For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Non Stop: మోసం.. ఎలిమినేషన్ చివర్లో ఏం జరిగిందటే.. కన్నీళ్ళతో అసలు నిజం చెప్పిన RJ చైతు

  |

  బిగ్ బాస్ నాన్ స్టాప్ మొత్తానికి సరికొత్తగా మొదలైనప్పటికీ కూడా ఏదో ఒక పొరపాటు జరుగుతోంది అని ప్రతివారం అనుమానాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా ఎలిమినేషన్ విషయంలో అయితే బిగ్ బాస్ ఏ విధంగా ఆలోచిస్తున్నాడు అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. సోషల్ మీడియా లో అయితే ఇప్పటి వరకు జరిగినా ఎలిమినేషన్ కరెక్ట్ గా లేవు అని చాలా రకాల కామెంట్స్ వెలువడుతున్నాయి. ఇక మూడో వారం నుంచి బయటకు వచ్చేసిన ఆర్జే చైతు విషయంలో కూడా చాలా మోసాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక అసలు చివరి రోజు ఏం జరిగింది ఎలా బయటికి వచ్చాను అనే విషయంలో చైతు ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.

  అసలు ఏం జరుగుతోంది?

  అసలు ఏం జరుగుతోంది?

  బిగ్ బాస్ నాన్ స్టాప్ షో మొదలవుతుంది అనగానే ఓ వర్గం ప్రేక్షకులలో అయితే అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే కంటెస్టెంట్స్ విషయంలో మాత్రం జనాలు ఈ సారి పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదు అని కూడా అర్థమైంది. ఎందుకంటే మళ్లీ పాత కంటెస్టెంట్స్ ను అలాగే పెద్దగా సెలబ్రిటీ హోదా లేని వారిని హౌస్ లోకి తీసుకురావడంతో నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి. దానికి తోడు ఎలిమినేషన్ లో అసలు ఏం జరుగుతోంది అనేది కూడా అర్థం కావడం లేదు అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

  వాళ్ళకి అర్హత ఉందా?

  వాళ్ళకి అర్హత ఉందా?


  మొదటి వారంలో ముమైత్ ఖాన్ బయటకు వెళ్లిపోవడం ఆ తర్వాత గ్లామరస్ బ్యూటీ శ్రీ రాపాక కూడా ఎలిమినేట్ అవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించింది ఒక విధంగా ఈ ఇద్దరూ బయటకు వెళ్లి పోవడానికి అర్హత ఉంది అన్నప్పటికీ కూడా వీరికంటే ఎక్కువ అవకాశాలు మిగతా వారికి ఉన్నాయి కనీసం వీళ్ళు పోరాడే ప్రయత్నం చేశారు. కానీ కొంతమంది అసలు ఎందుకు ఉన్నారు అని సందేహాలు చాలానే వస్తున్నాయి.

   షాక్ లో ఉన్నాను

  షాక్ లో ఉన్నాను

  ఇక మూడో వారంలో ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన ఆర్జే చైతు ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆర్జే చైతు మాట్లాడుతూ.. అసలు నేను బయటకు రావాల్సిన వ్యక్తిని. కాదు బిగ్ బాస్ ఫైనల్ 5 లో ఉండాల్సిన నేను ఇంత తొందరగా బయటకు ఎందుకు వచ్చాను అనేది నాకే ఆశ్చర్యం కలిగిస్తోంది. షాక్ లో ఉన్నాను.. అని అన్నాడు

  కావాలని ఇలా..

  కావాలని ఇలా..

  ఎలిమినేషన్ అని చెప్పినప్పటికీ కూడా నన్ను సీక్రెట్ రూమ్ కి పంపిస్తారేమో అని చివరి వరకు అనుకున్నాను. నా కళ్లకు గంతలు కట్టి బయటకు తీసుకువచ్చారు. సీక్రెట్ రూమ్ కి తీసుకు వెళ్తున్నారా అని నేను నాతో వచ్చిన వాళ్లను అడిగాను. కానీ అలాంటిదేమీ లేదు అని మీరు ఎలిమినేట్ అయ్యారు అని చెప్పగానే నా కళ్ళలో ఒక్కసారిగా నీళ్ళు తిరిగాయి. సాధారణంగా నేను దేనికి ఎమోషనల్ అవ్వను కానీ నేను ఉండాల్సిన స్థానంలో కావాలని తీసేశారు అనగానే ఆశ్చర్యపోయాను.. అని చైతు అన్నాడు

  ఓట్లు పడలేదా?

  ఓట్లు పడలేదా?


  నేను ఎందుకు ఎలిమినేట్ అయ్యాను అని ప్రశ్నించాను. మీకు ఓట్లు పడలేదు అని చెప్పారు. నేను గేమ్ సరిగ్గానే ఆడాను కదా అయినా కూడా ఎందుకు ఓట్లు పడలేదు. మిగతావారితో పోలిస్తే నేను అంత బ్యాడ్ కంటెస్టెంట్ లో ఏమీ కాదు కదా అని అనుకున్నాను. సోషల్ మీడియాలో కూడా చాలా వెతికాను. నాపై అసలు నెగిటివ్ కామెంట్స్ కూడా లేవు. అలాంటివి నేను ఎలిమినేట్ కావాల్సిన కంటెస్టెంట్ అనగానే నమ్మకం కుదరలేదు.. అని చైతు చెప్పుకొచ్చాడు.

  Recommended Video

  Bigg Boss Telugu Non Stop: Contestants బోల్డ్ స్టేట్మెంట్స్ Trolls | Filmibeat Telugu
  చాలా ఏడ్చాను

  చాలా ఏడ్చాను


  హౌస్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రతి రోజు బిగ్ బాస్ గురించి తలుచుకుంటూ బాధపడుతున్నాను. ఉదయం లేవగానే మైక్ కోసం వెతుక్కుంటున్నాను. ఏది ఏమైనా నేను మాత్రం ఫైనల్ 5 వరకు ఉంటాను అని గట్టి నమ్మకంతోనే హౌస్ లోకి అడుగు పెట్టాను. కానీ ఇంతలోనే ఇలా జరుగుతుందని ఊహించలేదు.. చివరలో స్టేజ్ మీద ఉన్నప్పుడు మళ్ళీ నాగార్జునగారు వెనక్కి పిలుస్తారేమో అని కూడా అనుకున్నాను. కమి అలా జరగలేదు. దాదాపు ఏడేళ్ల తర్వాత గట్టిగా ఏడ్చేశాను.. అంటూ చైతూ వివరణ ఇచ్చారు.

  English summary
  Bigg boss non stop telugu RJ chaitu clarification on behind the reason on elimination
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X