Just In
- 1 hr ago
సింగర్ సునీత పెళ్లిపై రోజా సంచలన వ్యాఖ్యలు: ఆమె పిల్లలు ఎందుకు ఒప్పుకున్నారంటూ ఘాటుగా!
- 1 hr ago
ప్రదీప్ మూవీ ప్రెస్మీట్లో అపశృతి: స్టేజ్‌పైనే కుప్పకూలిపోయిన డైరెక్టర్.. ఆయన పరిస్థితికి కారణమిదే!
- 11 hrs ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 11 hrs ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
Don't Miss!
- News
నిమ్మగడ్డకు ప్రాణభయం: ఆయనపై తక్షణ చర్యలు: డీజీపీ సవాంగ్‌కు లేఖ
- Finance
హైదరాబాద్ సహా ఆల్ టైమ్ గరిష్టానికి పెట్రోల్, డీజిల్ ధరలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు
- Automobiles
మీకు తెలుసా.. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ కానుంది
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అభిజిత్‌కు తలకిందులుగా బిగ్‌బాస్ శిక్ష.. ఇంటిలో రాంగోపాల్ వర్మ సినిమా
బిగ్‌బాస్ ఇంటిలో 81వ రోజు లగ్జరీ బడ్జెట్ కోసం టాస్క్ కొనసాగింది. ఇంటిలో హౌస్‌లో దెయ్యం.. హౌస్‌మేట్స్‌లో ఎవరికి భయం అనే గేమ్‌ను 80వ రోజు నుంచి కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ గేమ్‌లో రెండు, మూడు రకాల గేమ్స్ ఆడించారు. సాంగ్స్ అండ్ డ్యాన్స్ ను కొనసాగిస్తూ టాస్క్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఇంటిలో ఇంకా ఏం జరిగిందంటే...

మిర్చి పాటకు జోష్‌గా డ్యాన్స్
ఇంటి సభ్యులందరూ మిర్చి మూవీ టైటిల్ సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. అనంతరం ఇంటి సభ్యులను ఇబ్బందులకు గురిచేసేందుకు జలజ అనే దెయ్యం ప్రయత్నిస్తున్నది. ఆ క్రమంలోనే ఇంటి సభ్యులందరీ ప్లేట్స్‌ను తీసేసుకొని అరటి ఆకులను పెట్టింది. ఇక ముందు చాలా రకాలు ఇబ్బందులు పెడుతానని చెప్పింది.

తలకిందులుగా అభిజిత్‌కు శిక్ష
ఇక ఇంటిలో ఇంగ్లీష్ భాష మాట్లాడినందుకు అభిజిత్‌కు పనిష్‌మెంట్ విధించారు. అరియానాతో అభిజిత్ ముచ్చటపెడుతుండగా.. బిగ్‌బాస్ హెచ్చరించాడు. మీరు తెలుగులో మాట్లాడండి అంటూ సూచించాడు. దాంతో జలజ తలకిందులుగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. దాంతో అభిజిత్ తలకిందులుగా ఉండి అఆ నుంచి ఱ వరకు చదివి వినిపించాలని సూచించారు. ఈ శిక్షను అభిజిత్ తలకిందులుగా ఉండి చదవడంతో శిక్ష పూర్తయింది.

ఇంటి సభ్యులకు ఆర్జీవి సినిమా
టాస్క్‌లో భాగంగా ఇంటిలో రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 12వ అంతస్తు సినిమాను కంటెస్టెంట్లకు చూపించారు. ఆ తర్వాత ఇంటి సభ్యులందరిని కన్ఫెషన్ రూమ్‌లో ఏర్పాటు చేసిన డ్రాకుల్లా డెన్‌లోకి ఒక్కొక్కరిని పిలిచారు. చీకటి గదిలో స్పూన్‌ను తీసుకోవాలని సూచించారు. ముందుగా అరియానా, అవినాష్‌ను పిలువగా భయంతో వణికిపోయారు. స్పూన్ తీసుకురాకుండానే బయటకు వచ్చేశారు.

డ్రాకుల్లా డెన్‌లోకి ఇంటి సభ్యులు
ఆ తర్వాత మోనాల్ వెళ్లి స్పూన్ తీసుకొని వచ్చింది. మోనాల్ తర్వాత సోహెల్, అఖిల్ లోనికి వెళ్లారు. వారిని స్పెషల్ ఎఫెక్ట్స్‌తో భయపెట్టారు. వారు భయపడుతూనే స్పూన్స్ కోసం వెతికారు. చివరికు ఎలాగో అలా స్పూన్స్ తీసుకొని బయట పడ్డారు. ఆ తర్వాత తాము భయపడిన విషయాన్ని వీడియోలుగా బయటకు చూపించవద్దు అంటూ వేడుకొన్నారు.