For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Non Stop: పూల్‌లో పడిపోయిన లేడీ కంటెస్టెంట్.. ఊపిరాడక కొట్టుకుంటూ.. షో చరిత్రలో తొలిసారి!

  |

  చిత్ర విచిత్రమైన టాస్కులు.. కంటెస్టెంట్ల మధ్య గొడవలు.. లవ్ ట్రాకులు.. రొమాన్స్‌ ఇలా ఎన్నో సంఘటనలతో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోన్న షో బిగ్ బాస్. దేశంలోని ఎన్నో భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో వచ్చే దానికి మాత్రమే భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇండియాలోనే నెంబర్ వన్ షోగా మారిపోయింది. దీంతో నిర్వహకులు కూడా కొత్త కొత్త ప్రయోగాలతో వస్తున్నారు. ఇలా ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని.. ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్‌ను మొదలు పెట్టారు. ఇది కూడా మొదటి నుంచే రంజుగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఓ లేడీ కంటెస్టెంట్ స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయింది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

  ఒకరోజు ఆలస్యంగా బిగ్ బాస్

  ఒకరోజు ఆలస్యంగా బిగ్ బాస్

  తెలుగులో బిగ్ బాస్ ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్‌ మొదటి సీజన్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. 17 మంది కంటెస్టెంట్లతో 84 రోజుల పాటు సాగేలా దీన్ని మొదలు పెట్టారు. ఈ సీజన్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు స్ట్రీమింగ్ చేస్తున్నారు. అయితే, మధ్యలో ఆపి ఒకరోజు ఆలస్యంగా దీన్ని చూపిస్తున్నారు.

  Bigg Boss Non Stop: సరయు రాయ్‌పై చెక్కతో దాడి.. ఆరియానా తప్పుకు ఆమె బలి.. బిగ్ బాస్ వార్నింగ్

  సీనియర్స్ జూనియర్స్ పోటీ

  సీనియర్స్ జూనియర్స్ పోటీ

  సాధారణంగా బిగ్ బాస్ షోలోకి కొత్త సెలెబ్రిటీలే కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇస్తుంటారు. కానీ, నాన్ స్టాప్ సీజన్‌లో మాత్రం గత సీజన్లలో పాల్గొన్న పాత కంటెస్టెంట్లు కూడా అడుగు పెట్టారు. వాళ్లతో పాటు కొత్త వాళ్లు వచ్చారు. దీంతో మాజీలకు వారియర్స్ అని.. న్యూ కమర్స్‌కు చాలెంజర్స్ అని పేరు పెట్టారు. ఈ రెండు టీమ్‌ల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది.

  తగ్గేదేలే అంటూ కొత్త టాస్కు

  తగ్గేదేలే అంటూ కొత్త టాస్కు


  ప్రస్తుత వారానికి సంబంధించి కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్ బాస్ 'తగ్గేదేలే' టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా.. వారియర్స్ టీం సభ్యులు స్మగ్లర్స్‌గా.. ఛాలెంజర్స్ టీ సభ్యులు పోలీసులుగా మారారు. పోలీసుల కళ్లు కప్పి ఇంట్లో బొమ్మల్ని చెక్‌పోస్ట్ దాటించాల్సి ఉంటుంది. పోలీసులు వాళ్లను అడ్డుకోవాలి. ఇలా మొదటిగా ఎవరు టార్గెట్‌ని రీచ్ అవుతారో వాళ్లే టాస్క్ గెలుస్తారు.

  హాట్ షోలో గీత దాటిన సమంత: వీడియోలో అలా అందాలను ఆరబోస్తూ.. హాట్ హాట్‌గా!

  తారుమారు చేసిన బిగ్ బాస్

  తారుమారు చేసిన బిగ్ బాస్


  మొదటి రౌండ్‌లో భాగంగా వారియర్స్‌ను స్మగ్లర్లుగా చేయమన్నాడు బిగ్ బాస్. అందులో వాళ్లు తమకు ఇచ్చిన చాలెంజ్‌లను విజయవంతంగా పూర్తి చేశారు. ఇక, రెండో రౌండ్‌లో వాళ్ల పాత్రలను మార్చేశాడు. దీంతో చాలెంజర్లు స్మగ్లర్లుగా.. వారియర్స్ పోలీసులుగా మారారు. మొదటి రౌండ్‌ను బట్టి ఈ రెండు గ్రూపుల్లోని సభ్యులు సరికొత్త వ్యూహాలతో ముందుకు రావడం కనిపించింది.

  పూల్‌లో పడిపోయిన స్రవంతి

  పూల్‌లో పడిపోయిన స్రవంతి


  యాంకర్‌గా ఎంతో ఫేమస్ అయిన స్రవంతి చోకారపు ఈ సీజన్‌లో స్పెషల్ అట్రాక్షన్ అవుతోన్న విషయం తెలిసిందే. తనదైన ఆటతో ఆరంభం నుంచే అలరిస్తోన్న ఆమె.. అనారోగ్య కారణాలతో తగ్గేదేలే టాస్కును సరిగా ఆడలేకపోయింది. దీంతో ఆమె పలుమార్లు లోపలికి బయటకు తిరుగుతూ కనిపించింది. ఈ సందర్భంలోనే స్రవంతి చోకారపు స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయింది.

  హీరోయిన్ హాట్ ఫొటోను షేర్ చేసిన వర్మ: ప్రైవేట్ భాగాలను చూపిస్తూ దారుణంగా!

  సమయానికి కాపాడిన అజయ్

  సమయానికి కాపాడిన అజయ్

  తమ టీమ్ సభ్యులు లోపలి నుంచి చెక్క బొమ్మలను విసిరేస్తుండగా.. అనారోగ్యంగా ఉన్నా స్రవంతి బయట నుంచి వాటిని సేకరించింది. ఒక సందర్భంలో ఒక బొమ్మ స్విమ్మింగ్ పూల్‌లో పడింది. దీన్ని తీసేందుకు ఆమె పూల్‌లోకి దూకింది. కానీ, ఈత రాకపోవడంతో ఊపిరాడక కొట్టుకుంది. అప్పుడు అక్కడే ఉన్న అజయ్.. వెంటనే అందులోకి దూకేసి ఆమెను కాపాడాడు.

  సరయు కామెంట్.. గొడవలు

  సరయు కామెంట్.. గొడవలు

  అజయ్‌తో పాటు మిత్రా శర్మ కూడా నీటిలోకి దిగి స్రవంతిని పైకి తీసుకొచ్చింది. ఆ సమయంలో సరయు 'ఆడడానికి ఆరోగ్యం బాలేదు కానీ, పూల్‌లో దూకడానికి బాగుందా' అని అరిచింది. దీంతో స్రవంతి కోపంగా ఆమెపైకి దూసుకెళ్లింది. అంతేకాదు, ఆమెపై ఏడుస్తూ విరుచుకుపడింది. అంతలో స్రవంతిని కొందరు కంటెస్టెంట్లు వెనక్కి తీసుకొచ్చి సపర్యలు చేశారు.

  English summary
  Bigg Boss Telugu Non Stop OTT First Season Running Successfully. In Recent Episode.. Sravanthi Chokarapu Fell Down into Swimming Pool.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X