Don't Miss!
- News
Vastu tips: ఇంట్లో ఈ సింపుల్, పాజిటివ్ వస్తువులు పెట్టుకోండి.. ధనవర్షం కురుస్తుంది నమ్మండి!!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Sports
SA20 : అదరగొట్టిన ఆర్సీబీ కెప్టెన్.. సన్‌రైజర్స్ చిత్తు!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bigg Boss Non Stop : నటరాజ్ కాట్రాజ్.. అనిల్ కేటుగాడు.. ఆమె దొంగ **.. తేజస్వి షాకింగ్ కామెంట్స్
బిగ్ బాస్ ఐదేళ్ల క్రితమే తెలుగులోకి వచ్చినా ఇప్పుడు సరికొత్తగా ఓటీటీ వెర్షన్ తో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తోంది. మొదటి రోజు నుంచి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని విధంగా షాకింగ్ గా ఉంటోంది షో. తాజాగా ఈ షో నుంచి ఐదవ వారంలో తేజస్వీ మదివాడ ఎలిమినేట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆమె బయటకు వచ్చాక చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే

రీ ఎంట్రీ ఇచ్చి
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో అన్నీ వింతగా, షాకింగ్ కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఎలిమినేషన్ విషయం అయితే ఎవరూ ఊహించని విధగానే జరుగుతున్న. మొదటి వారం ముమైత్, రెండో వారం శ్రీ రాపాక, మూడో వారం చైతూ, నాలుగో వారం సరయు ఎలిమినేషన్స్ అందరికీ షాక్ ఇవ్వగా ముమైత్ రీ ఎంట్రీ ఇచ్చి మరీ షాకిచ్చింది.

హ్యాపీగా ఉండండి' అంటూ
అయితే ఐదో వారానికి నామినేషన్స్‌లో బిందు మాధవి, మిశ్రా శర్మ, యాంకర్ శివ, అరియానా గ్లోరీ, స్రవంతి చొక్కారపు, తేజస్వీ మదివాడ, అనిల్ రాథోడ్‌లు ఉండగా ఇందులో స్రవంతి, మిత్రా శర్మలకు తక్కువ ఓట్లు వస్తున్నాయి అని అంన్నారు కానీ చివరికి తేజస్వీ మదివాడ ఎలిమినేట్ అయింది.
ఎలిమినేట్ అయిన వెంటనే తేజస్వీ షాక్ అవడంతో పాటు ఏడ్చేసింది. లోపలే ఉన్న నటరాజ్ మాస్టర్ ఏడుస్తూనే ఉన్నా అతని దగ్గరకు వెళ్లిన తేజస్వీ 'మీరు కోరుకున్నది జరిగింది కదా ఇంకా ఎందుకు ఏడవడం.. ఇంకా హ్యాపీగా ఉండండి' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

కక్ష కట్టాడన్నట్లు
ఆ తరువాత ఆమె రవి హోస్ట్ చేస్తున్న బజ్ లో కూడా పాల్గొంది. హౌస్ లో ఎదుర్కొన్న పరిస్థితులు, ఆమె ఎలిమినేషన్ కు గల కారణాలు, ఇతర విషయాలపై తేజస్వి కంటెస్టెంట్స్ పైన ఆసక్తికర కామెంట్స్ చేసింది. మరీ ముఖ్యంగా తన ఎలిమినేషన్ కు నామినేట్ చేసి కారమైన నటరాజ్ మాస్టర్ పైన తేజస్వి మాదివాడ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. యాంకర్ రవి అడిగిన ప్రశ్నలకు తేజస్వి మాదివాడ టక టకా సమాధానమిచ్చింది. షోలో సంచాలకులు గా వ్యవహరించిన నటరాజ్ మాస్టర్ తనను పట్టించుకోలేదని తనపై కక్ష కట్టాడన్నట్లు తేజస్వి చెప్పికొచ్చింది.

కాట్రాజ్ అని
ఈ క్రమంలోనే అనిల్ 'కేటుగాడు' అని పేర్కొన్న తేజస్వి నటరాజ్ మాస్టర్ ను కాట్రాజ్ అని సంబోధించింది. ఇక అరియనా దొంగ ** అంటూ అనుచిత కామెంట్స్ చేసింది. ఆమె సరదాకి అనిందో లేక సీరియస్ గా అనిందో తెలియదు కానీ ఆమె చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. అయితే మహేశ్, అఖిల్ బాగా ఆడుతున్నారని అందుకే వారు ఈ షోలో ఇంకా ముందుకు వెళ్లాలని ఆకాంక్ష వ్యక్తం చేసింది.

మరిన్ని ప్లాన్ లు
ఇక ఈ షో ఆరో వారానికి సంబంధించి నామినేషన్స్ కూడా ఆసక్తికరంగా మారాయి. ఒకరి మీద అరుచుకుంటూ కంటెస్టెంట్లు రెచ్చిపోయారు. ఇక ఈ షో మరింత ఆసక్తికరంగా మార్చేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు మరిన్ని ప్లాన్ లు చేస్తున్నారు. చూడాలి మరి ఈ షో ఎలా సాగనుంది అనేది.