»   » బిగ్ బాస్: టీషర్ట్స్ చించేశారు, మిర్చి మాలతో మంటెక్కిన అర్చన, బొంబాట్ సెల్ఫీ!

బిగ్ బాస్: టీషర్ట్స్ చించేశారు, మిర్చి మాలతో మంటెక్కిన అర్చన, బొంబాట్ సెల్ఫీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ 6వ వారంలోకి అడుగు పెట్టింది. సోమవారం మళ్లీ ఎలిమినేషన్ నామినేషన్ల తంతు మొదలవ్వడంతో బిగ్ బాస్ ఇంటి సభ్యుల్లో టెన్షన్ మొదలైంది. ప్రతి వారం తప్పనిసరిగా ఒకరు బయటకు వెళ్లాలనే సంగతి తెలిసిందే.

ఈ సారి నామినేషన్ల ప్రక్రియ వింతగా సాగింది. ఇంటి సభ్యులు ఎవరినైతే ఎలిమినేషన్‌కు నామినేట్ చేయాలనుకుంటారో వారి మెడలో ఎండు మిరపకాయల దండ వేయాలని బిగ్ బాస్ సూచించారు. అయితే ఎక్కువ మంది అర్చనకు మిర్చి దండలు వేశారు. ఆ తర్వాత శివ బాలాజీ, కత్తి కార్తీక, ధనరాజ్ కు మిర్చి దండలు పడ్డాయి.

అర్చన టార్గెట్

అర్చన టార్గెట్

అర్చన విషయంలో గత వారం చెప్పిన విషయాలనే మళ్లీ చెప్పారు. ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదని, అందుకే అర్చనను ఎలిమినేట్ చేస్తున్నట్లు ప్రిన్స్, కత్తి కార్తీక, ఆదర్శ్, హరితేజ, నవదీప్, శివ బాలాజీ, దీక్ష, ధనరాజ్ కారణాలు చెప్పారు.

Bigg Boss Telugu : Archana and deeksha tored their T-Shirts in the show.
మంటెక్కి పోయిన అర్చన

మంటెక్కి పోయిన అర్చన

అంతా కలిసి తనను టార్గెట్ చేయడంతో అర్చన మంటెక్కి పోయింది. తన పట్ల ఇంటి సభ్యులు ఇలా ప్రవర్తించడంపై ఫీలైంది. తాను తనలా ఉండటం తప్పా? అంటూ ఏడ్చినంత పని చేసింది.

శివ బాలాజీ

శివ బాలాజీ

అర్చన తర్వాత ఎక్కువ సంఖ్యలో మిరప మాలలు శివ బాలాజీకి పడ్డాయి. ప్రిన్స్, కార్తీక, అర్చన, ఆదర్శ్, నవదీప్, ధనరాజ్ శివ బాలాజీని నామినేట్ చేశారు. శివ బాలాజీ కోపం విషయంలో మారడం లేదని, అందుకే నామినేట్ చేస్తున్నట్లు తెలిపారు.

టీషర్టులు చించేశారు

టీషర్టులు చించేశారు

ముమైత్ బిగ్ బాస్ ఇంటిని వదిలే ముందు తన సందేశం రాసిన టీషర్టులు పంపారని... ఇంటి సభ్యులు వాటిని ధరించాలని, తమ టీ షర్టుపై ఉన్న సందేశం ఏ ఇంటి సభ్యులు నిజమని నమ్ముతారో వారు ఆ టీషర్టులను రోజంతా ధరించాలని, సందేశంతో ఏకీభవించని సభ్యులు వాటిని కత్తెరతో చించివేయాలని బిగ్ సూచించారు. అర్చనకు జలస్ అని, హరితేజకు నాన్ డిఫెన్సివ్ అని, ప్రిన్స్ కు గ్రీడీ అని, దీక్షకు ఫేక్ అని, ధనరాజ్ కు స్టుపిడ్ అని, శివ బాలాజీ ప్రౌడ్ అని, కార్తీకకకు రిజర్వ్డ్ అని, యాంబిషెస్ అని ఆదర్శ్ కు సందేశం రాసి పంపింది. అయితే ముమైత్ సందేశంతో ఏకీభవించని అర్చన, ప్రిన్స్, దీక్షలు తమ టీషర్టులు చించివేశారు.

బొంబాట్ సెల్ఫీ గేమ్

బొంబాట్ సెల్ఫీ గేమ్

ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయడం కోసం ఇంటి సభ్యులను రెండుగా విడగొట్టిన బిగ్ బాస్ వారితో బొంబాట్ సెల్పీ గేమ్ ఆడించారు. సెల్ఫీలు దిగడమే ఈ గేమ్ టాస్క్. అయితే ఒక టీం సెల్ఫీలో మరొకటీం సభ్యుల మొహాలు పడకుండా చూసుకోవడమే టాస్క్. ఈ గేమ్ చాలా ఫన్నీగా సాగింది.

English summary
Bigg Boss Season 1, Episode 37 details are The contestants vote out Shiva Balaji and Archana, who don't take it too kindly. Later, Bigg Boss assigns a selfie task to the contestants.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu