»   » జస్లీన్, నేహా పోల్ డ్యాన్స్ కేక.. ఇంటి నుంచి జలోటా అవుట్.. సల్మాన్ ఖాన్ షోలో హైడ్రామా!

జస్లీన్, నేహా పోల్ డ్యాన్స్ కేక.. ఇంటి నుంచి జలోటా అవుట్.. సల్మాన్ ఖాన్ షోలో హైడ్రామా!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బిగ్‌బాస్ హిందీ 12వ సీజన్‌లో ఆదివారం హైడ్రామా చోటుచేసుకొన్నది. భజన్ కింగ్ అనూప్ జలోటా ప్రియురాలు జస్లీన్ మాతురు ఇంటి నుంచి బయటకు వెళ్లడం గేమ్‌లో ఆసక్తికరంగా మారింది. అలాగే క్రికెటర్ శ్రీశాంత్ ఉద్వేగానికి గురికావడం మరో హైలెట్‌‌గా మారింది. అలాగే కమెడియన్, యాంకర్ భారతీ సింగ్ ఇంట్లోకి ప్రవేశించి రచ్చ రచ్చ చేసింది. ఇంకా ఏం జరిగిందంటే..

   ఇంట్లోకి భారతీ సింగ్

  ఇంట్లోకి భారతీ సింగ్

  హోస్ట్ సల్మాన్ ఖాన్ తనదైన శైలిలో ఎంట్రీ ఇచ్చాడు. సుల్తాన్ చిత్రంలోని జగ్ గూమేయా అనే పాటపై డ్యాన్స్ చేసి అలరించాడు. అనంతరం ఇండియాస్ గాట్ టాలెంట్ యాంకర్ భారతీ సింగ్ ఇంట్లోకి వచ్చి సల్మాన్‌కు షాక్ ఇచ్చింది. చాలా మంది పిల్లలను తీసుకొచ్చి వీరంతా మన పిల్లలు అని చూపించింది. ఇతను మీ నాన్న అంటూ చెప్పింది. దాంతో సల్మాన్ సరదగా వారిని ఆటపట్టించారు.

  జస్లీన్ పక్కన నిలుచుంటే

  జస్లీన్ పక్కన నిలుచుంటే

  అనూప్ జలోటా ప్రియురాలు జస్లీన్‌పై భారతీ సింగ్ కామెంట్స్ చేసింది. జస్లీన్ పక్కన నిలచుంటే సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరా పక్కన నిలుచున్నట్టు అనిపిస్తుంది అంటూ ఆమె హైట్‌పై కామెంట్ విసిరింది. ఇండియాస్ గాట్ టాలెంట్ హోస్ట్‌గా ఇంట్లో ప్రవేశించిన భారతీ సింగ్‌కు అనూప్ జలోటా తనదైన శైలిలో ఝలక్ ఇచ్చాడు.

  పెళ్లికాకుండా ఉంటే జోడిగా

  పెళ్లికాకుండా ఉంటే జోడిగా

  తనదైన శైలిలో భారతీ సింగ్‌కు గాలం వేసేందుకు జలోటా ప్రయత్నించారు. ఆమె కోసం చౌద్వీ కా చాంద్ పాటను పాడి ఆకట్టుకొన్నారు. జలోటాకు కూడా భారతీ సింగ్ కూడా షాకిచ్చింది. ఒకవేళ నీకు పెళ్లి కాకుండా ఉండి ఉంటే.. జస్లీన్ ప్లేస్‌లో జోడిగా బిగ్‌బాస్‌లోకి వచ్చే దానిని అంటూ భారతీ సింగ్ తెలిపారు. అలా సరదాగా హాస్యంతో గేమ్ కొనసాగింది.

  జస్లీన్, నేహా పోల్ డ్యాన్స్

  ఇక్ బిగ్‌బాస్ షోలో పోల్ డ్యాన్స్ ఆకట్టుకొన్నది. నేహా పాండే, జస్లీన్ చేసిన పోల్ డ్యాన్స్ కేక పెట్టించింది. అనూప్ జలోటాను పోల్‌గా నిలబెట్టి జస్లీన్‌తో డ్యాన్స్ చేయించగా ఆయన కదలకుండా నిగ్రహం పాటించడం గమనార్హం. నేహా, జస్లీన్ వేసిన శృంగార నృత్యాలు ఇంటి సభ్యులను ఉర్రూతలించాయి.

  ఇంట్లో నుంచి జలోటా బయటకు

  ఇంట్లో నుంచి జలోటా బయటకు

  అలా షో కొనసాగుతుండగా.. అనూప్ జలోటాను తక్కువ ఓట్లు వచ్చాయని బయటకు పంపారు. కానీ అనంతరం ఆడియెన్స్‌కు సల్మాన్ ఖాన్ చెబుతూ.. సీక్రెట్ గేమ్‌లో భాగంగా జలోటాను ప్రత్యేకమైన గదిలో పెడుతున్నాం. ఆయన అవుట్ కాలేదు అని చెప్పాడు.

   జస్లీన్ మాతురు దొంగ ఏడుపు

  జస్లీన్ మాతురు దొంగ ఏడుపు

  జలోటా అవుట్ కావడంతో బాధపడినట్టు నటించిన జస్లీన్ తీరును చూసి సల్మాన్ ఖాన్ షాక్ అయ్యాడు. ఇంటి నుంచి బయటకు పంపించేందుకు జస్లీన్ పడిన ఆరాటం అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ తర్వాత తన క్లోజ్ అయిన శివాశీష్‌తో నవ్వుతూ రొమాంటిక్‌గా ఉండటంతో జలోటాపై చూపించిన బాధ ఉత్తిదే అని తేలిపోయింది. అయితే ఇంటిలోని ఓ గదిలో ఉండి జస్లీన్ తీరును చూసి జలోటా షాక్‌కు గురయ్యాడు.

  English summary
  Salman began the episode with a melodious rendition of his popular song Jag Ghoomeya. Bharti greeted Anup and said had she not married, she would have come with him in the show, in place of Jasleen.Bharti then calls upon Neha to perform a pole dance and she leaves everyone impressed with her seductive moves.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more