For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Non Stop: షోలోకి హీరోయిన్.. ఓటింగ్ లీక్ చేసిన నాగార్జున.. వీడియో చూపించి పరువు తీశాడుగా!

  |

  ఒకటి కాదు.. రెండు కాదు.. ఐదేళ్లుగా తెలుగు బుల్లితెరపై హవాను చూపిస్తూ నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. గతంలో ఎన్నడూ చూడని టాస్కులు ఇచ్చి.. ప్రేక్షకుల మద్దతును దక్కించుకున్న వాళ్లను విజేతగా ప్రకటించడమే ఈ షో నేపథ్యం. కొత్త కాన్సెప్టే అయినా తెలుగు ప్రేక్షకులు దీనికి త్వరగానే అలవాటు పడ్డారు. దీంతో భారీ రెస్పాన్స్ అందిస్తూ ఈ షోను ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంచారు. ఈ ఉత్సాహంతోనే నిర్వహకులు ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్‌ను ప్రారంభించారు. ఇక, ఆదివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో నాగార్జున గత వారం జరిగిన ఓటింగ్‌ను బయటపెట్టాడు. అలాగే, ఓ వీడియో చూపించాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

   రోజంతా మజాను పంచేందుకు

  రోజంతా మజాను పంచేందుకు

  బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ ఎన్నో అంచనాలతో ఫిబ్రవరి నెలలో ప్రారంభం అయింది. దీన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు స్ట్రీమింగ్ చేస్తున్నారు. అలాగే, ఒక గంటసేపు ఉన్న ఎపిసోడ్‌ను కూడా అందులో వదులుతున్నారు. వీటికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఆరంభంలోనే ఇది రసవత్తరంగా మారి మజాను అందిస్తోంది.

  Bigg Boss Non Stop: షోలో అసభ్యకరమైన సీన్.. పూల్‌లో వాళ్లిద్దరి సరసాలు.. బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి

   17 మందిలో ఇద్దరు బయటకు

  17 మందిలో ఇద్దరు బయటకు


  బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లోకి అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, సరయు రాయ్, బిందు మాధవి, హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్‌లు ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఫస్ట్ వీక్ ముమైత్, రెండో వారం శ్రీ రాపాక ఎలిమినేట్ అయ్యారు.

   మూడో వారం మరింత వినోదం

  మూడో వారం మరింత వినోదం

  ఓటీటీ మొదటి సీజన్‌ ఆరంభం నుంచే రసవత్తరంగా సాగుతోంది. దీన్ని ప్రతివారం సరికొత్త టాస్కులతో మరింత రంజుగా మార్చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వారం ఏకంగా 12 మందిని నామినేట్ చేశారు. అలాగే, ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ల కోసం 'అంతా మీ ఇష్టం' అనే టాస్క్‌ను ఇచ్చారు. అలాగే, యాంకర్ శివ, ఆరియానాకు సీక్రెట్‌ టాస్కును ఇచ్చి రచ్చ చేశారు.

  ఘోరమైన సెల్ఫీ షేర్ చేసిన చరణ్ హీరోయిన్: షర్ట్ విప్పేసి.. లోదుస్తులు కూడా లేకుండా!

   ఆదివారం ఫన్నీగా.. హీరోయిన్

  ఆదివారం ఫన్నీగా.. హీరోయిన్


  బిగ్ బాస్ షోలో ఆదివారం వచ్చే ఎపిసోడ్‌లో ఎలిమినేషన్ ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే, అంతకంటే ముందే కంటెస్టెంట్లు అందరితో హోస్ట్ నాగార్జున పలు రకాల ఆటలు ఆడిస్తుంటాడు. దీంతో సండే ఎపిసోడ్‌ ఫన్‌‌డేగా మారిపోతుంది. ఇక, తాజా ఎపిసోడ్‌లో హీరోయిన్ శ్రద్దా దాస్ తనదైన శైలి డ్యాన్సులతో అలరించింది. నాగార్జున కూడా కాళ్లు కదిపేశాడు.

  ఓటింగ్ రిజల్ట్ లీక్ చేసిన నాగ్

  ఓటింగ్ రిజల్ట్ లీక్ చేసిన నాగ్

  గత వారంలో యాంకర్ శివకు టాస్కు ఇచ్చిన బిగ్ బాస్.. హౌస్‌లో ఓటింగ్ నిర్వహించాడు. అందులో కంటెస్టెంట్లు అందరూ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఇచ్చిన ప్రశ్నలకు శివ ఇచ్చిన ఆన్సర్‌నే ఫైనల్ చేశాడు. దీన్ని శుక్రవారం ఎపిసోడ్‌లోనే రివీల్ చేశారు. ఇక, ఆదివారం జరగనున్న ఎపిసోడ్‌లో నాగార్జున అసలు ఓటింగ్‌ను బయట పెట్టినట్లు ప్రోమోలో చూపించారు.

  శృతి మించిన జాన్వీ కపూర్ హాట్ ట్రీట్: ఎద అందాలు పూర్తిగా కనిపించేంత ఘోరంగా!

  మందుబాబులు.. డ్యాన్సులు


  ఆదివారం జరిగే ఎపిసోడ్ ఆటపాటలతో ఎంతో ఫన్నీగా సాగినట్లు చూపించారు. మరీ ముఖ్యంగా ఇందులో మందుబాబులు అనే టాస్కు రాగా.. ఆర్జే చైతూ, యాంకర్ శివ తాగుబోతుల్లా నటించారు. ఆ తర్వాత సెన్స్‌తో కూడిన డ్యాన్స్ వేయాలని నాగార్జున చెప్పగా.. అషు తనకు సెన్స్ లేదన్నట్లు మాట్లాడి ఫన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఆమెతో పాటు హమీదా హాట్ డ్యాన్స్ చేశారు.

   వీడియో చూపించి మరీ రచ్చ

  వీడియో చూపించి మరీ రచ్చ

  గత వారం సరయు రాయ్‌తో ఆరియానా గ్లోరి గొడవ పడిన విషయం తెలిసిందే. దానిపై వీళ్లిద్దరినీ నాగార్జున ప్రశ్నించాడు. అప్పుడు ఆరియానా అసలు అక్కడ ఏమీ జరగలేదు అన్నట్లుగా మాట్లాడింది. దీంతో ఇంట్లోని సభ్యులకు అప్పుడు జరిగిన వీడియోను కూడా చూపించాడు. ఇందులో ఆరియానా తప్పు చేసినట్లు కనిపించింది. దీంతో ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది.

  English summary
  Bigg Boss Telugu Non Stop OTT First Season Running Successfully. Nagarjuna Fire on Bindu Madhavi and Anchor Shiva in Sunday Episode
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X