For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Non Stop: బిందు కోసం ట్రై చేశానన్న అఖిల్.. ఆమెను ప్రేమిస్తున్నానంటూ నోరు జారడంతో!

  |

  మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. డిజైరబుల్ మ్యాన్‌గా ఎంపికై అందరి దృష్టినీ ఆకర్షించాడు బిగ్ బాస్ ఫేం అఖిల్ సార్థక్. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాల్లో నటించాడు. కానీ, అతడికి సరైన గుర్తింపు మాత్రం దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ షోలో ఛాన్స్ దక్కించుకుని నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అందులో చివరి మెట్టుపై బోల్తా పడినా ఫాలోయింగ్‌ను భారీగా సంపాదించుకున్నాడు. ఇక, అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో అఖిల్ తన ప్రేమ గురించి బయట పెట్టాడు. అసలేం జరిగింది? ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

  బిగ్ బాస్‌లో ఆమెతో లవ్ ట్రాక్

  బిగ్ బాస్‌లో ఆమెతో లవ్ ట్రాక్

  బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్‌తో కలిసి లవ్ ట్రాకును నడిపించిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటూ.. కలిసే ఆడుతూ లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు హైలైట్ అయ్యారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షోలో తరచూ రొమాన్స్ చేయడంతో పాటు ముద్దులు, హగ్గులతో రెచ్చిపోవడంతో జంటగా ఫేమస్ అయ్యారు.

  Samantha: మరోసారి సమంత అందాల ఆరబోత.. వాళ్ల కోసం దిగిన పిక్‌లో దారుణంగా!

  బయట కూడా రచ్చ చేశారుగా

  బయట కూడా రచ్చ చేశారుగా

  నాలుగో సీజన్‌లో జంటగా తెగ సందడి చేసిన మోనాల్ గజ్జర్, అఖిల్ సార్థక్.. బయటకు వచ్చిన తర్వాత కూడా అలాగే కనిపించారు. కలిసి పార్టీలు చేసుకోవడం.. పబ్‌లకు వెళ్లడం.. ఒకరి ఇంటికి ఒకరు వెళ్లడం.. ఒకరి గురించి మరొకరు పోస్టులు చేసుకోవడం వంటి వాటితో తరచూ వార్తల్లో నిలిచేవారు. దీంతో వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి.

  బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో ఎంట్రీ

  బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో ఎంట్రీ

  భారీ అంచనాల నడుమ ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ గత వారంలో అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. ఇందులోకి మొత్తం 17 మంది సభ్యులు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో అఖిల్ సార్థక్ కూడా ఉన్నాడు. గతంలో తృటిలో టైటిల్‌ను మిస్ చేసుకున్న అతడు.. ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో కనిపిస్తున్నాడు.

  బట్టలున్నా లేనట్లే షాకిచ్చిన శృతి హాసన్: ప్రైవేట్ భాగాలు మొత్తం కనిపించేలా ఘోరంగా!

  ఆమెతో అఖిల్‌కు గట్టి పోటీనే

  ఆమెతో అఖిల్‌కు గట్టి పోటీనే

  ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ ఎంతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఇందులోకి మొత్తం 17 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే అఖిల్ సార్థక్ తర్వాత తెలుగు హీరోయిన్ బిందు మాధవి కూడా టైటిల్ ఫేవరెట్‌గానే బరిలోకి దిగింది. ఈమె నుంచే అఖిల్‌కు గట్టి పోటీ ఉంటోంది.

  అఖిల్, బిందు మధ్య ఫైటింగ్

  అఖిల్, బిందు మధ్య ఫైటింగ్

  గత వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్కు మొత్తం గొడవలతో సాగిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా యాంకర్ శివను సపోర్ట్ చేయడానికి బిందు మాధవి.. అతడిని ఓడించడానికి అఖిల్ సార్థక్ ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అప్పుడు బిందు.. ఫ్రెండ్ లేకుంటే బతకలేవు.. నువ్వు ఏ గేమ్ ఆడా అంటూ మాటలు అనడంతో అఖిల్ ఏడ్చాడు.

  అందాల ఆరబోతతో షాకిచ్చిన ఈషా రెబ్బా: తెలుగు పిల్లను ఇలా చూస్తూ తట్టుకోలేరు!

  బిందుపై రొమాంటిక్ కామెంట్

  బిందుపై రొమాంటిక్ కామెంట్

  బుధవారం జరిగిన ఎపిసోడ్‌లో అషు రెడ్డితో మాట్లాడుతూ.. 'లవ్‌లో ఉండడం అనేది చాలా మంచి ఫీలింగ్' అని అఖిల్ అన్నాడు. దీనికామె 'తొక్కేం కాదు.. అది వేస్ట్. ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైనా చిరాకు పుడితే దూరమవుతారు' అంది. దీనికి 'ఏది నాకు, బిందుకు జరిగినట్లా. క్లోజ్ అవడానికి చాలా ట్రై చేశా. అయినా వర్కౌట్ కాలేదు' అని అన్నాడు.

  ప్రేమిస్తున్నానని ఒప్పుకుంటూ

  ప్రేమిస్తున్నానని ఒప్పుకుంటూ

  బిందు గురించి అఖిల్ మాట్లాడగానే అషు 'నువ్వు ఆమెను ఇష్టపడుతున్నావా' అని సూటిగా ప్రశ్నించింది. దీనికతడు 'లేదు లేదు. నేను ఆల్రెడీ ఒకరిని లైక్ చేస్తున్నా. అది ఎవరో నీక్కూడా తెలుసు' అంటూ మోనాల్ గురించి పరోక్షంగా వెల్లడించాడు. దీంతో అషు రెడ్డి ముఖం మాడ్చేసింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుత సీజన్‌లో అఖిల్.. అషు క్లోజ్‌గా ఉంటోన్న విషయం తెలిసిందే.

  English summary
  Bigg Boss Telugu Unit Now Started Non Stop OTT First Season. Akhil Sarthak Comments on Bindu and Reveal His Love In Recent Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X