twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss non Stop: గత 5 సీజన్స్ లో బిగ్ బాస్ మోసం. బిందుమాధవి విషయంలో కూడా అలా చేస్తే..?

    |

    బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా వచ్చిన సెలబ్రిటీలు వారికంటూ ఒక స్పెషల్ క్యారెక్టర్ ను క్రియేట్ చేసుకోగలిగితేనే ప్రేక్షకుల మనసులో ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఎన్ని ఎత్తులు వేసినా కూడా గేమ్ లో నిజాయితీ ఉంటే తప్పకుండా ఆడియన్స్ సపోర్ట్ చేస్తారు అనేది చాలా సార్లు రుజువైంది. అయితే ఆడియన్స్ సపోర్ట్ ఎంత చేస్తున్నా కూడా ఒక విషయంలో బిగ్ బాస్ మాత్రం సమన్యాయం చేయడం లేదు అని కామెంట్స్ కూడా ఎక్కువగానే వస్తున్నాయి.

    ఇక ఈ సారి కూడా పరిస్థితులను చూస్తుంటే అదే తరహాలో బిగ్ బాస్ ముందుకు వెళుతున్నాడు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈసారి విన్నర్ విషయంలో తేడా జరిగితే మాత్రం బిగ్ బాస్ పై ఉన్న అభిమానం చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

    మొదటి సీజన్ లో అలా..

    మొదటి సీజన్ లో అలా..

    తెలుగులో బిగ్ బాస్ మొదటి సీజన్ మొదలైనప్పుడు ఆడియన్స్ అందరూ కూడా పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా షోను వీక్షించారు. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఉండడమే అప్పుడు మేజర్ ప్లస్ పాయింట్. కంటెస్టెంట్ ఎవరు వస్తున్నారు అనే విషయం కన్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ హోస్టింగ్ ఎలా చేస్తాడు అనే దానిపై ఎక్కువగా ఫోకస్ చేశారు.

    దీంతో అందులో ఎవరు గెలిచినా కూడా పెద్దగా అనుమానం పడాల్సిన అవసరం లేకుండా పోయింది. మొదటి సీజన్లో శివబాలాజీ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆదర్శ్ బాలకృష్ణ రన్నరప్ గా నిలిచాడు.

    రెండవ సీజన్

    రెండవ సీజన్

    ఇక రెండో సీజన్లో నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వచ్చాడు. అతనిపై నెగిటివ్ కామెంట్స్ అయితే చాలానే వచ్చాయి. ఒక విధంగా నాని ఆడియన్స్ రియాక్షన్స్ కు చాలా ఒత్తిడికి లోనయినట్లు అనిపించింది. ఆ సీజన్లో కౌశల్ ఫ్యాన్స్ మొత్తం నానికి ఎదురుతిరిగారు. చివరికి కౌశల్ విజేతగా నిలవగా రన్నరప్ గా గీత మాధురి గట్టిపోటీని అయితే ఇచ్చింది.

    నాగార్జునతో..

    నాగార్జునతో..

    ఇక మూడవ సీజన్ లో నాగార్జున ఎంట్రీ ఇచ్చే అలానే తన హోస్టింగ్ స్థానాన్ని కొనసాగిస్తున్నారు. మూడో సీజన్లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అతనికి పోటీగా శ్రీముఖి కూడా గట్టి పోటీ ఇచ్చింది. ఇక నాలుగవ సీజన్లో యువహీరో అభిజిత్ గెలుపొందగా అఖిల్ అదృష్టంతో ఫైనల్ వరకు వచ్చాడు. ఇక ఐదో సీజన్ లో షణ్ముఖ్ జస్వంత్ గెలుస్తాడు అని అందరు అనుకున్నారు కానీ ఊహించని విధంగా సన్నీ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు.

    అమ్మాయిలు విషయంలో..?

    అమ్మాయిలు విషయంలో..?

    అంతా బాగానే ఉంది కానీ బిగ్బాస్ ఫైనల్స్ లో ఇంతవరకు అమ్మాయిలు మాత్రం గెలవలేదు. ఐదు సీజన్స్ లో కేవలం రెండు సీజన్లలో మాత్రమే గీతామాధురి అలాగే శ్రీముఖి ఫైనాన్స్ వరకు వచ్చి రన్నరప్ గా నిలిచారు. చాలా వరకు బిగ్ బాస్ లో అమ్మాయిలపై పక్షపాతం చూపిస్తున్నారు అనే విధంగా కామెంట్స్ చాలానే వచ్చాయి.

    Recommended Video

    Bigg Boss Telugu OTT : Bindu Madhavi ప్రభంజనానికి అడ్డుపడుతున్న Akhil Sarthak | Filmibeat Telugu
    బిందుమాధవి గెలవకపోతే?

    బిందుమాధవి గెలవకపోతే?

    ఇక ఈ సారి మాత్రం బిగ్ బాస్ ఓటీటీ మొదటి సీజన్ నాన్ స్టాప్ లో అమ్మాయిల గెలుస్తారా లేదా అనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారుతోంది. ప్రస్తుతం అయితే అందరికంటే ఎక్కువగా బిందుమాధవి మంచి క్రేజ్ అందుకుంటోంది. కానీ అఖల్ గెలుస్తాడు అని మరొక టాక్ వినిపిస్తోంది. బిగ్ బాస్ కూడా సమ న్యాయం చేయడం లేదు అని కూడా చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మాత్రం బిగ్ బాస్ బిందు మాధవిని ఫైనల్ వరకు తీసుకు వెళ్లకపోతే చాలా వరకూ ప్రేక్షకులు అప్ సెట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

    English summary
    Bigg boss non stop telugu big doubts on final winners..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X