For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Non Stop: పెట్టారని చోట అఖిల్ చేయి పెట్టాడు అంటూ హామీదా ఏడుపు.. మొత్తం టచ్ చేసేశారు అని..

  |

  బిగ్ బాస్ నాన్ స్టాప్ షో రోజురోజుకు విభిన్నమైన టాస్క్ లతో ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. జరిగిన ఎలిమినేషన్స్ పై అనుమానాలు ఎన్ని వస్తున్నా కూడా బిగ్ బాస్ మాత్రం మళ్ళీ కష్టతరమైన టాస్క్ లతో ఆసక్తి పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఈ వారం బిగ్ బాస్ కొత్త తరహా టాస్క్ లను ప్రవేశ పెడుతున్నాడు. అయితే రీసెంట్ గానే అఖిల్ పెట్టరాని చోట చేయి పెట్టాడు అంటూ హామీదా ఏడ్చేసింది. మరొక వ్యక్తి కూడా అలానే ప్రవర్తించాడని ఆమె ఆరోపించింది అసలు ఏం జరిగింది అనేది వివరాల్లోకి వెళితే..

  జాగ్రత్తగా ఉండక పోతే..

  జాగ్రత్తగా ఉండక పోతే..

  బిగ్ బాస్ రియాలిటీ షోలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో అబ్బాయిలు జాగ్రత్తగా ఉండక పోతే మొదటికే మోసం వస్తుంది. గతంలో చాలా సార్లు ఆ ప్రభావం అయితే గట్టిగానే చూపించింది. ఫిజికల్ టాస్క్ ఉన్న సమయంలో అసభ్యంగా ఏమాత్రం తాకినట్లు అనిపించినా కూడా ఒక పాయింట్ బలంగా వినిపిస్తే కంటెస్టెంట్స్ తీవ్రపరిణామాలు ఎదుర్కోనే అవకాశం కూడా ఉంటుంది. ఇక పరిస్థితి చూస్తుంటే అఖిల్ ఈ వారం అలాంటి నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా అందుకునేలా ఉన్నాడు అనిపిస్తోంది.

  లైక్స్ వర్షం..

  లైక్స్ వర్షం..

  కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజ్ లో కంటెస్టెంట్స్ అందరూ కూడా ఈ వారం గట్టిగానే మాట్లాడుతున్నారు.. అయితే లైక్స్ వర్షం కురిపించిన బిగ్ బాస్ ఎవరైతే ఎక్కువగా లైక్స్ దక్కించుకుంటారో వారే ఛాలెంజ్ లో విన్నర్ గా నిలిచినట్లు అని చెప్పాడు. దీంతో గార్డెన్ ఏరియా లో కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒకరినొకరు తోసుకుంటూ లైక్స్ దక్కించుకోవడానికి ఎంతగానో పోరాటం చేశారు.

  ఫిజికల్ టాస్క్ లో గొడవలు

  ఫిజికల్ టాస్క్ లో గొడవలు

  ఇక ఈ ఫిజికల్ టాస్క్ లో కొంతమంది కంటెస్టెంట్స్ కు చిన్నపాటి గాయాలు కూడా అయ్యాయి. అయినప్పటికీ ఏ మాత్రం రెస్టు తీసుకోకుండా పోరాటం చేస్తూనే ఉన్నారు. మరికొందరి మధ్యలో మాత్రం వాదోపవాదాలు కూడా వచ్చాయి. తనకు దొరికిన లైక్ ను అన్యాయంగా తీసుకున్నారు అని ఆరోపణలు చేశారు.

  అక్కడ చేయి పెట్టాడు అంటూ..

  అక్కడ చేయి పెట్టాడు అంటూ..

  అయితే హమీద కూడా అఖిల్ నటరాజ్ మాస్టర్ పై కూడా ఆరోపణలు చేసింది. ముఖ్యంగా అఖిల్ అయితే తన కాళ్ళ మధ్యలో అక్కడ చెయ్యి పెట్టాడు అంటూ చాలా ఓపెన్ గా ధైర్యంగా చెప్పేసింది. లైక్ తనకు దొరికినప్పటికీ కూడా అక్కడ చేయి పెట్టి తీసుకోవడం దారుణంగా అనిపించింది అని కూడా ఆమె ఆరోపణలు చేస్తూ అఖిల్ ను ప్రశ్నించింది. ఆ తర్వాత నేను గేమ్ ఆడను.. మీరే ఆడుకోండి అంటూ ఆమె పక్కకి వెళ్ళి కూర్చుంది. అనంతరం వాష్ రూమ్ లోకి వెళ్లి కంటతడి పెట్టుకుంది.

  అఖిల్ కౌంటర్

  అఖిల్ కౌంటర్

  అయితే అఖిల్ మాత్రం నేను అలా చేయి పెట్టలేదు అంటూ.. నువ్వు ఇంకా ఆ లైక్ తీసుకోలేదు నీ కాళ్ళ దగ్గర పెట్టుకున్నావు అని అందుకే నేను తీసుకునే ప్రయత్నం చేశాను అని అన్నాడు. అంతేకాకుండా నేను అక్కడ చేయి పెట్టానని అబద్దాలు చెప్పకు అంటూ తన వాదనను వినిపించాడు. అనంతరం హమీద బెంచి మీద కూర్చుని ఏడుస్తూ ఉండటంతో అఖిల్ తను తీసుకున్న ఆ లైక్ తిరిగి ఇచ్చే ప్రయత్నం చేశాడు.

  Recommended Video

  Bigg Boss Telugu Non Stop: Contestants బోల్డ్ స్టేట్మెంట్స్ Trolls | Filmibeat Telugu
  అఖిల్ ను కౌగిలించుకున్న తేజస్వి

  అఖిల్ ను కౌగిలించుకున్న తేజస్వి

  అంతే కాకుండా నటరాజ్ మాస్టర్ కూడా అలానే ప్రవర్తించాడని చెప్పడంతో అతను కూడా ఆ లైక్ ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు. తనకు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ హమీద అందరిని కోపంగా చూస్తూ వాష్ రూమ్ లోకి వెళ్ళిపోయింది. ఇక ఆమెకు మద్దతుగా సరయు నిలబడే ప్రయత్నం చేసింది. ఇక మరొకవైపు అఖిల్ పై నిందలు పడుతుండడంతో తేజస్వి కౌగిలించుకొని ఓదార్చే ప్రయత్నం చేసింది. మరి ఈ వ్యవహారంపై నాగార్జున ఎలాంటి తీర్పు ఇస్తాడో వచ్చే వీకెండ్ వరకు ఎదురుచూడాల్సిందే.

  English summary
  Bigg boss non stop telugu Hamida Khatoon shocking comments on akhil sarthak
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X