»   » కిరాక్ పార్టీ.. బిగ్‌బాస్ హౌస్ మేట్స్ హంగామా.. మస్తుగా ఎంజాయ్ చేస్తూ..

కిరాక్ పార్టీ.. బిగ్‌బాస్ హౌస్ మేట్స్ హంగామా.. మస్తుగా ఎంజాయ్ చేస్తూ..

Posted By:
Subscribe to Filmibeat Telugu
Bigg Boss Telugu : House mates reunioned after elimination

తెలుగు బిగ్‌బాస్ కార్యక్రమం కొందరు సెలబ్రిటీల జీవితాలను మార్చేసింది. బిగ్‌బాస్‌లో పాల్గొన్న నటులు, యాంకర్లకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన రావడంతో స్టార్ మా టెలివిజన్ రేటింగ్ కూడా రికార్డు స్థాయిలో దూసుకుపోయింది. అలాంటి కార్యక్రమంలో పాల్గొని ఎలిమినేట్ అయిన సెలబ్రిటీలు యాంకర్ కత్తి కార్తీక, సినీ నటులు ప్రిన్స్, ధన్‌రాజ్, జ్యోతి, సమీర్‌లు కలుసుకొన్నారు. ఆ గెట్ టుగెదర్ కు సంబంధించిన ఫొటోలను కత్తి కారీక ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు.

 కత్తి కార్తీక పోస్ట్

కత్తి కార్తీక పోస్ట్

బిగ్‌బాస్ హౌస్ మేట్స్ అందరం కలుసుకొన్నాం. మస్తుగా ఎంజాయ్ చేశాం. మంచి విందును ఆరగించాం. పోట్లాడుకొన్నాం. బిగ్‌బాస్ విషయాలపై వాదులాడుకొన్నాం అని కత్తి కార్తీక పోస్ట్ చేసింది. బిగ్ బాస్ ఇంటి సభ్యులతో దిగిన సెల్ఫీలను ఫేస్‌బుక్‌లో పెట్టింది.

ఫస్ట్ ఎలిమినేషన్ జ్యోతి

ఫస్ట్ ఎలిమినేషన్ జ్యోతి

బిగ్‌బాస్ తెలుగు కార్యక్రమంలో పాల్గొన్నవారిలో మొట్టమొదటిగా ఎలిమినేట్ అయిన వారిలో సినీ తార జ్యోతి ఒకరు. ఇంటి వాతావరణానికి అలవాటు కాకముందే ఆమెను ప్రేక్షకులు ఎలిమినేట్ చేసిన సంగతి తెలిసిందే. జ్యోతి ఉన్నది కొద్ది రోజులైనా ఆమె తన పరిధి మేరకు ఆకట్టుకొన్నారు.

తొందర్లోనే సమీర్..

తొందర్లోనే సమీర్..

ఆ తర్వాత బిగ్‌బాస్ నుంచి అవుట్ అయిన వారిలో సమీర్ ఒకరు. సమీర్ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో తొందర్లోనే వెను తిరుగాల్సి వచ్చింది. సభ్యులతో సరిగా వ్యవహరించలేదన్న ఆరోపణలు కూడా రావడం గమనార్హం.

ఆనందోత్సావాల మధ్య ధన్‌రాజ్

ఆనందోత్సావాల మధ్య ధన్‌రాజ్


బిగ్‌బాస్‌లో తనదైన శైలిలో రాణిస్తూ కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తున్న క్రమంలోనే ధన్‌రాజ్, కార్తీక హౌస్ నుంచి వెనుదిరిగారు. బిగ్‌బాస్ హౌస్ నుంచి కాలు బయటపెట్టగానే ధన్‌రాజ్ తియ్యటి కబురు అందింది. తన భార్య పండంటి బిడ్డకు జన్మనిచ్చిందనే వార్తను ఎన్టీఆర్ మాటల ద్వారా ధన్‌రాజ్ అందుకోవడం గమనార్హం.

ప్రిన్స్ షాకిచ్చిన ప్రేక్షకులు

ప్రిన్స్ షాకిచ్చిన ప్రేక్షకులు

బిగ్‌బాస్ హౌస్‌లో హాట్ ఫేవరేట్ అనుకొన్న హీరో ప్రిన్స్‌కు ప్రేక్షకులు షాక్ ఇచ్చారు. టైటిల్ ఎగురేసుకుపోతాడనుకున్న ప్రిన్స్ ఫైనల్ చేరకుండానే బిగ్‌బాస్ హౌస్ నుంచి ఇంటికి తిరుగుముఖం పట్టారు. అలా హౌస్ నుంచి వచ్చిన వారంతా ఒక్క దగ్గర చేరి పండుగ జరుపుకొన్నారు. ఈ బ్యాచ్‌లో మహేశ్ కత్తి లేకపోవడం గమనార్హం.

English summary
Bigg Boss House mates reunioned after elimination process. Participants Katti Karthika, Sameer, Jyothy, Dhanraj, Prince are gathered and celebrated event. In this event some other friends also appeared.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu