయం అందరికీ తెలుసు(ప్రేమ వివాహం). అపుడు ఎంతో కృంగిపోయాను లైఫ్‌లో ఎంతో డిస్ట్రబ్ అయ్యాను. చాలా సార్లు సూసైడ్ చేసుకోవాలనుకున్నాను అంటూ మధు ప్రియ ఏడ్చేసింది. అలాంటి లైఫ్ నుండి వచ్చాను. ఆ టైమ్‌లో నా భర్త ఎంతో సపోర్టివ్‌గా ఉన్నారు. నేను ఏదైనా తప్పు చేసుంటే మా మమ్మీకి, మా డాడీకి, మా హస్పెండ్ కి సారీ చెప్పాలి అన్నారు.

English summary
Telangana singer Madhu Priya revealed personal life details in Bigg Boss episode 2. "Some days back I was in depression and even thought of committing suicide." Madhu Priya said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu