Just In
- 32 min ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 1 hr ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
- 1 hr ago
మీకు అలాంటి పరిస్థితి రావొద్దు.. వాటిని పూసగుచ్చినట్టు వివరించిన రకుల్
- 2 hrs ago
అది ముగిసింది ఇది దొరికింది.. చమ్మక్ చంద్ర లక్ ‘అదిరింది’
Don't Miss!
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- News
జై హింద్, జై బంగ్లా: జై శ్రీరాం నినాదాలపై దీదీ గరం గరం, మోడీ సమక్షంలోనే ఫైర్..
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వరుణ్ సందేశ్ భార్యకు షాక్.. బిగ్‌బాస్‌ను విసిగించిన బాబా భాస్కర్.. శ్రీముఖి, హిమజకు ముప్పు!
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో 9వ రోజు ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకొన్నాయి. ఇంటిలోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి ప్రవేశించారు. తమన్నాను ఇంటి సభ్యులు హృదయపూర్వకంగా స్వాగతించారు. ఆ తర్వాత ఈ వారం ఎలిమినేట్ అయ్యే నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా బిగ్‌బాస్‌కు కొందరు చేదు అనుభవాన్ని పంచారు. వివరాల్లోకి వెళితే..

తమన్నా క్లారిటీతో
ఇంట్లోకి ప్రవేశించిన తమన్నా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం ప్రారంభించింది. మహేష్, వరుణ్ సందేశ్ దంపతుల మధ్య జరిగిన గొడవ తన అభిప్రాయాన్ని క్లియర్‌గా చెప్పింది. మహేష్‌ను చీప్ అని వరుణ్ అనడాన్ని తప్పుపట్టింది. తప్పులేకపోయినా సారీ చెప్పడం ఎందుకని మహేష్‌ను నిలదీసింది. ఇంకా జాఫర్, శ్రీముఖి ఇతర సభ్యులతో చనువుగా ఉండటం కనిపించింది.

నామినేషన్ ప్రక్రియలో వితిక షేరుకు షాక్
ఇక ప్రస్తుత వారం కోసం నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టి నిబంధనలు బిగ్‌బాస్ వెల్లడించారు. నామినేషన్ ప్రక్రియ గురించి ఎవరూ చర్చించకూడదని క్లియర్ చేశాడు. వరుణ్ సందేశ్ కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లి వచ్చిన తర్వాత ఆయన భార్య చెవిలో గుసగుసలు పెట్టుకోవడంపై బిగ్‌బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఇతరులను నామినేట్ చేయడానికి వీలులేదని ఆదేశించారు. దాంతో వరుణ్ సందేశ్ దంపతులకు షాక్ తగిలింది.

బాబా భాస్కర్ వింతగా
ఇక నామినేషన్ ప్రక్రియలో బాబా భాస్కర్ వింతగా ప్రవర్తించారు. బిగ్‌బాస్‌ను చాలా సేపు ఇరిటేట్ చేశాడు. బాబాకు మూడుసార్లు అవకాశం ఇచ్చి ఇద్దరి పేర్లను నామినేట్ చేయమని.. చెప్పగా.. అందుకు నిరాకరించారు. కానీ తప్పనిసరిగా చెప్పాల్సిందేనని బిగ్‌బాస్ ఆర్డర్ పాస్ చేశాడు. అయినా తాను ఎవరి పేర్లు చెప్పలేనని బాబా భాస్కర్ మొండికేశాడు.

బాస్‌ను విసిగించిన బాబా భాస్కర్
దాంతో బాబా భాస్కర్‌కు బిగ్‌బాస్ అల్టిమేటం జారీ చేశాడు. నీవు ఇద్దరు సభ్యులను నామినేట్ చేయకపోతే నామినేషన్ ప్రక్రియ రద్దు చేస్తాం. ఆ స్థానంలో ప్రతీ ఇంటి సభ్యుడు నామినేట్ అవుతాడని బిగ్‌బాస్ తన తీర్పును ప్రకటించారు. రెండు నిమిషాల సమయాన్ని ఇచ్చి బాబా భాస్కర్‌ను తేల్చుకోమని సూచించారు. దాంతో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో వితిక, రాహుల్‌ను నామినేట్ చేశాడు.

శ్రీముఖి, హిమజకు ఎలిమినేషన్ ముప్పుగా
ప్రస్తుత వారానికి శ్రీముఖి, హిమజ 5 ఓట్లతో నామినేట్ కాగా, రాహుల్, మహేష్, వితిక, వరుణ్ సందేశ్, పునర్నవి తదితరులు నామినేట్ అయ్యారు. ఇలా పలువురు సభ్యుల నామినేషన్ ప్రక్రియతో బిగ్‌బాస్ ఇంటిలో హల్‌చల్ జరిగింది. మొదటి రోజే తమన్నా చాలా స్ట్రాంగ్‌గా కనిపించింది. తన అస్థిత్వాన్ని బలంగా చూపిస్తూ ప్రేక్షకులకు సంకేతాలను పంపారు.