For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Nominations: మళ్లీ F బూతు రచ్చ.. వెంట్రుక చూపిస్తూ.. బిందుతో పాటు పది మందికి బిగ్ షాక్

  |

  ఎన్నో అనుమానాల నడుమ తెలుగు బుల్లితెరపైకి ప్రవేశించినా.. అనూహ్యంగా అందరి ఆదరాభిమానాలను సొంతం చేసుకుని నెంబర్ వన్ షోగా ఎదిగిపోయింది బిగ్ బాస్. కొత్త కాన్సెప్టుతో ప్రసారం అయ్యేదే అయినా దీనికి ప్రేక్షకులు భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందించారు. ఫలితంగా ఇది భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుంటూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ జోష్‌లోనే ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను ప్రారంభించారు. ఇది కూడా ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఫలితంగా ప్రేక్షకులకు వినోదాన్ని భారీగా అందిస్తోంది. ఇక, ఆరో వారానికి సంబంధించిన నామినేషన్స్‌ ప్రక్రియ ఎలా జరిగింది? ఎవరు నామినేట్ అయ్యారు? అనేవి చూద్దాం పదండి!

  నాన్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్

  నాన్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్

  తెలుగులో బిగ్ బాస్ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఇప్పుడు ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌పై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇది మొదటి నుంచే ఆసక్తికరంగా నడుస్తోంది. మరీ ముఖ్యంగా డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు, బోల్డు బ్యూటీల రచ్చ, గొడవలతో రచ్చగా నడుస్తోంది. ఫలితంగా నాన్ స్టాప్‌గా వినోదాన్ని కూడా పంచుతోంది.

  Sonam Kapoor: గర్భంతో స్టార్ హీరోయిన్ హాట్ ఫోజులు.. బ్లౌజ్ కూడా లేకుండా కనిపించడంతో!

  5 వారాల్లో.. ఐదుగురు వెళ్లారు

  5 వారాల్లో.. ఐదుగురు వెళ్లారు

  తాజా సీజన్‌లోకి అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, సరయు రాయ్, బిందు మాధవి, హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్‌లు ఎంట్రీ ఇచ్చారు. వీళ్లలో నుంచి ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీలు బయటకు వెళ్లారు.

  మంటల్లో వేసి నామినేషన్స్

  మంటల్లో వేసి నామినేషన్స్

  బిగ్ బాస్‌లో నామినేషన్స్ టాస్క్ ఎంతో రచ్చగా సాగుతోంది. ఈ వారం కూడా అదే రీతిలో నడిచింది. ఆరో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియలో ఒక కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేయాలి. అందుకు గానూ ఆ ఇద్దరి ఫొటోలను గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన మంటల్లో తగలబెట్టాల్సి ఉంటుంది. అంతేకాదు, అందుకు తగిన కారణాలను కూడా చెప్పాల్సి ఉంటుంది.

  బిగ్ బాస్ దివి అందాల ఆరబోత: టాప్‌ను కిందకు జరిపి.. అక్కడి టాటూను చూపిస్తూ!

  వాళ్ల మధ్య బూతు గొడవతో

  వాళ్ల మధ్య బూతు గొడవతో

  ఆరో వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా ఎప్పటి లాగే పెద్ద గొడవలతో సాగింది. మరీ ముఖ్యంగా అజయ్, హమీదా మధ్య FUCK పదం గురించి పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడిచింది. తనపై అనవసరంగా నిందలు వేసిందని అజయ్ ఆమెను నామినేట్ చేశాడు. దీనికామె అక్కడ నేను విన్నదే చెప్పానని వాదించింది. ఇది చాలా సేపు జరిగింది. కానీ, ఎవరూ తగ్గకుండా మాట్లాడారు.

  వెంట్రుక కూడా పీకలేవులే

  వెంట్రుక కూడా పీకలేవులే

  నామినేషన్స్‌లో ఉంటే గొడవలు పెట్టుకునే నటరాజ్ మాస్టర్.. మరోసారి రెచ్చిపోయాడు. తనను నామినేట్ చేసిన అనిల్‌పై విరుచుకుపడ్డాడు. దీంతో అతడు కూడా ఏమాత్రం తగ్గలేదు. అంతేకాదు, 'నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవు' అన్నట్లుగా సైగలు చేశాడు. ఆ తర్వాత బిందు, స్రవంతిపైనా నటరాజ్ నోటికొచ్చినట్లు మాట్లాడాడు. చివర్లో అఖిల్, బిందుకు వాదన జరిగింది.

  శృంగార వీడియోలు షేర్ చేసిన రాంగోపాల్ వర్మ: వామ్మో ఇద్దరు హీరోయిన్లతో దారుణంగా!

  ఎవరు ఎవరిని చేశారంటే

  ఎవరు ఎవరిని చేశారంటే

  ఈ టాస్కులో అరియానా - మిత్రా, బిందును.. అజయ్ - మహేష్, హమీదాను.. అషు - మిత్రా, హమీదాను.. అనీల్ - నటరాజ్, మిత్రాను.. స్రవంతి - మిత్రా, నటరాజ్‌ను.. మహేష్ - ముమైత్, మిత్రాను.. హమీదా - అషు, అజయ్‌ను.. నటరాజ్ - స్రవంతి, బిందును.. శివ - అషు, మిత్రాను.. ముమైత్ - మహేష్, మిత్రాను.. మిత్రా - మహేష్, శివను.. బిందు - నటరాజ్, అషును.. అఖిల్ - బిందు, మిత్రాను నామినేట్ చేశారు.

  మొత్తంగా పది మందికి షాక్

  మొత్తంగా పది మందికి షాక్

  ఆరో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ టాస్కులో మొత్తంగా పది మంది నామినేట్ అయినట్లు బిగ్ బాస్ వెల్లడించాడు. అందులో మిత్ర శర్మ, నటరాజ్, మహేష్ విట్టా, అషు రెడ్డి, హమీదా, బిందు మాధవి, యాంకర్ శివ, అజయ్, స్రవంతి, ముమైత్ ఖాన్‌లు ఉన్నారు. అంటే కెప్టెన్ అయిన అఖిల్‌తో పాటు అజయ్, ఆరియానాలు ఈ వారం నామినేషన్స్ తప్పించుకున్నారు.

  English summary
  Bigg Boss Telugu Non Stop OTT First Season Running Successfully. Bindu Madhavi, Anchor Shiva and These five Members Got Nominated This Week.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X