సల్మాన్, నాగార్జున, మోహన్‌లాల్.. బిగ్‌బాస్ హోస్ట్‌ల రెమ్యునరేషన్ ఎంత? టాప్ ఎవరు? ఎన్ని కోట్లంటే?

ఇండియాలో హిందీ సహా అన్ని ప్రాంతీయ భాషల్లో టెలివిజన్ రంగం రోజురోజుకు విస్తరిస్తోంది. బుల్లితెర రంగం లక్షలాది మందికి ఉపాధి కలిగిస్తూ.. వేల కోట్ల వ్యాపారం చేస్తోంది. కుటుంబ ప్రేక్షకులను అలరించేందుకు టెలివిజన్ దర్శక నిర్మాతలు రకరకాల కాన్సెప్ట్స్‌తో వస్తున్నారు. అయితే వందల కాన్సెప్ట్స్‌తో ఇప్పటి వరకు ఎన్నో షోలు, రియాలిటీ షోలు ఉన్నా.. బిగ్‌బాస్ క్రేజ్ వేరు. హాలీవుడ్‌లో మొదలైన ఈ కాన్సెప్ట్ ఇండియాలో ప్రవేశించి స్టార్ షోగా వెలుగొందుతోంది.

బిగ్‌బాస్‌పై విమర్శలు
తొలుత హిందీలో మొదలై బిగ్‌బాస్ 18 సీజన్లను పూర్తి చేసుకుని ఈ ఏడాది 19వ సీజన్‌లోకి అడుగుపెడుతోంది. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. మనుషులు వారి మనస్తత్వాలు.. కుటుంబానికి దూరంగా 3 నెలల పాటు 10 మంది వ్యక్తులతో 4 గోడల మధ్య గడపటమే బిగ్‌బాస్ కాన్సెప్ట్. ఈ కార్యక్రమానికి ప్రేక్షకుల ఆదరణ ఎంతగా దక్కిందో విమర్శలు అదే స్థాయిలో ఉన్నాయి. మనుషుల ఎమోషన్స్‌తో ఆడుకోవద్దని, అశ్లీలత తారాస్థాయికి చేరుకుందని కొందరు విమర్శించారు. పెళ్లి కానీ యువతి, యువకులు ఓకే గదిలో, ఒకే బెడ్‌పై పడుకోవడం కరెక్ట్ కాదంటూ సాంప్రదాయవాదులు మండిపడ్డారు. ఎన్ని విమర్శలు వచ్చినా బిగ్‌బాస్ టీఆర్పీ రేటింగ్స్‌లో దుమ్మురేపుతోంది. అన్ని భాషల్లోనూ ప్రతీ సీజన్ మంచి హైప్‌తో నడుస్తోంది.

Bigg Boss Salman Khan Akkineni Nagarjuna Mohanlal s Remuneration for Hosting Who take Highest pay cheque for in 2025

బిగ్‌బాస్ హోస్ట్‌ల రెమ్యునరేషన్ ఎంత?
బిగ్‌బాస్‌కు హిందీలో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్.. తెలుగులో అక్కినేని నాగార్జున, తమిళంలో కమల్ హాసన్, కన్నడంలో కిచ్చా సుదీప్, మలయాళంలో మోహన్‌లాల్ హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్నారు. మధ్యలో కొందరు హోస్ట్‌లుగా చేసినా ఎక్కువ సీజన్‌లకు వీరే హోస్టింగ్ చేశారు. తాజాగా అన్ని భాషల్లో సెప్టెంబర్‌‌లో బిగ్‌బాస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏ హోస్ట్‌కు ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు? టాప్‌లో ఎవరున్నారు అనే వివరాలు పరిశీలిస్తే..

సల్మాన్ ఖాన్
హిందీలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్‌కు ఎక్కువ సీజన్ల పాటు సల్మాన్ ఖానే హోస్ట్‌గా వ్యవహరించి దీనికి మరింత స్టార్ వాల్యూ తీసుకొచ్చారు. మీడియాలో వస్తున్న కథనాలను బట్టి ఇండియాలో బిగ్‌బాస్ హోస్ట్‌లలో అత్యధిక మొత్తం పారితోషికంగా తీసుకునేది సల్మానే. బిగ్‌బాస్ హిందీ 19 సీజన్‌కు గాను ఈ కండల వీరుడు 120 కోట్ల రూపాయల నుంచి 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని అంచనా.

అక్కినేని నాగార్జున
తెలుగులో బిగ్‌బాస్ అంటే నాగార్జున.. నాగార్జున అంటే బిగ్‌బాస్ అన్నంతగా నాగ్ ముద్ర వేశారు. బిగ్‌బాస్ తెలుగులో ఇప్పటి వరకు 8 సీజన్లు పూర్తవ్వగా తొలి సీజన్, రెండో సీజన్ తప్పించి మిగిలిన సీజన్లు అన్నింటికీ నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించారు. తన స్టైల్, గ్లామర్, మేనరిజంతో ఈ షోను సక్సెస్‌ఫుల్‌గా నడుపుతున్నారు నాగ్. త్వరలో ప్రారంభం కానున్న బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌కు గాను అక్కినేని నాగార్జున 30 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లుగా ఫిలింనగర్ టాక్.

మోహన్‌లాల్
బిగ్‌బాస్‌కు మలయాళంలో బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారు మోహన్‌లాల్. 2018లో ప్రారంభమైన తొలి సీజన్ నుంచి గత 6 సీజన్ల వరకు మోహన్‌లాలే హోస్ట్‌గా వ్యవహరించారు. త్వరలో ప్రారంభం కానున్న బిగ్‌బాస్ మలయాళం సీజన్ 7కు కూడా ఆయనే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజా సీజన్‌కు గాను మోహన్‌లాల్ 7 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X