For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss OTT నాతో హద్దు మీరాడు.. అలా దారుణంగా అంటూ శిల్పాశెట్టి సోదరి ఫైర్

  |

  బిగ్‌బాస్ ఓటీటీ యమ రంజుగా సాగుతున్నది. గత రెండు రోజులుగా ఇంటిలో సెలబ్రిటీల మధ్య గొడవలు, అల్లరి, చిలిపి పనులతో ఆసక్తికరంగా సాగిపోతున్నది. వూట్స్ యాప్‌పై 24 గంటలపాటు లైవ్‌గా కొనసాగుతున్న ఈ షో ఆరువారాలపాటు కొనసాగుతుంది. ఆగస్టులో సల్మాన్ ఖాన్ ప్రారంభించే బిగ్‌బాస్ 15కు ముందు ప్రయోగాత్మకంగా ఈ షోను తొలిసారి ఓటీటీలో ప్రసారం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం జరిగింది. ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహర్ హోస్ట్‌గా, మలైకా అరోరా కో హోస్ట్‌గా ఈ షో ప్రారంభమైంది. తాజా ఎపిసోడ్‌కు సంబంధించి వివరాల్లోకి వెళితే..

  ప్రతీక్, దివ్య అగర్వాల్ మధ్య వాగ్వాదం

  ప్రతీక్, దివ్య అగర్వాల్ మధ్య వాగ్వాదం

  తాజా ఎపిసోడ్‌ల ప్రతీక్ సెహజ్‌పాల్, దివ్య అగర్వాల్ మధ్య హైడ్రామా నడించింది. వారిద్దరి మధ్య గొడవలు చోటుచేసుకోవడం, పదే పదే పోట్లాడుకోవడం జరిగింది. బ్రాత్రూం క్లీన్‌గా లేదనే విషయంపై ప్రతీక్, దివ్య మధ్య మాటల యుద్దం జరిగింది. బాత్రూం ఎవరు క్లీన్ చేస్తారనే విషయంపై పెద్ద రాద్దాంతం జరుగుతుండగా... షమితా శెట్టి జోక్యం చేసుకొంటూ ఫుడ్, కిచెన్ అంశాలను తీసుకొచ్చి ఈ గొడవను మరింత పెద్దగా చేసింది.

  తల్లిని తలచుకొని రిధిమా పండిట్

  తల్లిని తలచుకొని రిధిమా పండిట్

  ఇక రిధిమా పండిట్ ఎమోషనల్‌గా మారి కంటతడి పెట్టుకొన్నది. షమితా శెట్టి, సింగర్ నేహా భాసిన్ ముందు తన మరణించిన తల్లిని గుర్తు చేసుకొంటూ భోరుమని ఏడ్చింది. గత రెండేళ్లలో తన తల్లితో ఉన్న మధురస్మృతులను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయింది. దాంతో వారిద్దరూ రిధిమను ఊరడించే ప్రయత్నం చేశారు.

  నిషాంత్ హద్దు మీరాడని షమితా శెట్టి

  నిషాంత్ హద్దు మీరాడని షమితా శెట్టి

  దివ్య అగర్వాల్, షమితా శెట్టి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. తనతో ఓ సారి నిషాంత్ హద్దు మీరినట్టు షమితా వెల్లడించింది. నిషాంత్ వెకిలి ప్రవర్తనతో తాను ఇబ్బందికి గురయ్యాను. అందుకే అతడికి దూరంగా ఉంటున్నాను. నిషాంత్‌తో డిస్టెన్స్ మెయింటెన్ చేస్తున్నాను అని దివ్య అగర్వాల్‌కు షమితా శెట్టి వెల్లడించింది.

   అందుకే నిషాంత్‌కు దూరం అంటూ

  అందుకే నిషాంత్‌కు దూరం అంటూ

  దివ్యతో నిషాంత్ గురించి చెబుతూ.. నాతో చాలా దురుసుగా ప్రవర్తించాడు. ఆ సంఘటన గురించి వివరంగా చెప్పుకోవడం సరికాదు. కానీ నిషాంత్ తీరు మాత్రం నన్ను ఆందోళనకు గురిచేసింది. దాంతో నేను నిషాంత్‌ను గట్టిగా హెచ్చరించాను. నీవు చేసిన పని బాగాలేదు. నీవు తప్పు చేశావు అని అతడి ముఖం మీదే చెప్పాను. అప్పటి నుంచి మాట్లాడటం మానేశాను. అందుకే ఇప్పుడు కూడా నిషాంత్‌కు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాను. ఆ విషయాన్ని అతడితో మళ్లీ ప్రస్తావించదలచుకోలేదు. అందుకే తొలి రోజు నాకు పరిచయం ఉన్నాడనే విషయాన్ని ఏదో మొక్కుబడిగా చెప్పాను అని షమితా శెట్టి పేర్కొన్నారు.

   మరింత హీట్‌గా బిగ్ బాస్ ఓటీటీ

  మరింత హీట్‌గా బిగ్ బాస్ ఓటీటీ

  బిగ్‌బాస్ ఓటీటీలో కంటెస్టెంట్ల మధ్య సన్నిహిత సంబంధాల కంటే.. ఎక్కువగా గొడవలే కనిపిస్తున్నాయి. సెలబ్రిటీలు తమ అధిపత్యాన్ని కొనసాగించడానికి ఒకరిపై ఒకరు తమ టాలెంట్‌ను ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి గందరగోళం మధ్య షమితా శెట్టి, నేహా భాసిన్, దివ్య అగర్వాల్ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. దీంతో బిగ్‌బాస్ ఓటీటీకి మరింత క్రేజ్ పెరుగుతున్నది. రానున్న రోజుల్లో ఈ షో మరింత హీట్ పెంచే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది.

  Recommended Video

  30 రోజుల్లో ప్రేమించడం ఎలా ? Release Date ఫిక్స్
   13 సెలబ్రిటీలతో బిగ్‌బాస్ ఓటీటీ

  13 సెలబ్రిటీలతో బిగ్‌బాస్ ఓటీటీ

  Bigg Boss OTT షోలో మొత్తం 13 మంది సెలబ్రిటీలకు చోటు కల్పించారు. శిల్పాశెట్టి సోదరి షమితా శెట్టి, సింగర్ నేహా భాసిన్, నిషాంత్ భట్, కరణ్ నాథ్, జీషన్ ఖాన్, మిలింద్ గబా, ప్రతీక్ సెహజ్‌పాల్, రాకేష్ బాపట్, రిధిమా పండిట్, ఉర్పీ జావెద్, దివ్య అగర్వాల్, ఆకాంక్ష సింగ్, ముస్కాన్ జట్టన పాలొంటున్నారు. ఈ షోలో కాలికి గాయం కావడంతో కట్టుతో నేహా భాసిన్ ప్రవేశించింది. అయినా నేహా తన గ్లామర్‌తో షోను కలర్‌పుల్‌గా మార్చేస్తున్నది.

  English summary
  Bigg Boss OTT Show started with high note. Malaika Arora, Divya Agarwal, Shamita Shetty steal the show on firstday, Karan Johar got full marks as host. In latest episode, Shamita Shetty made sensational comments on Nishant.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X