Don't Miss!
- News
vastu tips: నట్టింట్లో కూర్చుని జుట్టు దువ్వుకుంటున్నారా? అరిష్టం.. ఎందుకంటే!!
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Bigg Boss Non Stop: అషు రెడ్డి అతనికి భార్య.. తరువాత వెళ్లిపోయేది ఎవరంటే.. సరయు కామెంట్స్
బిగ్ బాస్ నాన్ స్టాప్ షో మొదలైనప్పటి నుంచి కూడా ఊహించని ట్విస్టులు చాలానే వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఎలిమినేషన్స్ లో అయితే ఎవరూ ఊహించని విధంగా కంటెస్టెంట్స్ బయటకు వెళ్ళి పోతూ ఉండటం విశేషం. బలంగా ఉన్నారని అనుకున్న కంటెస్టెంట్స్ చాలా తొందరగా బిగ్ బాస్ నుంచి పంపించి వేస్తున్నారు అనే కామెంట్స్ కూడా చాలానే వస్తున్నాయి. ఇక నాలుగవ వారం సెవెన్ ఆర్ట్స్ సరయు హౌస్ లో నుంచి వేగంగా బయటకు వెళ్ళిపోవడం గురించి ముందుగానే ఒక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇక ఆమె బయటకు వచ్చిన తర్వాత హౌస్ లో జరిగే డ్రామా అలాగే నెక్స్ట్ ఎలిమినేషన్ లో ఎవరు బయటకు వస్తారు అనే విషయంలో కూడా క్లియర్ గా వివరణ ఇవ్వడం విశేషం.

సరయు సంచలన ఆరోపణలు
వారియర్స్ వర్సెస్ ఛాలెంజర్స్ గోడవలతో బిగ్ బాస్ ఓటీటీ సక్సెస్ ఫుల్ ముందుకు సాగుతోంది. ఇక గత వారం ఎలిమినేషన్ లో ఎంతగానో పోరాడినప్పటికీ కూడా సరయు ఫైనల్ గా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆమె యాంకర్ రవి కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హౌస్ లో జరిగే పరిణామాలు ఒక డ్రామాను తలపిస్తున్నాయని చూస్తుంటే ఒక హిందీ సీరియల్ కూడా కొనసాగుతుంది అనే ఆలోచనలు వస్తున్నాయని చెప్పింది.

గ్రూపులుగా గేమ్ ఆడుతున్నారు
అసలు తాను ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ కాదు అని కావాలని తన మీద కక్ష కట్టి కొందరు టార్గెట్ చేసినట్లు ఆమె వివరణ ఇచ్చారు. ముఖ్యంగా కొంతమంది గ్రూపులుగా గేమ్ ఆడుతున్నారు అని చాలాసేపు సేఫ్ గా ముందుకు కొనసాగుతున్నట్లు తెలియజేసింది. ముఖ్యంగా అఖిల్, అజయ్, అషు రెడ్డి, స్రవంతి ఇలా నలుగురు ఓకే గ్రూపుగా గేమ్ మొదలు పెట్టారు అని వాళ్లలో మిగతా వాళ్ళని కలవకుండా దూరం పెడుతున్నారు అని కూడా సరయు చెప్పింది.

చిల్లర వేషాలు
ఒక విధంగా అఖిల్ ను గెలిపించాలని ఆ టీమ్ లో ముగ్గురు కంటెస్టెంట్స్ కూడా కష్ట పడుతున్నారు అని మిగతా హౌస్ మెంట్స్ ని ఒక తరహాలో అలాగే అఖిల్ ను మరొక తరహాలో చూపిస్తున్నట్లు అర్థమవుతోందని కూడా సరయు ఆరోపణలు చేసింది. ఒక విధంగా హౌస్ లో ఆ టీమ్ ఐతే చిల్లర వేషాలు వేస్తుంది అంటూ ముఖ్యంగా అశు రెడ్డి చాలా చిల్లరగా ప్రవర్తిస్తోందని కూడా సరయు తెలియజేసింది.

అషు అతనికి భార్యగా..
అయితే అఖిల్ విషయంలో అషు రెడ్డి ప్రవర్తిస్తున్న తీరు ఏమాత్రం బాగోలేదని అతనిని ఎవరైనా ఏమైనా అంటే ఆమె అసలు ఊరుకోవడం లేదు అని అతనికి భార్య అనే రేంజ్ లో అషు రెడ్డి ప్రవర్తిస్తున్న ట్లుగా అనిపిస్తోందని సరయు ఆరోపించింది. ఇక అజయ్ ను క్యాప్టెన్ చేసేందుకే చాలా సిల్లీ కారణాలు చెప్పి తనను హౌస్ లో నుంచి బయటకు పంపించారు అని సరయు తెలియజేసింది.

నెక్స్ట్ వెళ్లిపోయేది తనే..
ఈ రోజుల్లో అయితే బిగ్ బాస్ లో ఒక పెద్ద సీరియల్ నడుస్తోంది అని వీరందరికీ తల్లిలాగా స్రవంతి ప్రవర్తిస్తుందని సరయు చెప్పుకొచ్చింది. ఇక అఖిల్ అజయ్ ఇద్దరు కూడా తన కొడుకులు గా భావిస్తున్న శ్రవంతి అషు రెడ్డిని మాత్రం కోడలిగా భావిస్తోందని వీళ్ళ డ్రామా చూస్తే ఎవరికైనా సరే చాలా ఈజీగా క్లారిటీ వచ్చేస్తుందని తెలియజేసింది. అయితే ఈ నలుగురిలో ముందుగా హౌస్ లో నుంచి తల్లి శ్రవంతి వెళ్ళి పోవడం ఖాయమని కూడా సరయు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.